Gundeninda Gudigantalu Serial 29/04/2025

గుండె నిండా గుడిగంటలు టైటిల్ కి స్ఫూర్తి

Gundeninda Gudigantalu Serial 29/04/2025 జనరల్ గా తెలుగు టీవీ సీరియల్స్ కి తెలుగు సినిమాలని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సీరియల్ కథ, కథనం విషయంలో గానీ, సీరియల్ కి సంబంధించిన టైటిల్ విషయంలో గానీ, సినిమాలనే ప్రామాణికంగా తీసుకుంటారు, “గుండె నిండా గుడి గంటలు” సీరియల్ విషయానికి వస్తే గుండె నిండా గుడి గంటలు అనే మాట జగపతిబాబు హీరోగా నటించిన శుభాకాంక్షలు సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ లో మొదటి లైను.

“గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే” అనే సూపర్ హిట్ పాటలోని లైన్స్ ని ఈ సీరియల్ కి టైటిల్ గా తీసుకున్నారు. ఆ సినిమాలోని ఆ పాట లాగే, స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కూడా సూపర్ హిట్ అయ్యి, వీక్షకులను అలరిస్తోంది. సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ని ముందుగానే హాట్ స్టార్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం లో చూడవచ్చు. హాట్ స్టార్ లో చందారులుగా చేరిన వారు మిస్ అయిన పాత ఎపిసోడ్స్ కూడా చూడవచ్చు. ఇక ఈరోజు 29 ఏప్రిల్ గుండెనిండా గుడిగంటలు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోకండి

ప్రభావతి పంచ్ డైలాగ్

దేవుడి పటాలకు దండం పెట్టుకున్న తర్వాత బాలు, మీనా సత్యం ప్రభావతి కాళ్లకు మొక్కుతారు. సంతోషంగా కాపురం చేసుకోండని తండ్రి సత్యం దీవిస్తే, నీ పెళ్ళాంతో మళ్లీ పెళ్లయినందుకు చాలా సంతోషం…ఇక లేవండి సంతోషంగా ఉండండి అంటూ నిట్టూరుస్తుంది ప్రభావతి. మీ ఇద్దరికీ ఇష్టం లేని పెళ్లి చేసానని, కాపురం ఎలా ఉంటుందోని భయపడ్డానని, కానీ మీరు ఇలా ఆనందంగా ఉండడం నాకు చాలా నచ్చిందని తండ్రి సత్యం అంటాడు, మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా, పెళ్లి రోజులు మాత్రమే చేసుకోండి అని ప్రభావతి అనటంతో రోహిణి నవ్వుతుంది.

ఇదే మా అసలైన పెళ్లిరోజు

నేను ముందుగా పెళ్ళి అయినప్పుడు మీనా మొహం కూడా చూడలేదని, నన్ను వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నాను అని బాలు అంటాడు. ఈరోజు మీనా కళ్ళల్లోకి చూస్తూ సంతోషంగా తాళికట్టానని అంటాడు. నేను కూడా ఆ పెళ్లి నిలబడదని, అప్పట్లో భయపడ్డానని మీనా చెప్తుంది. ప్రభావతి మూతి విరుస్తుంది. ఇదే మా అసలైన పెళ్లి రోజు నాన్న.. ఇకనుండి ఇదే డేట్ కి మేమిద్దరం మ్యారేజ్ డే చేసుకుంటామని బాలు సత్యంతో అంటాడు. మీరు ఇంత ఆనందంగా ఉంటే అంతకంటే అంతకంటే కావలసింది ఏముంది అంటాడు సత్యం.

శోభనం కావాలన్న బాలు

కామాక్షి అత్తని, రంగారావు మామయ్యని ఇద్దరినీ పిలిపించండి అంటాడు బాలు. ఎందుకురా అని తండ్రి అడిగితే.. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన వాళ్ళు ఉంటారు కదా, ఈరోజు మా శోభనానికి ఏర్పాట్లు చేయాలని అనగానే, అలా అంటున్న బాలు నోరు మీనా మూసేస్తుంది. అక్కడున్న వాళ్లంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. నవ్వుకుంటారు. బాలుని లాక్కుంటూ మీనా లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ప్రభావతి పుస్తెలు కొన్నందుకే, మీనా బాలు గాడిని మళ్లీ పెళ్లి చేసుకుంది. వెంటనే మీ నాన్నను బంగారం తీసుకురమ్మను రోహిణి అంటుంది ప్రభావతి. ఇంట్లో ఏం జరిగినా తిరిగి తిరిగి నా మీదకే వస్తుందని మనసులో అనుకుంటుంది రోహిణి.

వడ్డీ డబ్బుల కోసం గుణ

రాజేష్ కి వార్నింగ్

గుణ వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి శివతో కలిసి, రాజేష్ మిగతా ఫ్రెండ్స్ ఉన్నచోటికి వస్తాడు. ఇది మా బావ బాలు ఉండే చోటు నేను రానని, నువ్వే వెళ్లి వసూలు చేసుకో అని శివ, గుణతో అంటాడు. లోపలికి వచ్చిన గుణ అక్కడున్న రాజేష్ ని మిగతా వాళ్ళని వడ్డీ డబ్బులు ఇవ్వు ఇమ్మని అడుగుతాడు. ఒకరిద్దరు వడ్డీ డబ్బులు ఇస్తారు. రాజేష్ దగ్గర మాత్రం వడ్డీ కట్టడానికి డబ్బులు ఉండవు. తర్వాత ఇస్తానని చెప్పడంతో, గుణ రాజేష్ మీద సీరియస్ అవుతాడు. రాత్రిలోగా వడ్డీ డబ్బులు కట్టాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజేష్ ని హెచ్చరించి గుణ, అతని మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

చిట్టీ పాడకపోయవా?

వాడితో అలాగా తిట్టించుకోకపోతే, చీటీ పాడి వడ్డీ డబ్బులు కట్టొచ్చు కదా అని రాజేష్ ఫ్రెండ్ రాజేష్ తో అంటాడు. బాలు కి చిట్టి డబ్బులు అవసరమయి చిట్టి పాడుకున్నాడు. నాకంటే ఆ టైంలో బాలుకే డబ్బులు ఎక్కువ అవసరం.. అందుకనే ఆ చీటీ నేను పాడలేకపోయాను అంటాడు రాజేష్. ఏదోలాగా సర్దుబాటు చేసి గుణాకి డబ్బులు కడతానని రాజేష్ అంటాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

వంటగదిలో మీనా

ఎలకల మందు

వంట గదిలో వంట చేసే పనిలో బిజీగా ఉంటుందిమీనా. అక్కడికి వచ్చిన ప్రభావతి ఇంకా వంట అవ్వలేదా అంటూ అడుగుతుంది. వంట త్వరగా చేయమని ఆకలవుతుందని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని అంటే, మీనా ఏమీ మాట్లాడకుండా అదోలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఎలకల ముందుగాని పెడతావా ఏంటి అంటుంది ప్రభావతి. నేను ఎందుకు అలా చేస్తానని మీనా అనడంతో, ఏమో నువ్వు బాలు గాడు కలిసి అలా చేసినా చేస్తారు అంటుంది.

ఇద్దరూ చాలా ఎక్కువ చేస్తున్నారు

మమ్మల్ని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకుంటారు అంటూ బాధపడుతుంది మీనా. ఇంట్లో అందరూ తన మాట వింటున్నారని, మీరిద్దరే మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని మీనా తో ప్రభావతి అంటుంది. ఏదైనా మనం చూసే చూపును బట్టి ఉంటుందని మీనా అనడంతో, మీ ఇద్దరి ఆటలు మామూలుగా లేవు అంటుంది ప్రభావతి. దేని గురించని అడగగానే మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు అన్నట్టుగా ప్రభావతి అంటుంది. మా ముందు పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయిందో మీకు బాగా తెలుసు మూడు ముళ్ళు అనేవి భర్త ప్రేమతో భార్య మెడలో వేసే బంధనాలని మన సాంప్రదాయాలు చెప్తున్నాయి. ఇప్పుడు బాలు తనతో ప్రేమగా ఉంటున్నాడని కొత్త జీవితం ప్రారంభమైంది అనిపించి మళ్లీ పెళ్లి చేసుకుందామని అంటుంది మీనా.

కూరలో కరివేపాకు

నువ్వు నాటకాలు ఆడకు ఆ రోజు చేసిన శపధంలో గెలవడానికి అలా చేసావు నువ్వు అంటుంది ప్రభావతి. మీతో శపధాలు చేసి గెలవాలనుకునేటంత మూర్ఖురాలిని కాదు అని మీనా అనడంతో నువ్వు అలాంటి దానివే అంటుంది ప్రభావతి. నేను ఎలా చెప్పినా, మీరు అలాగే అర్థం చేసుకుంటారని సైలెంట్ అయిపోతుంది మీనా. బాలు కొంత బంగారం తెచ్చినందుకే ఎగిరెగిరి పడుతున్నావు కదా, వాడు బంగారం తీసుకురావడం ఇదే మొదటిసారి ఇదే లాస్ట్ గుర్తుపెట్టుకో అంటుంది ప్రభావతి. నాకిది చాలు అత్తయ్య నేను సర్దుకుంటాను అంటుంది మీనా. ప్రభావతి తో మాట్లాడటం ఇష్టం లేక వంట చేయడంలో నిమగ్నం అయిపోతుంది. వంట చేస్తూ తనని కరివేపాకుతో పోల్చడంతో ప్రభావతి అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది.

బాలు పెళ్లి ఫోటో రగడ

ప్రభావతి అక్కసు

హాల్లో సత్యం కూర్చుని ఉంటాడు. శృతి వచ్చి ఆంటీ వంట అయిందా ఆకలేస్తుంది అని అడిగితే మీనా రెడీ చేస్తుందని చెప్తుంది ప్రభావతి. ఇంతలో బాలు ఫోన్ తీసుకుని వచ్చి అందులోని ఒక ఫోటో చూపించి ఈ ఫోటో ఎలా ఉందో చెప్పు అంటాడు సత్యం తో. అందులో మీనాకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న బాలు ఫోటో ఉంటుంది. ఇది ఎప్పుడు తీసుకున్నారు అని అడిగితే, పెళ్లిలో తీసుకున్నామని చెప్తాడు బాలు. ఇంతలో ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు.

అందరూ బాగుంది అంటారు

ఫోటో చాలా బాగుంది అంటాడు సత్యం. ఇంతలో మీనా కూడా అక్కడికి రావడంతో మనమిద్దరం హీరో హీరోయిన్ లా ఉన్నాము అని నాన్న అంటున్నాడు అంటాడు బాలు. మిగతా వాళ్ళు కూడా ఫోన్ తీసుకుని ఆ ఫోటో చూసి చాలా బాగుంది అంటారు. ఇంతకుముందు పెళ్లి అయినప్పుడు ఇలాంటి ఫోటోలు దిగలేదా అని అడిగితే అప్పుడు ఫోటోలు దిగే మూడ్ లేదు అంటాడు బాలు. మనోజ్ చూసి బానే ఉంది కానీ ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది అంటాడు. శృతి కూడా చూసి చాలా బాగుందంటుంది. సరిగ్గా చూసావా శృతి అంటూ సాగదీస్తుంది ప్రభావతి.

వాడో రాజు..ఈవిడో రాణి

వాళ్ళని అడిగే బదులు నువ్వే ఫోటో చూడొచ్చుగా అంటాడు సత్యం. ఈయన ఒక రాజు ఆవిడ ఒక రాణి వీళ్ళ ఫోటోలు చూసి నేను తరించాలా అంటుంది ప్రభావతి. ఏదో పెద్ద విషయం లాగా ఇంత చేస్తారేంటి అంటుంది. ఇదే మాకు పెద్ద విషయం అంటాడు బాలు. వాడేదో ముచ్చటపడి తీసుకున్న ఫోటోలు చూపిస్తుంటే ఎందుకంత రాద్ధాంతం చేస్తావ్ అంటాడు సత్యం. ఈ ఫోటోని ప్రేమ్ కట్టించి పెట్టుకుంటామని బాలు అనగానే, మన బెడ్ రూమ్ లో పెట్టుకుందాం అంటుంది మీనా. ఆ బెడ్ రూమ్ నీకు ఎవరు రాసి ఇవ్వలేదు అంటుంది ప్రభావతి.

Gundeninda Gudigantalu Serial 29/04/2025

అందరి ఫొటోస్ పెడదాం

హాల్లో పెడతాం అంటాడు బాలు. హాల్లో ప్లేస్ ఎక్కడ ఉంది అంటుంది ప్రభావతి. మనోజ్ ఫోటో పెట్టడానికి ప్లేస్ ఉంది కానీ, మా ఫోటో పెట్టడానికి లేదా అని బాలు అంటాడు. సర్లేండి వదిలేయండి అని మీనా అనగానే, నన్ను ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతానంటూ బాలు అంటాడు. ఇప్పటివరకూ చిన్న ఫోటో ఉంటే చాలు అనుకున్నాను. పెద్ద ఫోటో చేయించి ఇక్కడ హాల్లో పెడతాను అంటాడు బాలు. నువ్వు ఎలా పెడతావో నేను చూస్తాను అంటుంది ప్రభ. ఇంతలో సత్యం పిల్లలు పెళ్లి ఫోటోలు పెట్టొద్దంటావేంటి మన ఇంట్లో అందరి ఫోటోలు కట్టించి ఈ గోడల మీద పెడదాం అంటాడు సత్యం.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

బెడ్ రూమ్ లో బాలు కి సర్ప్రైజ్

బెడ్ మీద పూలు

మీనా బెడ్రూంలో పూలు కడుతూ ఉంటుంది. ఏంటి బెడ్ ఇంకా ఎలా ఉంది? అంటాడు బాలు. నువ్వు మంచి చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకుని రెడీగా ఉంటావేమో అనుకున్నాను అంటాడు. నువ్వు రెడీగా లేనందుకు నేను అలిగాను అంటాడు బాలు. జోలపాడమంటారా అంటుంది మీనా. ఉదయం పెళ్లి ఏర్పాట్లు చేసినట్టుగానే, రాత్రి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తావని ఊహించుకున్నాను అని అంటాడు. పెళ్లి జరిగిన తర్వాత, ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరగాలి కదా అంటాడు బాలు. మీనా బయటకు వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని అడుగుతాడు. మిక్సీ పట్టాలి అని మీనా చెప్పగానే నా మనసును కూడా మిక్సీ పట్టి దోసలేసుకుని బాగా తిను అని అలుగుతాడు.

దుప్పటి తీయమని చెప్తుంది మీనా. దుప్పటి తీయగానే బెడ్ మీద అందమైన పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి బాలు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీనా సిగ్గుపడుతూ నవ్వుతుంది. ఇది కదా నిజమైన సర్ప్రైజ్ అంటాడు బాలు. ఇదేగా మీరు కోరుకుంది అనగానే రా మరి అంటాడు. ఎక్కడికి రాను మీరు ఏదో అలంకరించమన్నారని అలంకరించాను. అనగానే మీనా చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు బాలు. నాకోసం కష్టపడి మంగళసూత్రం తీసుకొచ్చారు కదా? అని మీనా అంటే అందుకని బెడ్ డెకరేట్ చేసావా అని బాలు అంటాడు.

ఈ ఏర్పాట్లు గురించి అందరికీ చెప్పి వస్తానని బయటకి కంగారుగా వెళుతుంటే, బాలుని పట్టుకుని మీనా వెనక్కి లాగేసి వాటేసుకుంటుంది. ఏదైనా మాట్లాడు మీనా అనగానే, రేపు నాలుగు మాలలు ఆర్డర్ ఉంది అంటుంది. ఏ టైం లో ఏ విషయాలు మాట్లాడాలో నీకు తెలియదు అన్నట్టుగా బాలు అంటాడు. ఇంకా ఏదో మాట్లాడుతుండడంతో మాటలేనా ఇంకేమీ లేవా అని మీనా అనడంతో అమ్మ దొంగ అంటూ మీనాని పట్టుకుంటాడు బాలు.

మనోజ్ కలవరింతలు

రోహిణి కంగారు

మనోజ్ పడుకుని ఉంటే రోహిణి బెడ్ రూమ్ లోకి వస్తుంది. నిద్రలో ఉన్న మనోజ్ ఇడ్లీ, దోస, వడ, మసాలా దోశ అంటూ కలవరిస్తూ ఉంటాడు. అది విని రోహిణి షాక్ అవుతుంది. మళ్లీ మనోజ్ అలాగే అనడంతో మనోజ్ ని నిద్ర లేపుతుంది. ఏమైంది అని అడుగుతాడు. నిద్రలో ఏవేవో కలవరిస్తున్నారు అనగానే మనోజ్ తెల్ల మొహం వేస్తాడు.

సత్యం కి అస్వస్థత

దోమల మందు కొట్టిన శృతి

హాల్లో శృతి దోమలకి మందు స్ప్రే చేయడంతో అక్కడున్న మీనా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇంతలో హాల్లోనే ఉన్న సత్యంకి ఆ వాసన పడక ఇబ్బంది పడతాడు. ఊపిరి తీసుకోవడానికి సత్యం ఇబ్బంది పడుతూ ఉండడంతో, సత్యాన్ని తీసుకుని మీనా హాస్పిటల్ కి వెళ్తుంది. మధ్యలో బాలు కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. బాలు కంగారు పడతాడు.

గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రత్యేకతలు

  • పాత్రలు సన్నివేశాలు అన్నీ కూడా చాలా సహజంగా ఉంటాయి.
  • ప్రతి సీరియల్ లోను కనిపించే విపరీత పోకడలు ఉండవు
  • సహజత్వం నిండిన పాత్రలు
  • మంచి మంచి డైలాగులు
  • నటుల సెటిల్ పెర్ఫార్మన్స్

ఈ సీరియల్ కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుంది. రేపటి ఎపిసోడ్ కూడా మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కిందనున్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

Leave a Comment