గుండెనిండా గుడిగంటలు సీరియల్
ఈరోజు ప్రత్యేకత
- పార్లర్ కి వచ్చిన బాలు
- అదే సమయంలో అక్కడే ఉన్న మాణిక్యం
- రోహిణి గుట్టు బట్టబయలు
- సత్యం కి సీక్రెట్ చెప్పిన బాలు
- రోహిణికి చెమటలు పట్టించిన బాలు
- మీనాకి చెప్పొద్దు అని సత్యం రిక్వెస్ట్
Gundeninda Gudigantalu Serial 21/04/25 మాటీవీలో ప్రసారమవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుంది. ఆకట్టుకునే కుటుంభ సన్నివేశాలు, వినోద సన్నివేశాలతో అధ్యంతం ఆసక్తికరంగా సాగుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో ఈరోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
పార్లర్ కి మాణిక్యం
గిఫ్ట్ గా మటన్ ప్యాక్
పార్లర్ కి మటన్ తీసుకువచ్చిన మాణిక్యాన్ని నువ్వు వెళ్ళిపో అంటుంది రోహిణి ఫ్రెండ్ దివ్య. ఇంతలో అక్కడికి వచ్చిన రోహిణితో మేడం వెళ్లిపోయిందా అని అడుగుతుంది. లేదు వేరే గదిలో కూర్చోబెట్టాను అని చెప్తుంది రోహిణి. ఇక నువ్వు వెళ్ళు అని మటన్ కొట్టు మాణిక్యంతో అంటుంది దివ్య. డబ్బులు ఆన్లైన్లో పే చేస్తారా అని మాణిక్యం అడక్కగానే, నేను చేస్తాలే అని చేతిలో ఉన్న కవర్ తీసుకుంటుంది. వీడొకడు నా పాలిట శనిలా తయారయ్యాడు అంటుంది రోహిణి. వీడిని మా వాళ్ళు ఎవరు చూసినా గాని నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటుంది దివ్య తో.
ప్రభ పార్లర్ కాదు
క్వీన్ పార్లర్
క్వీన్ బ్యూటీ పార్లర్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్న బాలు అక్కడ ఉన్న రిసెప్షన్ అమ్మాయితో చిల్లర ఇవ్వమని కంగారు పెడతాడు. చేంజ్ లేదని, తీసుకొస్తానని ఇంతలో ఈ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉండండి అని పార్లర్ రిసెప్షనిస్టు పక్కకు వెళుతుంది. బాలు పేపర్ చదువుతుంటే ఇంతలో అటుగా వస్తున్న మాణిక్యం అక్కడ నిలబడి ఉన్న బాలు ని చూడకుండానే, కొత్త ఆర్టిస్ట్ ని కదా ఫేస్ అప్పుడే ఎవరికీ రివిల్ అవ్వకూడదు అనుకుంటూ, మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో బాలు చేతిలో ఉన్న పేపర్ పడిపోవడంతో, ఆ పేపర్ తీసి మొహానికి చేయి అడ్డుపెట్టుకుంటూనే బాలుకి ఇస్తాడు మాణిక్యం. బాలు, మాణిక్యాన్ని గమనించడు.
బోర్డు చూడలేదా?
ఏంటి ఆ మేడం.. మీ పార్లర్ కి వచ్చి మిమ్మల్ని డబ్బులు ఇమ్మంటున్నారు అని అడుగుతాడు రిసెప్షన్ అమ్మాయిని బాలు. ఆవిడే కదా ఈ పార్లర్ ఓనర్ అంటుంది. ఆమె ఆ మాట విన్న బాలు షాక్ అవుతాడు. గిరగిరా తిరుగుతాడు. ఏమైంది అని అడుగుతుంది రిసెప్షన్ అమ్మాయి. ఇలాంటి సమయంలో ఎవరికైనా కళ్ళే తిరుగుతాయి, నాకు ఏకంగా బాడీ మొత్తం తిరుగుతుంది అంటాడు. ఈ పార్లర్ కు ఓనర్ రోహిణి కదా, పార్లర్ పేరు ప్రభావతి అని ఉంటుంది కదా అని రిసెప్షన్ అమ్మాయితో అంటాడు బాలు. ఇది క్వీన్ బ్యూటీ పార్లర్ బోర్డు చూడలేదా? అంటూ బోర్డు చూపిస్తుంది. అది చూసి షాక్ అవుతాడు.
బోర్డు తో బాలు సెల్ఫీ
దీని ఓనర్ రోహిణి కాదా? అని మళ్ళీ అడుగుతాడు. కాదు అని సమాధానం చెబుతుంది రిసెప్షన్ అమ్మాయి. ఆ మాట విన్న బాలు షాక్ అవుతాడు. రోహిణి మేడం ఈ పార్లర్ ని ప్రాంచైస్ కి ఇచ్చారని, క్వీన్ అనేది ఒక బ్రాండ్ అని, వాళ్ల పేరు మీద ఎన్నో పార్లర్స్ ఉంటాయని, అలాగే ఇది కూడా రోహిణి మేడం వాళ్ళకి ఇచ్చింది అని చెప్తుంది ఆ అమ్మాయి. రోహిణి మేడం ఇక్కడ కేవలం బ్యూటిషన్ మాత్రమే అంటుంది. మీకు ఆవిడ తెలుసా? అని అడిగితే, తెలుసు.. తెలియదు.. అంటూ తికమక సమాధానాలు చెప్తాడు బాలు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా అంటాడు. సరే మీరు వెళ్ళండి అనగానే ఒక్క నిమిషం అంటూ బ్యూటీ పార్లర్ బోర్డు దగ్గర నిలబడి సెల్ఫీ దిగుతాడు బాలు. అది చూసిన పార్లర్ అమ్మాయి ఏం మనుషులో ఏమో అనుకుంటుంది.
అర్జెంటు గా చెప్పేయాలి
పార్లర్ లోంచి బయటికి వచ్చిన బాలు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, ఎవరికి దొరకకూడదు వాళ్లకే దొరికిపోయింది (రోహిణి) ఈ పార్లర్ అమ్మ అనుకుంటాడు. ప్రభావతమ్మకి నిజం తెలిస్తే గుండెపోటు ఖాయం అనుకుంటాడు. మొగుడేమో ఉద్యోగం చేయకపోయినా చేస్తున్నట్టు నటిస్తూ, జీవిస్తూ పార్కుల్లో తిరుగుతాడు. పెళ్ళామేమో పార్లర్ వేరే వాళ్లకు అద్దెకి ఇచ్చి ఇక్కడ పనిచేస్తుంది. పార్వతమ్మ ఏమో.. నా పేరే పెట్టుకుంది పార్లర్ కి అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంది. ఈ పార్లర్ అమ్మ ఎంత మోసం చేస్తుందో? ఇంకా ఎదో తెలియని మతలబు ఉంది. ముందు బాలుకి ఈ కడుపు ఉబ్బరం తగ్గాలంటే, ఈ విషయం నాన్నకు చెప్పాల్సిందే అనుకుంటూ అక్కడ నుంచి స్పీడ్ గా బయలుదేరతాడు బాలు.
పార్లర్ అమ్మ సీక్రెట్
నీకు నటన రాదు
తండ్రి దగ్గరికి కంగారుగా వచ్చిన బాలు, ఆయన్ని చూసి నాన్న నాన్న అంటూ పట్టుకుని కంగారుగా ఆపుతాడు. ఏమయ్యింది ? ఏంట్రా విషయం అని సత్యం అడగ్గానే, నీకు ఒక విషయం చెప్పాలి అలా పక్కకు వెళ్దాం అంటాడు. ఇక్కడ కూడా మనిద్దరమే ఉన్నాం కదా పక్కకి ఎందుకు విషయం ఏంటో చెప్పు అంటాడు. సతమతమవుతుంటాడు బాలు. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బాలు తండ్రి సత్యం. నటించిన నటన చాల్లే గాని పాయింట్ కి రారా అంటాడు. నేను నటిస్తుతున్నట్టు తెలిసిపోయిందా? అంటాడు బాలు. ఎలా కనిపెట్టావు నాన్న? అని అడుగుతాడు. ఒరేయ్.. బాలు లాంటి కొడుకు ఒక్కడే ఉంటాడు. సింగిల్ పీస్ అంటారు కదా అలాంటి వాడివి నువ్వు అంటాడు.
గుట్టు విప్పిన బాలు
నీకు అసలు నటించడం రాదు. నువ్వు నటించాలనుకున్నా, ఇంకా ఏదైనా తప్పు చేద్దామన్నా దొరికిపోతావ్, ఇంతకీ మేటర్ ఏంటో చెప్పు అంటాడు సత్యం. మనోజ్ గాడి భార్య ఉంది కదా? పార్లర్ అమ్మ అంటాడు. తను నీకు వదిన అవుతుంది అంటాడు నాన్న. ఒదిన అని పిలవచ్చు కదా అని సీరియస్ అవుతాడు. సరే విషయం ఏంటో చెప్పు అనగానే, ఇలా రా చెవిలో చెప్తాను అంటాడు బాలు. చెవిలో చెప్పడం ఎందుకు? అని తండ్రి అడుగుతాడు. నువ్వే అన్నావు కదా.. మంచి మైక్ లో చెప్పినా పర్లేదు గాని, చెడు మాత్రం చెవిలో చెప్పాలని అంటాడు బాలు. ఈ పార్లర్ అమ్మ ఏం చేస్తుందో తెలుసా అంటూ, పార్లర్ లో తను విన్న మాటలు గురించి, తను చూసిన మేడం గురించి వివరంగా చెప్తాడు.

ఆ మాటలు విన్న బాలు తండ్రి షాక్ అవుతాడు. బాలు మీద అనుమానంగా చూస్తాడు. మళ్లీ ఇంకో కంప్లైంటా? అని బాలుని అనగానే, నిజం నాన్న తాత మీద ఒట్టు కావాలంటే చూడు అంటూ, సెల్ తీసి పార్లర్ లో తను తీసుకున్న ఫోటో చూపిస్తాడు బాలు. ఇక్కడ అమ్మ పేరు కూడా లేదు క్వీన్స్ పార్లర్ అని ఉంది అంటాడు. అంటే ఇప్పుడు పార్లర్ అమ్మ పేరు మీద లేదా? అని అడుగుతాడు తండ్రి. మరి రోహిణి అక్కడ ఏం చేస్తుంది? అనగానే చెప్పింది కదా, ఆ రిసెప్షన్ అమ్మాయి అక్కడ రోహిణి కేవలం బ్యూటిషన్ మాత్రమే అని చెప్తాడు బాలు.
నాకు చెప్పి మంచి పని చేసావ్
ఇంత జరిగినా కూడా రోహిణి ఈ విషయం మనతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు సత్యం. ఎలా చెప్తుంది నాన్నఆ మాయలోడు మనోజ్ గాడి భార్య కదా అని అంటాడు బాలు. నాకు వచ్చిన కోపానికి ముందు ఈ విషయం అందరికీ చెప్పేద్దాం అనుకున్నాను. నీకు చెప్పాలని, ముందు నీతో చెప్పాను అంటాడు బాలు. చాలా మంచి పని చేసావ్ అంటాడు తండ్రి. ఇంటికి వెళ్లి అందరికీ చెప్పేద్దాం పద అంటాడు బాలు. వద్దని చెప్తాడు తండ్రి. మనోజ్ విషయం తెలిసినట్టే, ఈ విషయం కూడా మీ అమ్మకు ముందే తెలిసి ఉండొచ్చు. కోడలు పరువు పోకూడదని, దాచిందేమో అంటాడు.
అమ్మ ఊరుకోదు
అమ్మకి నష్టం జరుగుతుందంటే అసలు ఊరుకోదు. ఇల్లు తాకట్టు పెట్టి ఆ పార్లర్ పెట్టించింది. అలాంటిది ఆ పార్లర్ తన పేరు మీదే లేదంటే, ఎలా ఊరుకుంటుంది? అమ్మకు చెప్పి వాళ్ళిద్దరికీ బుద్ధి చెబుదాం అని చెప్తాడు బాలు. ఒకసారి మనోజ్ గురించి చెప్పినందుకే ఇంట్లో పెద్ద గొడవ అయింది. రోహిణి కూడా రెండు రోజులు ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పుడు అందరూ ఎంత భయపడ్డాము. ఎంత బాధ పడ్డాం అంటాడు తండ్రి. అందుకని నిజాన్ని సమాధి చేయమంటావా అంటాడు బాలు. ఇప్పుడు నిజం చెప్పడం వల్ల జరిగే కష్టం నష్టం గురించి ఆలోచించాలి. మనం చెప్పే నిజం మంచి ఉపయోగపడేలా ఉండాలి గానీ నష్టపరిచేలా ఉండకూడదు అంటాడు తండ్రి.
దేనికైనా టైం వస్తుంది
ఇప్పుడు మీ అమ్మకు చెప్పడం వల్ల సాధించేదేముంది? నిజమనేది చీకట్లో ఉన్న నీడ లాంటిది.. వెలుతురు వస్తే అదే బయటపడుతుంది. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. నువ్వు కంగారు పడకు అంటూ బాలుకి సర్ది చెప్తాడు తండ్రి. వాళ్ళింట్లో బిల్డప్పులు ఇస్తున్నారు కదా అంటాడు బాలు. ఎన్ని మాటలు అంటుంది మీనాని అంటాడు. ఆవేశం అన్నిసార్లు మంచిది కాదు. నిదానంగా ఉండు అంటూ సర్ది చెప్తాడు తండ్రి. కంట్రోల్ లో ఉండడానికి ట్రై చేస్తా, పొరపాటున నిజం బయటికి వస్తే మాత్రం నేను ఏం చేయలేను. అంటాడు బాలు.
పార్లర్ నుండి వచ్చిన రోహిణి
బాలు మాటలతో సతమతం
పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది రోహిణి. ఆ వెనకే బాలు, బాలు తండ్రి ఇంట్లోకి వస్తారు, ఇంట్లోకి వచ్చిన వెంటనే మీనా అంటూ బాలు పిలిచి.. మీ శ్రీవారు, మామగారు ఇంటికి వచ్చారు ఫాస్ట్ గా మంచినీళ్లు తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. అలాగేనండి అంటుంది లోపల నుండి మీనా. ప్రభావతి, మీనాక్షి అక్కడే సోఫాలో కూర్చుని ఉంటారు. అది విని ప్రభావతి మూతి తిప్పుకుంటుంది. బాలు షర్టు కాలర్ ఎగరేస్తాడు. మనొజ్ వచ్చాడా ఆంటీ? అంటూ రోహిణి ప్రభావతిని అడుగుతుంది. మేడ మీద బిసినెస్ మీటింగ్లో ఉన్నాడు వెళ్ళు అని సమాధానం చెబుతాడు బాలు. నేను నిన్ను అడగలేదు అంటుంది రోహిణి. తను అడిగింది నన్ను నువ్వు నోరు ముయ్యి అంటుంది ప్రభావతి.
నోరుమూసుకుని ఉండొచ్చుగా
వాడు ఇంకా రాలేదమ్మా అంటుంది ప్రభావతి. ఏ పార్కులో నిద్రపోతున్నాడో ఏంటో అంటూ బాలు తండ్రి వైపు చూసి, తండ్రి సీరియస్ గా చూడడంతో సారీ నాన్న అలవాటులో పొరపాటు అంటాడు. రోహిణి బాగా అలసిపోయినట్టున్నావ్ పని ఎక్కువైందా? అని అడుగుతుంది ప్రభావతి. ఈరోజు కొంచెం పని ఎక్కువైంది అంటుంది రోహిణి. ఈరోజు ఒక్కరోజేనా ప్రతిరోజు ఇలాగేనా అని ఎటకారంగా మాట్లాడుతాడు బాలు. నీకెందుకురా అన్నట్టుగా తండ్రి సీరియస్ అవుతాడు. సారీ నాన్న అంటూ బాలు నోటిపై వేలేసుకుంటాడు. బాలుని చూసి ప్రభావతి ఈ ఫోజ్ లో చాలా బాగున్నావ్ రా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండొచ్చు కదా అంటుంది.
కౌంటర్ లో కూర్చుంట
వీడి నోరు మూయించింది నువ్వు నోరు తెరుస్తావని కాదు, నువ్వు ఆగు అంటాడు ప్రభావతితో భర్త. రోహిణి పార్లల్లో పని ఎక్కువైతే, ఇంకొక పని అమ్మాయిని పెట్టుకో అంటుంది ప్రభావతి. కావాలంటే నేను కౌంటర్లో కూర్చుంటాను అంటుంది ప్రభావతి. ఈవిడే అక్కడ పని అమ్మాయి, ఇంకో పని అమ్మాయిని పెట్టుకోవడం ఏంటి అనుకుంటాడు బాలు. పార్లర్ ఎలాగో నా పేరు మీదే ఉంది కదా, నేను వచ్చి కూర్చుంటే ఆ హోదా, ఆ లెక్కే వేరు అంటుంది ప్రభావతి. ఆ మాటలు విన్న బాలుకి పొలమారుతుంది. ఏంట్రా నేను మాట్లాడుతుంటే దగ్గుతున్నావ్ అని అంటుంది ప్రభావతి.
రోహిణి ఓనర్..వర్కర్ కాదు
నా దగ్గు.. నా ఇష్టం నేను ఎప్పుడు వస్తే అప్పుడు దగ్గుతాను, ఎప్పుడు తుమ్ము వస్తే అప్పడు తుమ్ముతాను అంటాడు బాలు. రోహిణి అలసిపోయి వచ్చింది వెళ్లి జ్యూస్ చేసుకుని తీసుకురా అని మీనాకు ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. అవునవును రోజంతా పనిచేసి, పనిచేసి బాగా అలసిపోయింది పార్లర్ అమ్మ అంటాడు ఎటకారంగా బాలు. ఒరేయ్ బాలు నువ్వు ఆగు అన్నట్టు చూస్తాడు తండ్రి. ఓనర్ కి కూడా అంత ఎక్కువగా పని ఉంటుందా? రోహిణి అంటుంది మీనాక్షి. వీళ్ళ పార్లర్లో ఓనర్లు పనిచేస్తారు వర్కర్స్ టైం పాస్ చేస్తారు అంటాడు బాలు. ఆ మాట విని ఏంట్రా ఏదో డైరెక్ట్ గా చూసినట్టు చెప్తున్నావ్ అంటుంది ప్రభావతి. రోహిణి ఎంచక్కా కాలి మీద కాలేసుకుని దర్జాగా కూర్చుంటుంది అంటుంది.
మీనాని తక్కువ చేసిన ప్రభ
ఆ మాట విని బాలుకి కోపం వస్తుంది. నాన్న నోరు తెరవనా? అన్నట్టు తండ్రి వైపు చూస్తాడు. వద్దు అంటాడు తండ్రి. ప్రభ పార్లర్ మాత్రమే నీది కాదు, పూల కొట్టు కూడా నీదే అంటాడు సత్యం. పార్లర్ మాత్రమే నాది. నా మీద ఇష్టంతో, రోహిణి పార్లర్ కి నా పేరు పెట్టింది అంటుంది ప్రభావతి. వీడు నా పరువు తీయడానికి పూలకొట్టుకి పేరు పెట్టాడని బాలుతో అంటుంది ప్రభావతి. అవునవును మా వదిన ఎంతో ప్రేమగా అందర్నీ మభ్యపెట్టి, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి పెట్టిన పార్లర్ అది అని మీనాక్షి అనేటప్పటికీ ప్రభావతి నువ్వు ఆగమ్మా అంటూ ఆపుతుంది. నువ్వు దాని కోసం నువ్వు పడ్డ కష్టం చెప్తున్నాను వదినా అంటుంది కామాక్షి.
అత్తమ్మ ఇచ్చిన గిఫ్ట్..పార్లర్
అవునండి అమ్మ స్థానంలో ఆంటీ నా చేత ప్రారంభించిన పార్లర్ అది. ఎప్పటికీ నాకు స్పెషల్ అంటుంది రోహిణి. ఓహో ఎవరు ఓపెన్ చేస్తే అది వాళ్ళు సొంతం అయిపోతుందా? ఇప్పుడు ఈ సినిమా స్టార్లు ఎన్నో షాపులు ఓపెన్ చేస్తుంటారు ఆ షాపులన్నీ వాళ్ళవి అయిపోతాయా? అని బాలు రోహిణిని అడుగుతాడు. అలా ఎలా అవుతాయి రా ? అవి ఎవరి పేరు మీద ఉంటే వాళ్లే ఓనర్స్ అవుతారు అంటుంది కామాక్షి. అంతే కదా మరి ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంటే వాళ్లకే సొంతం అవుతుంది అంటూ రోహిణి వైపు చూస్తాడు బాలు. షాపింగ్ మాల్స్ గురించి మాకెందుకులే పార్లర్ మాత్రం మాది. మీనా జ్యూస్ చెప్పి ఎంత సేపు అవుతుంది వెళ్లి తీసుకురా అని అంటుంది ప్రభావతి.
పనివాళ్ళు ముందే వచ్చేస్తే ఎలా?
నాక్కూడా ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకురా అంటాడు బాలు. ఓకే అన్నట్టు చూస్తుంది మీనా. ఏరా నాకు పోటీనా అని ప్రభావతి అడగ్గానే, తాగాలనిపించింది.. నా ఇష్టం నేను తాగుతాను అంటాడు బాలు. బాలు మాట్లాడుతున్న మాటలకి, మాట్లాడుతున్న విధానానికి కొంచెం అనుమాన పడుతుంది రోహిణి. నువ్వేం పట్టించుకోకు అమ్మ అంటుంది ప్రభ. ఇంత టైం వరకు పనిచేయకుండా కొంచెం ముందే వచ్చేయొచ్చు కదా? అంటుంది ప్రభావతి. పనివాళ్ళు ముందే వస్తే ఊరుకోరు కదా అంటాడు బాలు. ఆ మాటకి బాలు తండ్రి షాక్ అవుతాడు. మీనా షాక్ అవుతుంది. ప్రభావతి కూడా షాక్ అయ్యి ఏంట్రా నా కోడలు ఓనర్, పనిచేసే అమ్మాయి కాదు. అర్థం కాదా అంటూ సీరియస్ అవుతుంది.
ఓనర్స్ కి వర్కర్స్ కి తేడా అదే..
మీ కోడలు ఓనరమ్మ కదా ముందే వచ్చేస్తే వర్కర్స్ కూడా ముందే వెళ్లిపోతారు అంటున్నాను అని బాలు సర్ది చెబుతాడు. కామాక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటా అంటుంది రోహిణి. సరే నువ్వు వెళ్ళమ్మా జ్యూస్ అయిన తర్వాత నీ రూమ్ కి పంపిస్తాను అంటుంది ప్రభావతి. రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా త్వరగా జ్యూస్ తయారుచేసి రోహిణికి ఇవ్వు అని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. హాల్లో బాలు, తండ్రి ఇద్దరు మాత్రమే మిగులుతారు.
చూసావా నాన్న?
నాన్న చూశావా? నేను మాట్లాడే మాటలకి రోహిణి మొహం ఎలా మారిపోతుందో అంటాడు సత్యం తో. ఇప్పటికైనా నమ్ముతావా అంటే, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. కానీ ఇప్పుడు దీన్ని బయటపెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకు అంటాడు బాలుతో. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా గాని నా నోట్లోంచి నిజమే బయటికి వస్తుంది నాన్న అంటాడు బాలు. ఈ విషయాలు తెలియడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయని, దానికి కారణం నువ్వు అవుతావని కాబట్టి నేను చెప్పినట్టు విని ఎవరికి ఈ విషయం చెప్పొద్దని బాలుతో తండ్రి అంటాడు.
రేపటి ఎపిసోడ్ ప్రోమో
వంట గదిలో బిజీగా ఉన్న మీనా దగ్గరికి వస్తాడు బాలు. దోస కావాలి అంటాడు. బాలు ఎన్ని దోశలు కావాలి అని అడుగుతుంది. ఎన్ని దోశలు వేసిన తింటూనే ఉంటాను అంటాడు బాలు. దోశలు వేసి బాలు చేతికిస్తుంది మీనా. దోస ఎలా ఉంది? అని అడిగితే, మీనా వంటకి పేరు పెట్టగలమా? నువ్వు కూడా తిను అంటూ మీనా కి దోశ పెడతాడు బాలు. బాలు మాటలు విన్న బాలు తండ్రి ఏంట్రా అక్కడ చెప్తున్నావు అంటూ పిలుస్తాడు. దోసలు తింటున్నాను అని తండ్రితో అంటాడు బాలు. నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు అంటూ కంగారు పడతాడు. ఏమీ చెప్పొద్దు అంటూ సైగ చేసి చెప్పాడు బాలు తండ్రి. ఓకే అన్నట్టు సైగ చేస్తాడు బాలు. మీనాకి అనుమానం వస్తుంది. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతోంది.








