సీరియల్ ప్రత్యేకత
కుటుంబ కథ
ఎన్ని సినిమాలు వస్తున్నా, ఎంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతున్నా టీవీ సీరియల్స్ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు టీవీ సీరియల్స్ అంటే కేవలం ఆడవాళ్ళకే అనే అపోహ ఉండేది. ఒక్కసారి టీవీ సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తే, ఇక రెగ్యులర్ గా దాన్ని ఫాలో అవ్వాలి అనిపిస్తుంది. అందుకే మగవాళ్ళు కూడా ఈమధ్య టీవీ సీరియల్స్ కి ఆకర్షితులవుతున్నారు. అలాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో మాటీవీలో ప్రసారమవుతున్న గుండె నిండా గుడిగంటలు ఒకటి. కుటుంబ కథగా అలరిస్తున్న ఈ సీరియల్ విశేషాలు చదవండి.
టీఆర్పి రేటింగ్ లో టాప్
Gundeninda Gudigantalu Serial – 24/03/2025 మాటీవీ ప్రసారం చేస్తున్న సూపర్ హిట్ సీరియల్స్ లో గుండె నిండా గుడిగంటలు ప్రేక్షకుల ఆదరణతో ముందుకు దూసుకుపోతుంది. ఎపిసోడ్ కు, ఎపిసోడ్ కు మంచి ట్విస్టులతో ముందుకు వెళ్తున్న ఈ సీరియల్ టీఆర్పి రేటింగ్స్ లోనూ తన సత్తా చాటుతోంది. ప్రతీ ఎపిసోడ్ లో ఆకట్టుకునే కథ, కథనాలు, మంచి మంచి డైలాగులు, పాత్రల క్యారెక్టర్జేషన్తో ఆకట్టుకొంటోంది. గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం..
ఎపిసోడ్ హైలెట్స్
- మీనాపై పడిన నిందను చెరిపేసిన శ్రుతి
- ఉగాదికి రమ్మని షీలా ఫోన్
- రోహిణి నాన్నను రమ్మన్న ప్రభావతి
- ఏం చేయాలో తెలియక దివ్య తో చెప్పిన రోహిణి
- మటన్ కొట్టు మాణిక్యం..కథలోకి కొత్త పాత్ర
సీక్రెట్ బయట పెట్టిన శృతి
మీనాకి ఏం సంబంధం లేదు
ఇంట్లో అందరూ కూడా మీనా దే తప్పు అంటున్నారని, గదిలో కెళ్ళి గోల్డ్ తీసి అదంతా కారులో దాచేసి ఏమీ తెలియనట్టుగా గొడవ చేసిందని, ఆవిడ కారులో దాచడం అనుకోకుండా తను తీసిన వీడియోలో కనిపించిందని, కానీ ఈ విషయంలో ఏ సంబంధం లేని మీనాని అందరూ తప్పు పడుతున్నారని శృతి అంటుంది. అయ్యబాబోయ్ అదే తీసి, అదే గొడవ చేసిందా? అంటూ ఆశ్చర్యపోతుంది ఈ మాట వినగానే ప్రభ. ఆ మాట విన్నఆమె భర్త సత్యం.. విన్నావా ప్రభ అనవసరంగా మీనాని అపార్థం చేసుకున్నావు అని అంటాడు. ఆ మాటకి.. బాలు, ఆవిడకి డబ్బు ఉన్నవాళ్లే గొప్ప వాళ్ళ కింద కనబడతారు. ఇక వీడైతే రోజు ఏం చేయమన్నా చేస్తాడు.అని రవిని ఉద్దేశించి అంటాడు.
గొడవ అయ్యేది
నువ్వేంటి ఆ విషయం అప్పుడే చెప్పకుండా, ఆవిడ వెళ్లిపోయిన తర్వాత చెప్తున్నావని బాలు శృతి తో అంటాడు. చెప్తే ఏం చేసేవారు గొడవ చేసేవాళ్లు. దాంతో తిరిగి ఆ సంజయ్ ఆ గొడవని ఇంకా పెద్దది చేసేవాడు. ఫైనల్ గా ఇద్దరూ కలిసి కొట్టుకునేవాళ్లు. మీ అందరి మధ్యలో మన మౌనిక ఎంత నలిగిపోతుందో ఆలోచించారా? అంటుంది శృతి. ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలీక బాలు సైలెంట్ అవుతాడు. మిగతా అందరూ కూడా శృతి మాటలకు మౌనంగా చూస్తూ ఉండిపోతారు.
దొరికితేనే దొంగ
బంగారం దొరికిన తర్వాత ఆవిడ ఎంతగా మారిపోయిందో, ఆవిడ ప్రవర్తన ఎలా మారిందో, ఎలా ఉందో మీరంతా చూశారు కదా అంటుంది శృతి. అవును ఆవిడ పద్ధతి పూర్తిగా మొత్తం మారిపోయిందని షాక్ అయినట్టు అంటాడు రవి. బయట చాలా తిట్టానని, వీడియో చూపించి నువ్వే దొంగవు అని అందరికీ చెప్తానని బెదిరించానని, అలా బెదిరించేసరికి మొత్తానికి దిగి వచ్చిందని శృతి అంటుంది. నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి అంటాడు రవి. నిజమే అన్నట్టు చూస్తారు.. బాలు, ప్రభ.
శ్రుతికి పొగడ్తలు
నువ్వు చేసిన పనికి చాలా థాంక్స్ శృతి.. నా మీద పడిన నింద పోగొట్టడమే కాకుండా, ఫంక్షన్ అంతా బాగా గ్రాండ్ గా జరిగేటట్టు చేసావు అని మీనా శృతి తో అంటుంది. రోహిణి కూడా తనకు సపోర్ట్ చేసిందని అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, శృతి, రోహిణిలకు మీనా కృతజ్ఞతలు చెప్తుంది. ఇదంతా అవాక్కై చూస్తున్న ప్రభను బాలు ఏడిపిస్తూ గొంతులో పచ్చి వెలక్కాయ పడిందా? అంటాడు .అమ్మ సంగతి నీకు తెలిసిందే కదరా.. ఆవిడ ఎందుకు అలా చేసింది అంటావ్ అంటాడు బాలు తండ్రి సత్యం.
ఫంక్షన్ సక్సెస్
ఆవిడ వచ్చిన దగ్గర్నుంచి కూడా, ఫంక్షన్ ఆపు చేద్దామని ప్రయత్నం చేసిందని, మనల్ని బాగా రెచ్చగొట్టిందని అయినా గానీ మనం పట్టించుకోకుండా ఉన్నాం కాబట్టి పుస్తెలతాడు మింగేసింది. వీడు లక్షల మింగేసినట్టు అని బాలు మనోజ్ ని ఉద్దేశించి అంటాడు. దానికి అసహనంగా చూస్తాడు మనోజ్. ఆవిడ కూతుర్ని సంజయ్ చేసుకోలేదని అక్కసు ఆవిడకు ఉంది అంటుంది రోహిణి. సర్లే మొత్తానికి ఈ ఫంక్షన్ అంతా బాగా జరిగింది అంటాడు ప్రభ భర్త సత్యం. ఈ క్రెడిట్ అంతా బాలుదే అంటారు అందరూ. అవునవును ఖర్చు చేయనివాళ్ళకే పేరు అని ప్రభ అనేటప్పటికీ, అయ్యో అంటూ అమ్మని చూసి బాలు తల కొట్టుకుంటాడు.
షీలా డార్లింగ్ ఫోన్
ఇంతలో సత్యం ఫోన్ రింగ్ అవుతుంది. అది చూసి ఆనందంగా మొహం వెలిగిపోతుంది. ఎవరు మీ అమ్మగారా? అంటుంది ప్రభ. అవును అంటాడు. మీ మొహం అంతలా వెలిగిపోతున్నప్పుడే అనుకున్నాను అంటుంది. నా మొహానికి అలా వెలిగిపోయే ఛాన్సలేదే అంటూ బాలు నిట్టూరుస్తాడు. దానికి ప్రభ బాలుని చిన్నగా కొడుతుంది. మీరంతా ఆగండిరా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతాడు. క్షేమ సమాచారాలు తెలుసుకున్న తర్వాత ఎందుకు చేసావ్ అమ్మ అని అడుగుతాడు.
ఉగాది వస్తోంది
ఈ ఉగాదికి ఊరికి రమ్మని పిలుద్దామని ఫోన్ చేశానని చెప్తుంది షీలా. ఇంట్లో అందరికీ కుదరాలి కదా అన్నట్టుగా మాట్లాడుతాడు. సంక్రాంతికి అందరూ వస్తానని అనుకున్నానని, రాలేదని ఈ ఉగాదికి తప్పనిసరిగా రావాలని అంటుంది షీలా. ఓకే అంటాడు సత్యం. నీ మీద, నీ మాట మీద నాకు నమ్మకం లేదని బాలుకి ఫోన్ ఇమ్మంటుంది కొడుకుతో. బాలు తీసుకునే హుషారుగా మాట్లాడి అందరూ బాగున్నారు అనీ, తప్పనిసరిగా వస్తామని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రభ చూశారా మీ అమ్మగారు.. ప్రభావతి బాగుందా? అని నన్ను అడగలేదు. మీనా బాగుందా? అని బాలుని అడిగింది అంటుంది. ఆ మాటనే షీలా డార్లింగ్ తో బాలు అనేసరికి, వాళ్ళ అమ్మ కంగారుపడి ఫోన్ తీసుకుని అదేమీ లేదు అత్తయ్య వాడే సరదాగా కామెడీ చేస్తున్నాడు అంటుంది ప్రభ.

పండగ అంటేనే.. అందరం కలవడం
తనకి ఒక్కదానినే ఉండి బాగా బోర్ కొడుతుందని, మీరందరూ వస్తే ఇల్లు కళకళలాడుతుందని సంక్రాంతికి ఎలాగూ రాలేదు కాబట్టి ఉగాదికి రమ్మని బాలుతో అంటుంది షీలా. ఈ వయసులో తన కొడుకు, కోడలు మనవరాలతో పండగ జరుపుకోవాలని అనిపిస్తుందని అంటుంది. అంతకన్నా నాకు కోరికలు ఏముంటాయి.. అనేటప్పటికీ బాలు అలా మాట్లాడకు నాకు ఏడుపొస్తుంది అంటాడు. ఇంట్లో అందరినీ తీసుకొస్తావా? అని అడిగితే, వీళ్ళందరూ ఒక్క మాట మీద ఉండరని బాలు అంటాడు. నీ మీద నాకు నమ్మకం ఉందని తప్పకుండా తీసుకురమ్మని ఫోన్ పెట్టేస్తుంది..షీలా.
ఈ ఫ్యామిలీలో అందరూ ఒక్కో టైపు
సాధు జంతువుల్ని,క్రూర జంతువుల్ని అందర్నీ కట్టకట్టుకుని ఊరు రమ్మంటుంది అని అంటాడు ఫోన్ కట్ చేసి బాలు. వీళ్ళందర్నీ మ్యానేజ్ చేయడం మామూలు విషయం కాదన్నట్టుగా మాట్లాడుతాడు. పండక్కి అందర్నీ రమ్మంది అంతే కదా, వెళ్దాం అన్నట్టు మాట్లాడుతాడు సత్యం. అదేమైనా పెద్ద ఊటీ నా వెళ్లడానికి అంటుంది ప్రభ. దానికి బాలు, నాన్న అమ్మ ఊరు లండన్ లో ఉందా? ప్యారిస్ లో ఉందా? అని అడుగుతాడు. పక్కా పల్లెటూరి అని చెప్తాడు సత్యం. మరి ఎందుకు మన ఊర్ని తక్కువ చేసి మాట్లాడుతుంది? అమ్మ పుట్టినిల్లు వాళ్ళు ఎప్పుడైనా పిలిచారా? అంటాడు బాలు. నానమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది కాబట్టి అందరూ వెళ్దాం నాన్న అంటాడు బాలు.
రోహిణికి బాలు పంచ్
ఉగాదికి ఊరికి రావడం తనకి కుదరదని, తనకి ఇంటర్వ్యూ ఉందని మనోజ్ అంటాడు. రాని ఉద్యోగాలకి ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్తావ్ రా బాబు అంటూ ఎటకారం చేసి మాట్లాడుతాడు బాలు. దానికి మనోజ్ భార్య రోహిణి, ఫీల్ అవుతుంది. నువ్వు ఇప్పించు ఉద్యోగం అంటుంది బాలుని. జాబ్ ఇప్పించనని బాలు ఎగతాళి చేస్తాడు. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి అంటున్నాడని బాలు మీద మండి పడుతుంది రోహిణి. వీడికి అత్తగారిల్లు చూసే భాగ్యం ఎప్పుడు వస్తుందో? అంటాడు బాలు. దాంతో ఆ మాటకి చిరాగ్గా రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
రోహిణి సతమతం
బాలు మాటలే గుర్తుకొస్తున్నాయి
ముందు మీ పుట్టింటి నుంచి ఒకరిని వచ్చి వాళ్ళ మొహం చూపించమని అంటాడు బాలు. ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ రోహిణి డాబా పైన ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభ అక్కడికి వచ్చి రోహిణి ఎందుకమ్మా ఇక్కడున్నావు? అంటుంది. బాలు అలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది అత్తయ్య అంటుంది. వాడి మాటలు పట్టించుకోకు, వాడు ఎప్పుడూ అంతే కదా అంటే, పదేపదే మనోజ్ ఖాళీగా ఉంటున్నాడు అంటే తట్టుకోలేను అంటుంది రోహిణి. వాడి మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాడి బుద్ధి అంతేనని ప్రభ అంటుంది. వాళ్ల పొగరు దించాలంటే ఒకటే మార్గమని అది మీ నాన్నని ఇక్కడ తీసుకురావాలని అంటుంది. మీ నాన్నగారి సాయంతో మనోజ్ తో పెద్ద బిజినెస్ పెట్టించాలని, అది చూసి వాళ్లంతా కుళ్ళుకోవాలని అంటుంది ప్రభ.
పెద్ద చిక్కు వచ్చిందే
లేని నాన్నను ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక, రోహిణికి ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది. దీనికి పరిష్కారం చూడకపోతే తాను ఇరుక్కుపోతానని అనుకుంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావంటే, నేను ఏమీ తేల్చుకోలేకపోతున్నానని, కనీసం తనకు అమ్మ ఉన్నాగాని నాకు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదంటూ ఏడుస్తుంది. పెళ్లయినాక శృతిని చూడడానికి వాళ్ళ అమ్మ వచ్చింది, అలాగే మీనా కోసం కూడా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. నాకే ఎవరూ లేరు అంటూ బాధపడుతుంది రోహిణి.
రోహిణి కి ప్రభ ఓదార్పు
ఇప్పుడు కష్టాలు పడుతున్నాము అంటే, ముందు ముందు సుఖపడుతామని అర్థం. దేవుడు నిన్ను బాగా చూస్తాడని నీకు మంచి టైం వచ్చిందని, మీ నాన్నగారికి నీ మీద బాగా ప్రేమ ఉందని, బాగా చూసుకోవాలని అనుకుంటున్నారని, ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, నేను చెప్పిన మాట విని మీ నాన్నగారికి ఫోన్ చేయమని అంటుంది. దానికి రోహిణి, నాన్నగారు ప్రస్తుతం జర్మనీలో ఉన్నారని, అక్కడ బాగా ఆలస్యం అవుతుందని అన్నారని, అందుకే నేను అడగలేకపోతున్నానని అంటుంది. అలా అయితే మీ మామయ్యను రమ్మని చెప్పు అంటుంది ప్రభ. ఆ మాటకు షాక్ అయిన రోహిణి ఈ గండాన్ని ని ఎలా డీల్ చేయాలో తెలీక సతమతమవుతుంది.
ఏం చేద్దాం?
దివ్య సహాయం కోరిన రోహిణి
తన బాధనంతా తన ఫ్రెండ్ దివ్య కి చెప్పుకిని వాపోతుంది రోహిణి. అలా అయితే నువ్వు చాలా ఇరుక్కుపోయావన్నమాట అంటుంది దివ్య. శృతి రానన్నాళ్లు తనకు బాగానే జరిగిందని, శృతి వచ్చిన తర్వాత నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయని అంటుంది రోహిణి. శృతి వాళ్ళ అమ్మ వచ్చి చీరలు సారేలు తెచ్చినప్పుడు అందరూ తన వైపు చూశారని, తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అంటుంది. వాళ్ళ అందరి దృష్టిలో నువ్వు ఒక రేంజ్ లో ఉన్నావని, అయినా నువ్వు ఏ మండపేట అనో, మచిలీపట్నం అని చెప్పకుండా మలేషియా అని ఎందుకన్నావ్? అని అంటుంది దివ్య.
గట్టెక్కే మార్గం ఒక్కటుంది
పేద ఇంటి నుంచి వచ్చిందని మీనాని, చీపురు పుల్లలా తీసిపారేస్తుంది మా అత్త. ఏదో మీనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఏదో ఒకటి తెస్తున్నా ఆవిడ కంటికి కనిపించడం లేదు. ఇప్పుడు నా దరిద్రంగాని తెలిసింది అంటే, ఆవిడ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందని దివ్య తో అంటుంది రోహిణి. ఏదో ఒకటి చేయాలి. అందుకే నువ్వు హెల్ప్ చేయాలి అంటుంది. దానికి రోహిణి ఫ్రెండు రోహిణి కి ఒక ఐడియా ఇస్తుంది. మలేషియా నుంచి వచ్చినట్టు మీ నాన్న లాగా, లేకపోతే మీ మామయ్య లాగా ఎవరినైనా ఒకరిని తీసుకెళ్లి డ్రామా ఆడిద్దామని, నాకు తెలిసిన ఒక మంచి నటుడు ఉన్నాడని అంటుంది. దొరికిపోతామేమో అని భయపడిన రోహిణికి ధైర్యం చెప్పి చివరికి ఒప్పిస్తుంది.
మటన్ మాణిక్యం
ఒక మంచి నటుడు
రోహిణిని దివ్య మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి తీసుకొస్తుంది. అతను సినిమాల్లో నటుడుగా అవ్వాలని ప్రయత్నించి విఫలమై, చివరికి మటన్ కొట్టు పెట్టుకొని వచ్చిన కస్టమర్లకి నటన గురించి చెప్తూ విసిగిస్తూ ఉంటాడు. మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసిన రోహిణి వీడు తన మామయ్య క్యారెక్టర్ కి పనికిరాడు అని వెళ్ళిపోదాం పద అని అంటుంది. వాడి నటన గురించి నీకేం తెలియదని, నీకంటే, మీ ఆయన కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదవాడని, బలవంతంగా షాపులోకి తీసుకొస్తుంది. వాళ్ళని చూడగానే మేడం అంటూ బయటికి వస్తాడు మాణిక్యం.
రాజమౌళి సినిమాలో ఛాన్స్
మటన్ కావాలా? లివర్ కావాలా? బోటీ కావాలా? కాళ్లు కావాలా అంటూ హడావుడి చేస్తాడు. మటన్ కోసం రాలేదని వేరే పని మీద వచ్చానని దివ్య మాణిక్యంతో అంటుంది. మళ్లీ మనం నాటకం వేయబోతున్నామా అని అడుగుతాడు. మళ్లీ నీకు నటించే ఛాన్స్ వచ్చిందని అంటుంది దివ్య. సినిమాల్లోనా, సీరియల్స్ లో నా అంటూ ఉత్సాహం చూపిస్తాడు మాణిక్యం. మాణిక్యం ఉత్సాహం చూపిన రోహిణి చిరాగ్గా ఫీల్ అవుతుంది. మహేష్ బాబు, రాజమౌళి చేస్తున్నసినిమాలో అవకాశం రాబోతుందని, దానికోసం వారం రోజులు ఆడిషన్స్ జరుగుతాయని అనగానే, ఆ మాట విని షాక్ తో కిందపడి గిలగిలా కొట్టుకుంటాడు మాణిక్యం. అది చూసి ఇద్దరూ కంగారు పడతారు.
ముగింపు..
ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమోలో.. డబ్బుల కోసం ఒక ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తారు రోహిణి, దివ్య. ఒక లక్ష రూపాయలు కావాలని చెప్పి తీసుకుంటారు. పూల కొట్టు దగ్గరికి బాలు వచ్చి మీనాని కళ్ళు మూసుకో అని అంటాడు. చేతిలో ఉన్న పార్సిల్ ఇస్తాడు. ఏంటి చీరనా? అంటూ షాక్ అవుతుంది మీనా. తనకి ఏం కావాలో తెలుసుకుని అన్నీ తెచ్చేవాడే కదా భర్త అంటే అని బిల్డప్ ఇస్తాడు బాలు. మీనా బాలు కి ప్రేమతో ముద్దుపెడుతుంది. ఇక రోహిణి కొత్త డ్రామా మొదలవ్వబోతోంది. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతోంది.








