Jagadeka Veerudu Athiloka Sundari Re-Release On 9th May

వెండితెర అద్భుత దృశ్య కావ్యం

జగదేకవీరుడు అతిలోక సుందరి

Jagadeka Veerudu Athiloka Sundari Re-Release On 9th May పనిగట్టుకుని ప్రయత్నిస్తే అద్భుతాలు క్రియేట్ అవ్వవు. అది కాకతాళీయంగా, అనుకోకుండా అన్ని కలిసి వచ్చి అలా జరగాలంతే. అలాంటి వెండితెర అద్భుతాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఒకటి. చిరంజీవి సినిమా కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ ఒక మరపురాని అపురూప దృశ్య కావ్యంగా ఇప్పటికీ నీరాజనాలు అందుకొంటోంది. దాదాపు 35 సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు చేసిన వెండితెర మాయాజాలం మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధం అయ్యింది. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ఇవే.

ఆంధ్రా టు అమెరికా

ఒకటే మెగా సందడి

ఒక కొత్త సినిమా రిలీజ్ కి ఎలాంటి హంగామా ఉంటుందో ప్రస్తుతం జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కి కూడా అలాంటి సందడే నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ టికెట్స్ బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అక్కడ కూడా రికార్డ్ స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి న్యూ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. వాటన్నిటికీ లేని సందడి, ఇటు ఫిలిం ఇండస్ట్రీలోనూ ఈ సినిమాకి ఉండడానికి కారణం ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడం. అందుకే ఇటు ప్రేక్షకుల్లోనే కాదు, అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ “జగదేకవీరుడు అతిలోక సుందరి” మానియా 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది.

అదే ఈ సినిమా స్పెషల్

ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాలను డైరెక్ట్ ప్రొడ్యూసర్లు కాకుండా, వేరే వాళ్ళు రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల పెద్దగా క్వాలిటీ లేని చాలా సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను మాత్రం నిర్మాణ సంస్థ అయినా వైజయంతి మూవీస్ బయటి వాళ్లు ఎవరికీ రైట్స్ ఇవ్వకుండా, వాళ్లే సొంతంగా భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఈ సినిమా ప్రింట్ కోసం, క్వాలిటీ కోసం వైజయంతి మూవీస్ సంస్థ చాలా శ్రమ పడినట్టుగా ఈమధ్య ఒక వీడియో విడుదల చేశారు.

వీరమల్లు వీరంగం | Hari Hara Veeramallu Movie
వీరమల్లు వీరంగం | Hari Hara Veeramallu Movie

ఒరిజినల్ నెగెటివ్ కోసం వేట

దాదాపు 35 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ నెగిటివ్ దాదాపుగా పూర్తిగా పాడైపోయింది. అది ఎందుకూ పనికిరాదని తెలిసిన తర్వాత, ఈ సినిమా నెగిటివ్ కోసం నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు చాలా శ్రమించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మారుమూల థియేటర్ కి ఫోన్ చేసి “జగదేకవీరుడు అతిలోకసుందరి” నెగిటివ్ కోసం ఎంక్వయిరీ చేశారు. దాదాపు 8 ఏళ్ల శ్రమ తర్వాత విజయవాడలో అప్పారావు అనే వ్యక్తి దగ్గర ఈ సినిమా ప్రింట్ దొరికింది. అతనొక సినిమా ప్రదర్శకుడు. అయితే అది పూర్తిగా కలర్ షేడ్ అయిపోయి, మరకలు పట్టి, కొన్ని చోట్ల తెగిపోయి ఉండడంతో, దాన్ని ప్రాసెసింగ్ చేయడం కోసం చిత్ర యూనిట్ చాలా శ్రమించింది. చాలా ఖర్చు చేసి ఈ అపురూప చిత్రాన్ని మళ్ళీ ఈతరం లో చూసే అదృష్టాన్ని సినీ లవర్స్ కి కలిగించింది.

4K నే కాదు, 3D లో కూడా

సినిమా రంగంలో పూర్తిగా డిజిటల్ యుగం స్టార్ట్ అయిన తర్వాత నెగటివ్స్ అనేవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా ప్రింట్ ని సంపాదించి, మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది నిజంగా ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ప్రేక్షకులంతా క్వాలిటీకి అలవాటు పడ్డారు. ఇలాంటి టైంలో క్వాలిటీ ఏమాత్రం తక్కువ అయినా జనాలు తిరస్కరించే అవకాశం ఉంది. అయినా గాని ఎంతో రిస్క్ చేసి ఇప్పటివరకూ భారతీయ సినిమా చరిత్రలో లేనివిధంగా ఈ సినిమాకి వైజయంతి మూవీస్ సంస్థ భారీ వ్యయం ఖర్చు చేస్తోంది. మామూలుగా 4k క్వాలిటీ నే గొప్ప అనుకుంటే, ఏకంగా ఈ సినిమాని త్రీడీలో కూడా కన్వర్ట్ చేశారు. ఏకంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో జగదేకవీరుడు 3Dలో తన మెగా విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యాడు. మిగతా ఏరియాలలో కూడా ఈ సినిమా 4k వెర్షన్ తో పాటు 3D వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

మే 9 రిలీజ్

చిరంజీవికి ప్రత్యేకం

మే తొమ్మిదో తారీఖు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. 1990 మే 9న జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజ్ అయింది. ఆ సమయానికి ఆంధ్రాలో భారీ తుఫాను విజృంభిస్తోంది. భారీ తుఫాను దాటికి తట్టుకుని జగదేకవీరుడు కలెక్షన్ల సునామీనే సృష్టించాడని చెప్పాలి. కొన్ని ఏరియాల్లో వరద నీరు థియేటర్లోకి చేరినా ప్రేక్షకులు నిలబడి సినిమా చూసిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. తెరపై జగదేకవీరుడుగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన అభినయం, అతిలోకసుందరి శ్రీదేవి సౌందర్యం ముందు తుఫాను తలంచిందని చెప్పాలి. చిరంజీవి కెరీర్ లోనే ఒక అపురూప చిత్రరాజంగా “జగదేకవీరుడు అతిలోకసుందరి” ప్రత్యేకంగా నిలిచింది.

tourist family movie updates
Tourist Family Movie Review In Telugu 03/06/2025

మళ్ళీ రిపీట్

దాదాపు 35 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదే డేట్ కి ఇప్పుడు సరికొత్తగా తయారైన జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదల అవుతుండటం మరో విశేషం. 1990లో మే 9న జగదేకవీరుడు అతిలోకసుందరితో సూపర్ డూపర్ గ్రాండ్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత సంవత్సరం 1991లో అదే డేట్ కి “గ్యాంగ్ లీడర్” తో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత 92లో ఏప్రిల్ 9న వచ్చిన ఘరానా మొగుడు కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ రకంగా చూస్తే తొమ్మిదో తారీఖు అనేది మెగాస్టార్ కి సూపర్ సక్సెస్ అందించిన లక్కీ డేట్.

Jagadeka Veerudu Athiloka Sundari Re-Release On 9th May

సినిమా హైలెట్స్

ఒకటా రెండా? సినిమానే హైలెట్

  • జగదేకవీరుడిగా చిరంజీవి నవరస నటనా చాతుర్యం
  • అతిలోక సుందరి అంటే ఇలా ఉంటుందా అన్నటుగ్గా కట్టి పడేసిన శ్రీదేవి సౌందర్యం
  • వైజయంతి మూవీస్ అతి భారీ నిర్మాణ విలువలు
  • విన్సెంట్ కెమెరా మ్యాజిక్కులు
  • పిల్లలు మెచ్చే ఎన్నో సీన్స్
  • ఆంధ్ర దేశాన్ని ఊపేసిన ఇళయరాజా పాటలు
  • చిరంజీవి, శ్రీదేవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ
  • అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్ విలక్షణ విలనిజం

తెలుగు సినిమాల్లోనే ప్రత్యెక స్థానం

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమా ప్రస్థానంలోనూ జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక మైలురాయి లాంటి విజయం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన ఎన్నో భారీ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక ప్రత్యేక స్థానం. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అతి భారీ విజయాన్ని అందుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. 90లలో చిరంజీవి సినిమాలు థియేటర్లో చూసిన అభిమానులు నిజంగా అదృష్టవంతులు అంటూ ఈ జనరేషన్ యూత్ చిరంజీవి సినిమాలు, పాటల వీడియోల కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. అప్పట్లో చిరంజీవి మానియాను, ఆరాను థియేటర్స్ లో చూడలేని ఈ తరం ప్రేక్షకులకు ఇదొక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందటంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లాపాపలతో మరోసారి జగదేకవీరుడు వీరత్వాన్ని, అతిలోకసుందరి సౌందర్యాన్ని ఈనెల 9 నుండి మారోసారి కనులారా వీక్షించవచ్చు.

Leave a Comment