Gundeninda Gudigantalu Serial 06/05/2025

గుండె నిండా గుడి గంటలు

ప్రభావతి పాత్ర ప్రత్యేకత

Gundeninda Gudigantalu Serial 06/05/2025 జనరల్ గా టీవీ సీరియల్స్ లో అత్తగారి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో కూడా అత్తగారి పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొంటోంది. ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు ఉన్న ఈ సీరియల్ లో ప్రభావతి క్యారెక్టర్ డబ్బులున్న కోడల్ని ఇష్టపడడం, డబ్బులేని మీనా లాంటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, లేని దాన్నిపెళ్లి చేసుకున్నందుకు కొడుకుని కూడా తక్కువ చేసి చూడడం ఈ పాత్ర లక్షణాలు. ఈ సీరియల్ హైలెట్స్ లో ప్రభావతి క్యారెక్టర్ కూడా చెప్పొచ్చు. ప్రతి కుటుంబంలోనూ ఉండే రియల్ క్యారెక్టర్స్ తో ఆసక్తికరంగా సాగుతున్న “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ గురించి నా రివ్యూ చూద్దామా?

హైలెట్స్

  • బాధతో శివ విలవిల
  • శివ పరిస్థితి చూసి బాలుకి మీనా ఫోన్
  • వీడియో డిలీట్ చేస్తా అన్న బాలు
  • వీడియో చూసి షాక్ అయిన రాజేష్
  • మీనా కి రావడం కుదరదని చెప్పిన బాలు
  • శివ పెద్ద దొంగ అంటున్న ప్రభావతి

హాస్పిటల్ లో శివ

డాక్టర్ కి అబద్దం చెప్పిన శివ

శివని తీసుకుని చెల్లి సుమతి, అమ్మ హాస్పిటల్ కి వస్తారు, శివని పరీక్షించిన పరీక్షించిన డాక్టర్ ఈ దెబ్బ ఎలా తగిలిందని అడిగితే, బండి మించి జారీ పడిపోయానని శివ అబద్ధం చెప్తాడు, డాక్టర్ పరీక్ష చేస్తుంటే నొప్పికి తాళలేక విలవిలలాడుతాడు, వాళ్ళ అమ్మని చెల్లిని బయటికి వెళ్ళమని, డాక్టర్ చేతిని పరీక్షగా చూస్తాడు. డాక్టర్ కి అనుమానం రావడంతో బండి మించి ఎక్కడ పడ్డావు? ఎలా పడ్డావు? అంటూ క్వశ్చన్స్ వేస్తాడు. శివ నొప్పికి తట్టుకోలేకపోవడంతో నర్సుని ఇంజక్షన్ చేయమని డాక్టర్ చెప్తాడు. బయట కారిడార్ లో శివతో పాటు సుమతి, అమ్మ ఉండగా మీనా అక్కడికి వస్తుంది.

బాలు పేరు విని శివ కంగారు

బాధతో కూర్చుని ఉన్న శివని చూసి కంగారుగా ఎలా ఉంది? అని అడుగుతుంది. బాగానే ఉందని చెప్పడంతో ఎలా జరిగిందని అడుగుతుంది మీనా. బండి మీద నుంచి స్కిట్ అయ్యి పడిపోయానని శివ చెప్పడంతో, నీకు బైక్ లేదు కదా అని ప్రశ్నిస్తుంది. ఫ్రెండ్ బండి మీద నుండి పడ్డాను అని శివా చెప్పడంతో, ఫ్రెండ్ బైకు వాడొద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా అంటూ సీరియస్ అవుతుంది మీనా. స్కానింగ్ తీశారని, రిపోర్ట్స్ వస్తాయని అంటుంది సుమతి. బావకి చెప్పావా అని మీనాని అడిగితే బావ ట్రిప్ లో ఉన్నారని, చెప్పలేదని చెప్తే వెంటనే పనులు మానుకుని వస్తారని అంటుంది మీనా. బాలు ప్రస్తావని రాగానే శివ కంగారు పడతాడు.

మగ దిక్కు నువ్వే

బావకి చెప్పవలసిన అవసరం ఏం వచ్చింది అన్నట్లుగా మాట్లాడుతాడు. దానికి శివ అమ్మ ఆయన మీ బావగారు రా ఆయనకు చెప్పొద్దంటావేంటి? అంటుంది. ఇప్పటివరకూ హాస్పటల్ కి ఏ పరిస్థితుల్లోనూ రాకుండా అమ్మ మనల్ని జాగ్రత్తగా పెంచిందని, ఇంటికి నువ్వు ఒక్కడివే మగదిక్కు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, అమ్మని సుమతిని దృష్టిలో పెట్టుకుని నీ పనులు ఉండాలని మీనా అంటుంది. నీకు ఏదైనా అయితే వాళ్లకి తోడు ఎవరు ఉంటారు. చూడు ఎంత బాధ పడుతున్నారో అంటుంది. ఇంకా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దామా అంటుంది అమ్మ. ఇక్కడ బాగానే చూస్తారని నువ్వు కంగారు పడొద్దు అని సుమతి అంటుంది. నేను వెళ్లి జ్యూస్ తీసుకొస్తానంటూ మీనా బయటికి వెళుతుంది సీక్రెట్ ఎక్కడ బయటపడుతుందో అనుకుంటూ, శివ కంగారు పడుతూ ఉంటాడు.

శివ నిజ స్వరూపం

వీడియో చూపించిన బాలు

బాలు, రాజేష్ వాళ్ళ క్యాబ్ స్టాండ్ లో నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు, శివని ఎందుకు అంత గట్టిగా కొట్టావు? మీనా కి తెలిస్తే బాధపడుతుంది కదా అంటాడు రాజేష్. వాడు చేసిన పని తెలిస్తే మీనానే వాడిని చితక్కొడుతుంది అంటాడు బాలు. ఏం చేశాడు అని అడిగితే, బాలు సెల్ తీసి వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి రాజేష్ కూడా షాక్ అవుతాడు. నువ్వు చేసింది కరెక్టే కానీ, శివని ఆ గుణనే రెచ్చగొడుతున్నాడు. వాడికి మళ్ళీ ఇంకొక కోటింగ్ పడితే నిజాలు అన్నీ బయటకు వస్తాయి. వెళ్దాం రా అంటాడు రాజేష్. ఆ మాటకి బాలు, రాజేష్ ని ఆపి ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఇంకా మనస్పర్ధలు వస్తాయని అది తనకు ఇష్టం లేదని బాలు అంటాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

ఆ గుణ అంటే బయట వాడు. వీడు మా అమ్మ అని తెలిసి కూడా, మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసాడు. అలాగే ఇంతకుముందు నా బైకు కూడా కొట్టేసాడు. అయినా గాని నేను ఏమీ అనలేదు. అమ్మ నేను ఇంట్లో వంద అనుకుంటాం, అయినా గానీ నాకు తల్లి కాకుండా పోతుందా? శివ అమ్మకు చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ అమ్మ వాడిపై చాలా నమ్మకంగా ఉంది. అందుకే ఏం చెప్పాలో తెలీక తిరిగి వచ్చేసాను అంటాడు బాలు. కాలేజీకి కూడా సరిగ్గా రావట్లేదని వాడి కాలేజీ ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే కోపం వచ్చి చితకబాదాను అంటూ రాజేష్ తో అంటాడు బాలు.

వీడియో డిలీట్ చేస్తా

ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసేలోగా, ఈ వీడియోని మీనాకు చూపించవచ్చు కదా అని రాజేష్ బాలుతో అంటే, చదివి ఉద్దరిస్తాడని ఇంట్లో వాళ్ళందరూ తెగ ఫీల్ అవుతున్నారు. ఈ సంగతి తెలిస్తే చాలా బాధపడతారు అంటాడు. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే, మీనాని ఇంట్లో ఉండనివ్వదు. ఏం చేయాలో అర్థం కాలేదని కావడం లేదంటూ బాలు బాధపడతాడు. వీడియో నా దగ్గర ఉంటే చాలా సమస్యలు వచ్చేటట్టు ఉన్నాయి అంటూ వీడియోని డిలీట్ చేయబోతాడు. రేపు శివ తిరగబడితే ఈ వీడియో సాక్ష్యంగా ఉంటుందని, డిలీట్ చేయవద్దని రాజేష్ బాలుతో అంటాడు.

Gundeninda Gudigantalu Serial 06/05/2025

బాలు కి మీనా ఫోన్

బాలు మాటలకి షాక్

ట్రిప్ కి వెళ్తున్న బాలు కి మీనా కాల్ చేస్తుంది. శివ చేతికి దెబ్బ తగిలిందని, మా ఇంటి పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసామని, వెంటనే రమ్మని మీనా బాలుతో అంటుంది. తనకి రావడానికి కుదరదని లాంగ్ ట్రిప్ వెళుతున్నానని బాలు చెప్పడంతో మీనా నిరాశ పడుతుంది. వేరే ఫ్రెండ్స్ కి ఆ ట్రిప్పు ఇచ్చి మీరు రావచ్చు కదా అంటే, ఆల్రెడీ దారిలో ఉన్నానని చాలా దూరం వెళ్తున్నానని, రావడానికి కుదరదని అంటూ, అయినా వాడికి ఈమధ్య వెధవ వేషాలు ఎక్కువైనాయి. వాడికి అలాగే జరగాలి అన్నట్టుగా మాట్లాడుతాడు. బాలు కొత్తగా మాట్లాడుతూ ఉండడంతో మీనా షాక్ అవుతుంది.

మీకు అదే ఎక్కువా?

మా తమ్ముడి కంటే ఆ ట్రిప్ మీకు ఎక్కువా? అని అడిగితే, మా తమ్ముడి కంటే కూడా నాకు ఇదే ఎక్కువ అని బాలు తిరిగి సమాధానం చెప్తాడు. సరే మీకు వీలైనప్పుడే రండి అని మీనా అంటే, లేట్ అవుతుందని చెప్తున్నాను కదా నాకు రావడం కుదరదని బాలు చెప్తాడు. అంత తేలిగ్గా తీసుకుంటారేంటి? అని నేను అడిగితే, నా పనులన్నీ మానుకుని మీ తమ్ముడు గురించి రావాలా? అంటాడు. నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నువ్వే చూసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు బాలు. ఎందుకిలా మాట్లాడాడో మీనా కి అర్థం కాక బాధ పడుతుంది. ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడుతుంది.

శివ బిత్తర చూపులు

హాస్పటల్ లోపల, మీనా వాళ్ళ అమ్మ బాలుకు చెప్పావమ్మా అని అడుగుతుంది. చెప్పానమ్మా ఆయన ట్రిప్ వెళ్తున్నారంట. చాలా దూరం వెళ్ళిపోయారంట. రావడానికి కుదరదు అని చెప్పారు అంటుంది. బావగారు పేరు వినగానే శివ కంగారుగా చూస్తాడు. నొప్పి బాగా ఎక్కువగా ఉందని చెప్పలేకపోయావా? అంటూ సుమతి అంటుంది. తను వచ్చినా ఏం చేస్తాడు? పాపం వీడికి ఇలా అవుతుందని ఆయనకు తెలియదు కదా అంటుంది మీనా తల్లి. మీనాని అక్కడే ఉండమని, ఇంటికి వెళ్లి తినడానికి అలాగే బట్టలు తీసుకొస్తారని మీనా అమ్మ బయటికి వెళుతుంది. బావ నా గురించి ఏమైనా మాట్లాడారా? అని శివ, మీనాని అడుగుతాడు. రాలేకపోతున్నందుకు చాలా ఫీల్ అయ్యారని, వీలు చూసుకుని వస్తానన్నారని మీనా చెప్పడంతో శివ బిత్తర చూపులు చూస్తాడు.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

బాలుని ఇంట్లో చూసి షాక్

నిర్లక్ష్యం గా బాలు సమాధానం

సత్యం, ప్రభావతి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. మీనా ఇంకా రాలేదేంటి? అంటే దేనికి అని అడుగుతాడు సత్యం. ఈ ఇంట్లో టీ పెట్టే దిక్కు కూడా లేదు అంటుంది. నీకు టీ పెట్టడం వచ్చు కదా, ఇంకో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా వాళ్లతో పెట్టించు అంటాడు సత్యం. ఇంతలో మనోజ్, రోహిణి అక్కడికి వస్తారు. వాళ్లు కూడా టీ కావాలంటారు. ఇంతలో మీనా వస్తుంది. ఏమైంది? ఏమైందమ్మా అని మీనాని సత్యం అడగ్గానే, తన తమ్ముడికి జరిగిన ఫ్రాక్చర్ గురించి చెప్తుంది. మీ తమ్ముడికి బైక్ లేదు కదా ఎలా పడ్డాడు అని ప్రభ అంటే, ఫ్రెండ్ బైక్ మీద పడిపోయాడంట అని చెప్తుంది. ఫ్రెండ్ బైకా లేక దొంగలించిన బైకా, అంటూ మనోజ్ మీనాతో ఎటకారంగా అంటాడు.

వాడు మారిపోయాడు

మీ అమ్మ ఆపింది. మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా అని సత్యం మనోజ్ పై సీరియస్ అవ్వగా, వాడు ఉన్న మాటే కదా అన్నాడు ఇంతకుముందు వాడు దొంగే కదా? అని ప్రభావతి మాట్లాడుతుంది. మీరు చూసినట్లు బానే మాట్లాడుతున్నారు అత్తయ్య, దొంగతనం చేసిన వాళ్ళని మా ఇంట్లో వెనకేసుకుని రారు, వాడు తెలియక ఎప్పుడో తప్పు చేశాడు. జీవితాంతం వాణ్ణి దొంగలు చేస్తారా? ఇప్పుడు వాడు మారిపోయాడు. పార్కుల్లోకి వెళ్లి పడుకోకుండా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అంటూ మనోజ్ ని ఉద్దేశించి అంటుంది మీనా. ఆ మాటకి ప్రభ, మనోజ్, రోహిణి షాక్ అవుతారు.

బాలుని చూసి షాక్ అయిన మీనా

ఇంతలో అక్కడికి రవి, శృతి వస్తారు. బాలు మెట్లు దిగుతాడు. మీరు ఇంట్లోనే ఉన్నారా? ట్రిప్ నుంచి వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతుంది అని చెప్పారు అని మీనా అడుగుతుంది. హాస్పిటల్ కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఒక ట్రిప్ కు వెళ్లకపోతే ఏమవుతుంది? మీ బావమరిదే కదా ఎందుకు వెళ్ళలేదు? అని సత్యం అంటాడు. బాలు మౌనం. మా తమ్ముడికి యాక్సిడెంట్ అయితే ఏమీ పట్టినట్టుగా ఉన్నారు అని మీనా అంటే, ఏదో కారణం ఉండి ఉంటుంది వీళ్ళ అత్తగారి కుటుంబానికి ఏమైనా అయితే వెంటనే వెళ్తాడు కదా అంటాడు మనోజ్.

రేపటి ప్రోమో

రేపటి ఎపిసోడ్ లో, ఇది యాక్సిడెంట్ లా లేదని, ఎవరో కొట్టారని మీనా తో చెప్తాడు డాక్టర్. శివని గట్టిగా అడిగితే బాలు బావ తాగేసి వచ్చి, కొట్టాడని శివ మీనా కి, అమ్మకి చెప్తాడు. టాక్సీ స్టాండ్ కి వెళ్లి నా తమ్ముడిని ఎందుకు కొట్టారని అడుగుతుంది మీనా. మా కుటుంబానికి ఏదిక్కు లేదనే కదా ఇలా కొట్టారు అన్నట్టుగా మీనా మాట్లాడడంతో, బాలు కి ఏం చెప్పాలో అర్థం కాక సతమతమవుతాడు. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Leave a Comment