Telugu Tv Serial Karthika Deepam 14.04.25

ఇది నవ వసంతం

అదే స్పందన

కార్తీకదీపం సీరియల్. ఇది మాటీవీలో సూపర్ హిట్ అయిన సంచలన సీరియల్. ఈ సీరియల్ మొదటి సీజన్ కుటుంబ ప్రేక్షకులు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సీజన్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వస్తున్న సెకండ్ సీజన్ కూడా, మొదటి సీజన్ కి ఏ మాత్రం తగ్గకుండా అందర్నీ అలరిస్తోంది. ముఖ్యంగా ఈ సీరియల్లో దీప, కార్తీక్ పాత్రలు తెలుగు నాట ఎప్పటికీ గుర్తుండిపోయే వెండితెర పాత్రలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు కార్తీకదీపం నవవసంతం కూడా అదే తరహాలో ఆకట్టుకొంటోంది. ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకూ రాత్రి 8 గంటలకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతోంది. ప్రతి ఎపిసోడ్ మంచి ట్విస్ట్ తో ఎండ్ అవుతూ, ఆసక్తికరంగా సాగుతున్న కార్తిక దీపం నవవసంతం ఈరోజు ఎపిసోడ్ స్టోరీ చూద్దాం.

Telugu Tv Serial Karthika Deepam 14.04.25 కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దశరద్ కి సీరియస్ గా ఉందని నర్స్ బయటకు వచ్చి చెబుతుంది. నీవలనే ఇదంతా అంటూ కార్తీక్ పై ఫైర్ అవుతాడు శివ నారాయణ. సుమిత్ర, తాత కలిపి వార్నింగ్ ఇస్తారు కార్తీక్ కి. కార్తిక్ ఎన్ని చెప్పినా వినరు. పూర్తిగా ఏం జరిగిందో ఎక్కడ తెలుసుకోండి.

ఎపిసోడ్ హైలెట్స్

  • హాస్పిటల్ కి వచ్చిన కార్తీక్
  • బయటకి పో అన్న శివనారాయణ
  • పారిజాతం వెటకారం
  • సౌర్య పై కార్తీక్ సీరియస్
  • కాంచన కి విషయం చెప్పిన కార్తీక్

ప్రాణానికి ప్రాణం

నాన్నకు ఏం కాదు

బుల్లెట్ గాయమైన దశరథకు ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. శివ నారాయణ, సుమిత్ర జోష్ణ, పారిజాతం ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే నర్సు బయటకు రావడంతో మా వాడికి ఎలా ఉందమ్మా? అని శివ నారాయణ అడుగుతాడు. ఆపరేషన్ జరుగుతుంది. కండిషన్ చాలా సీరియస్ గా ఉందని నర్సు అంటుంది. దీంతో శివనారాయణ, సుమిత్ర మరింత కంగారు పడతారు. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. డాడీకి ఏం కాదు అంటూ సుమిత్రను వదరుస్తుంది జోష్ణ.

కార్తీక్ పోరా…

మామయ్య దశరథకు ఎలా ఉందో తెలుసుకుందామని ఆసుపత్రికి కంగారుగా వస్తాడు కార్తీక్. అయితే మామయ్యకి ఎలా ఉందని తాత శివ నారాయణని కార్తీక్ అడుగుతాడు. ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటూ శివ నారాయణ కార్తీక్ పై ఫైర్ అవుతాడు. ఎలా ఉంది? అని కార్తీక్ మళ్ళీ అడుగుతాడు. పోరా బయటికి అంటూ శివనారాయణ తోసేస్తాడు. కొట్టినా పర్లేదు, మామయ్యకు ఎలా ఉందో చెప్పాలని కార్తీక్ అడుగుతాడు.

దీప కోసం కంగారు పడుతున్నావా?

మామయ్యకు ఎలా ఉంది అని సుమిత్రని అడుగుతాడు కార్తీక్. మా ఆయనకు ఏమైనా జరిగితే దీపకి అన్యాయం జరుగుతుందని భయపడుతున్నావా? అని కన్నీళ్లు తో సుమిత్ర అంటుంది. లేదు దీప ఎలాంటిదో నీకు బాగా తెలుసు అని కార్తీక్ సుమిత్రతో అంటాడు. సుమిత్ర మాత్రం బాధలో చాలా మాటలు అంటుంది.

కారణం నువ్వే

నాకు అన్యాయం చేసింది దీప కాదు నువ్వే… నా భర్త చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం దీప కాదు నువ్వే అని సుమిత్ర బాధగా అంటుంది. డాడీని షూట్ చేసింది దీప అయితే బావ ఏం చేశాడని జోష్ణ అంటుంది. అంతా చేసింది మీ బావే అని సుమిత్ర అరుస్తుంది. ఈరోజు కుటుంబం ఇలా బాధపడినందుకు కారణం మీ బాబాయ్ అని జోష్ణతో అంటుంది సుమిత్ర. నేనా? అని కార్తీక్ అడిగితే, అవును రా నువ్వే అని చెబుతుంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంతో గుండె ఆగిపోయేలా ఉందని ఏడుస్తుంది.

దీప మెడలో తాళి

నేనేం చేసే అత్తా అని కార్తీక్ సుమిత్ర అని అడుగుతాడు. దీప మెడలో తాళి కట్టావురా అని అంటుంది. దీపని నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నిందిస్తుంది. దీప మెడలో తాళి కట్టి రెండు కుటుంబాలను ఎప్పుడూ కలవలేని శత్రువులను చేసావని సుభద్ర అంటుంది. ఆ మాటకు కార్తీక్ తల్లిడిల్లి పోతాడు. జ్యోష్ణ ని పెళ్లి చేసుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని అంటుంది.

నీ మేనమామ ని కాల్చింది రా

మా ఇంటి ఆడపడుచు కాంచనను కలుపుకుపోవాలని మేము చాలా మెట్లు దిగొచ్చామని సుమిత్ర అంటుంది. కానీ దీప మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తుందని ఆగ్రహిస్తుంది. నువ్వు సమర్ధిస్తున్నానని కార్తీక్ పై ఫైర్ అవుతుంది. దీప మీ ఇంటికి రావడం నాకు తెలియదని కార్తీక్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

తెలియదు రా నీకు? నీకేం తెలియదు అంటూ సూర్యనారాయణ అందుకుంటాడు. నిశ్చితార్థం అప్పుడు గౌతమ్ కడుపు చేసాడని ఎవరో అమ్మాయిని తీసుకుని రావడం, ఇవన్నీ పట్టించుకున్నావా? అంటే నిజంగానే తెలియదు తాత అని కార్తీక్ అంటాడు. ద్వీప స్వయంగా నీ మేనమామనే కాల్చింది రా అని బాధపడతాడు శివ నారాయణ.

ఆ బుల్లెట్ దశరద్ కి తగలకపోయి ఉంటే, జోష్ణకు తగలేదని నారాయణ అంటాడు. అంటే దీప ఉద్దేశం మనవరాలను చంపాలనే కదా అని అడుగుతాడు. కాదు అని కార్తీక్ బాధగా తల ఊపుతాడు. నీకేం చెప్పకుండానే ఇవన్నీ నీ భార్య చేస్తుందా? అవి నమ్మడానికి చేతకాని ఎవరూ లేరని శివ నారాయణ అంటాడు.

నేను చేతకాని వాడిని

అవును నేను చేతకాని వాడిని తాత అని గట్టిగా అరుస్తాడు కార్తిక్. అందుకే ఎవరు తిట్టినా, కొట్టినా భరించానని నిన్ను వదులుకోలేకపోయానని అదే నా చేతకానితనం అని కార్తీక్ అంటాడు. అవమానాలు పడ్డానని, బంధాల కోసం మనుషులను కాపాడుకోవడంలో నా చేతకానితనం ఉందని చెబుతాడు. ఇప్పుడు కూడా మామయ్య కోసమే వచ్చారని కన్నీళ్ళతో కార్తీక్ అంటాడు. నువ్వు వచ్చిందే నీ మేనమామకు ఏమైనా అయితే, దీపకి ఏమవుతుందో అనే కంగారులో వచ్చావని పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది.

ప్రాణానికి ప్రాణం

ఇప్పుడైనా దీపని వదిలిపెడతాడని అనుకుంటున్నావా? అని శివ నారాయణ ఆగ్రహంగా చెబుతాడు. వీడి పెళ్ళాం మళ్ళీ జీవితంలో బయటకు రాలేదు అని చెబుతాడు. దీప మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని పసిగట్టి ఉంటే, చేయాల్సిన శాస్తి ఏనాడో చేసి ఉండేవాడినని అరుస్తాడు.

దశరథ్ నా ఒక్కగానొక్క కొడుకు మాత్రమే కాదు. నా ఆస్తికి, నా పరపతికి, నా పరువుకు, నా పంచప్రాణాలకు వాడే వారసుడు. వాడికి ఏమి కాకపోతే నీ భార్య కనీసం జైలులో అయినా ఉంటుంది. ఏదైనా అయిందో ప్రాణానికి ప్రాణం లెక్క కట్టాల్సిందే. అని గట్టి వార్నింగ్ ఇస్తాడు శివ నారాయణ. ప్రాణాలతో వదిలిపెట్టనని హెచ్చరిస్తాడు శివ నారాయణ.

తాను గొడవ పడేందుకు రాలేదని, మామయ్యని చూడటానికి వచ్చానని కార్తీక్ బాధగా అంటాడు. అవసరం లేదని అరుస్తాడు శివ నారాయణ. నా భర్తను ఎవరు చూడాల్సిన అవసరం లేదని సుమతి అంటుంది. లోపల ఆపరేషన్ జరుగుతుంది. కండిషన్ సీరియస్ గా ఉందంట అని చెబుతుంది. ఏం జరుగుతుందో ఇంకా డాక్టర్లు చెప్పలేదని అంటుంది. నీ భార్య ఎవరో ఒకరు చావు చూసే వరకు ప్రశాంతంగా నిద్రపోదని ఏడుస్తుంది సుమిత్ర.

ఇక్కడి నుండి వెళ్ళిపో

నీకు దండం పెడతాను, వెళ్ళిపో అని కార్తీక్ పై గట్టిగా అరుస్తుంది సుమిత్ర. మీరు కావాలనుకుని ఆశపడ్డానని ఆ పాపానికి పెద్ద బహుమతి ఇచ్చారు వెళ్ళు అని అంటుంది. కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కళ్ళ ముందు పెళ్ళాం ఉంటే ఎవరూ కనపడరు కదా అని పారిజాతం ఉంటుంది. వెళ్ళిపో బావ అని జోష్నా కూడా చెబుతుంది. తప్పు చేసిన మనిషి తరఫున నువ్వు ఎందుకు మాట పడతావ్. దీప ఏం చేసిందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ చేతికి అంటుకున్న రక్తపు మరకలే దీప చేసిన పాపానికి సాక్ష్యం అని జోష్నా అంటుంది. దీంతో దశరద్ రక్తం అంటుకున్న తన చేతులను కార్తీక్ చూసుకుంటాడు.

నా కొడుకు దగ్గరికి రావొద్దు

ఇప్పుడు నువ్వు ఓదార్చినా, వినేవారు వినిపించుకునేవారు ఎవరూ లేరని జోష్నా అంటుంది. డాడీకి ఏం కాదని డాక్టర్ చెప్పే వరకూ తాము మామూలు మనుషులం కాలేమని చెబుతుంది. ప్లీజ్ బావ వెళ్ళిపో అని అంటుంది. మీ అమ్మ మీ చెల్లి మీ బావమరిది ఆ అనసూయ కట్టకట్టుకుని వస్తారేమో, ఎవరూ ఇక్కడికి రావడానికి వీల్లేదని నారాయణ అంటాడు. వస్తే ఎలాంటి మర్యాద చేయాలో నాకు తెలుసు అని హెచ్చరిస్తాడు.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

కన్నీళ్ళతో కార్తిక్

అలాగే నువ్వు కూడా ఇక రావద్దు ఇక పోరా అని శివ నారాయణ అరుస్తారు. దీంతో బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. శివ నారాయణ సుమిత్ర మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ మెట్లు దిగుతాడు. బాధగా వెళుతుంటాడు. సుమిత్ర కూడా బోరున ఏడుస్తుంది.

సౌర్య పై విరుచుకుపడ్డ కార్తిక్

దీపలేదని తడబాటు

అమ్మ, నాన్న ఇంకా ఎందుకు రాలేదు అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ వస్తాడు. నానమ్మ కిందపడిపోయింది అని కార్తిక్ తో సౌర్య అంటుంది. ఏమైంది అని కార్తీక్ అంటే, లో బిపి వచ్చినట్టుంది అని కాంచన చెబుతుంది. ఇంతకీ అమ్మ ఏది అని అడుగుతుంది సౌర్య కార్తిక్ ని. ఏం చెప్పాలో తెలియక ఆలోచనలో పడతాడు కార్తీక్. రౌడీ నీకు హోంవర్క్ ఏమీ ఇవ్వలేదా? అని సౌర్యను కార్తీక్ అడుగుతాడు.

Telugu Tv Serial Karthika Deepam 14.04.25

దీప స్టేషన్లో ఉందని కార్తిక్ చెబుతాడు. స్టేషన్లో ఉండడమేమిటి అని కాంచన అడుగుతుంది. పనిమీద వేరే ఊరికి వెళ్లేందుకు బస్ స్టేషన్ కి వెళ్లిందని అబద్ధం చెపుతాడు కార్తీక్. నాతో చెప్పకుండా ఎలా వెళుతుందని శౌర్య ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. వర్క్ చేసుకోకుండా ఇన్ని ప్రశ్నలు అవసరమా? లోపలికి వెళ్లి చదువుకో అంటూ చిరాకు పడతాడు. సౌర్య లోపలికి వెళుతుంది.

కాంచన దగ్గర ఏడ్చేసిన కార్తీక్

దీప మీ తాత ఇంటికి వెళ్లలేదా? అని కాంచన అడుగుతుంది. కార్తీక్ మౌనంగా ఉంటాడు. ఒరేయ్ మాట్లాడవేంటి రా అని కాంచన అంటుంది. దీంతో ఏడుస్తూ అక్కడికక్కడే మోకాళ్ళపై కుప్పకూలిపోతాడు కార్తీక్. దీపకి ఏం కాలేదు కదా అని కంగారుగా అడుగుతుంది కాంచన. దీప గన్ పట్టుకున్నప్పుడు దశరథుకు బులెట్ తగలడం, తాను గన్ పేల్చలేదని దీప చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటాడు. సుమిత్ర, శివ నారాయణ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడతాడు.

షాక్ లో కాంచన అనసూయ

దీపకి ఏమైంది?

మిమ్మల్ని ఇలా చూస్తుంటే భయంగా ఉంది కార్తీక్ బాబు, దీపకి ఏమైందో చెప్పాలని అనసూయ అడుగుతుంది. అమ్మ ఇది నువ్వు విని తట్టుకోలేవని నాకు తెలుసు. కానీ చెప్పాలి అని చెప్పడానికే భయంగా ఉందని, దీప బస్ స్టేషన్ లో లేదు. పోలీస్ స్టేషన్లో ఉంది అని కార్తీక్ నిజం చెబుతాడు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. జ్యోష్ణ కి, దీపకు గొడవ అయ్యింది. మాటలతో దీపని రెచ్చగొట్టింది. దీప ఆ కోపంతో గన్ తీసుకొందట. ఆ గన్ ఫైర్ అయింది. బుల్లెట్ మామయ్యకు తగిలింది అని కార్తీక్ చెబుతాడు. దీంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ఇలా ముగిస్తుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. MORE UPDATES PLEASE FALLOWE THIS SITE.

Leave a Comment