గుండె నిండా గుడిగంటలు సీరియల్ క్యారెక్టర్స్
ఏ పాత్రలో ఎవరెవరు నటిస్తున్నారు?
| ఒరిజినల్ నేమ్ | క్యారెక్టర్ నేమ్ |
| అమూల్య గౌడ | మీనా |
| విష్ణు కాంత్ | బాలు |
| అనిలా శ్రీ కుమార్ | ప్రభావతి |
| జ్యోతి గౌడ | మౌనిక |
| ఉషశ్రీ | పార్వతి |
| యశ్వంత్ | మనోజ్ |
| భరత్ | శివ |
| డబ్బింగ్ జానకి | సుశీల |
ఈరోజు మే 5 ఎపిసోడ్ లో హైలెట్స్
- బాలు వీడియో చూసి షాక్
- సిసి ఫుటేజ్ లో దొంగలుగా బయటపడ్డ గుణ, బాలు బావమరిది శివ
- శివ గురించి కాలేజీకి బాలు
- శివపై అపారమైన నమ్మకంతో తల్లి
- రోడ్డు పైన గుణాకి రాజేష్ కి గొడవ
- గుణాని, మధ్యలో అడ్డువచ్చిన శివా ని వీర ఉతుకుడు ఉతికిన బాలు
- చేయి నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయినా శివ
Gundeninda Gudigantalu Serial 05/05/2025 ప్రతి ఎపిసోడ్ లోనూ ఊహించని మలుపులతో, సీన్స్ తో ఆకట్టుకుంటున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు కూడా మంచి ట్విస్ట్ తో ముందుకు సాగింది. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతలు, అలకలు, బుజ్జగింపులు నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అలరిస్తున్న ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో నా రైటింగ్స్ లో ఇప్పుడు చూద్దాం.
ఫోటో పెద్దది చేసి పెట్టు
అడ్డు చెప్పిన ప్రభావతి
ఉగాదికి ఊరు వెళ్లినప్పుడు దిగిన ఫోటోను పెద్దదిగా చేయించి హాల్లో పెడితే, అందరూ కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆనందంగా ఉంటారని సత్యం అంటాడు. వెంటనే బాలుని వెళ్లి ఒక ఫోటో పెద్దదిగా చేయించమని చెప్తాడు. ప్రభావతి ఎన్ని రకాలుగా వద్దని ప్రయత్నించినా, సత్యం వినడు. ఇక్కడ పెట్టే ఫోటోలో నేను, మీనా ఉంటాం కాబట్టి వద్దని అమ్మ అంటుందని బాలు అనడంతో, అవును ఆ పూల కొట్టు మొహాన్ని రోజు ఎలా చూస్తాను? అంటుంది ప్రభావతి. దానికి మీనాకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. బాలు, సత్యం మాట విని ఫోటో చేయించడానికి బయటికి వెళ్లిపోతాడు. తన మాట నెగ్గనందుకు ప్రభావతి బుంగమూతి పెట్టుకుంటుంది.
స్టూడియో కి బాలు
ఊహించని సీక్రెట్ బట్టబయలు
బాలు ఫోటో స్టూడియో కొచ్చి, తన సెల్ లో ఉన్న ఫోటోలను పెద్దదిగా చేసి ఇవ్వమని అడుగుతాడు. మీనా, బాలు మళ్లీ పెళ్లి చేసుకున్న ఫోటోలను కూడా a3 సైజులో ప్రింట్ చేసి ఇస్తానని చెప్పాడు ఫోటో స్టూడియో కుర్రాడు. ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా పెద్దదిగా చేయమని, దాన్ని ఓపెన్ చేయిస్తాడు బాలు. రెండు మూడు రోజుల్లో రెడీ చేస్తానని ఫోటో స్టూడియో అతను చెప్తాడు. ఇంతలో గ్రూప్ ఫోటోలో ప్రభావతిని చూసి స్టూడియో వాడు షాక్ అవుతాడు. ప్రభావతి మొహాన్ని జూమ్ చేసి చూస్తాడు.
వడ్డీ డబ్బులు ఎవరో కొట్టేసారట
ఏం చూస్తున్నావ్? అని బాలు అడిగితే, మీ అమ్మగారేనా? అని అడుగుతాడు. మా అమ్మే రా పక్కింటి ఆమె కాదు అంటూ ఎటకారం ఆడుతాడు.. బాలు. ఇంతకుముందు మీ అమ్మ దగ్గర ఎవరైనా డబ్బులు కొట్టేసారా? అని అడుగుతాడు స్టూడియో వాడు. అవున్రా, వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్తుంటే ఎవరో డబ్బులు కొట్టేసారు అని చెప్పింది అంటాడు బాలు.. ఈ విషయం నీకు ఎలా తెలుసు? అని అడిగితే నీకు ఒక వీడియో చూపిస్తాను..అంటూ తను షాపు ముందున్న సీసీ కెమెరా ఫుటేజ్ బాలుకి చూపిస్తాడు.
హెల్మెట్ పెట్టుకున్నవాడు ఎవడు?
ఆ వీడియోలో ప్రభావతి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంటే, బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రభావతి బ్యాగ్ లాక్కుని పారిపోతారు. అది చూసిన బాలు షాక్ అవుతాడు. అంటే ఇదంతా నిజంగానే జరిగిందా, మా అమ్మ అబద్ధం చెప్పిందేమో అనుకుని పెద్దగా పట్టించుకోలేదు అంటాడు. వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారని, ఎవరో తెలియడం లేదని బాలు అనడంతో, మా బిల్డింగ్ వెనక ఇంకొక సీసీ కెమెరా ఉంది.. ఆ కెమెరా లో రికార్డు అయినా వీడియో ఇదిగో అంటూ మరొక వీడియో ఓపెన్ చేస్తాడు.
గుణ, శివ..ఇద్దరూ దొంగలే
ఆ వీడియోలో ప్రభావతి బ్యాగ్ లో ఉన్న డబ్బును కొట్టేసిన ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఆగి ముందు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ తీస్తాడు. ఆ హెల్మెట్ తీసిన వ్యక్తి గుణ. వెనకాల మాస్క్ కట్టుకున్న కుర్రాడు శివ. వీళ్ళిద్దరిని ఆ వీడియోలో చూసిన బాలు షాక్ అవుతాడు. బాలుకి శివ ఒకసారి బైక్ మీద వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. త్వరలోనే సొంత బైక్ కొంటానేమో అన్నమాటలు కూడా బాలుకి గుర్తుకొస్తాయి. అంటే వీడు ఇలా అడ్డదారిలో సంపాదిస్తున్నాడన్నమాట అని బాలు అనుకుంటాడు.
ఎవరికీ చెప్పకు
ఆ వీడియో చూసిన బాలు మొహం కోపంతో రగిలిపోతుంది. ఇది దొంగతనం వీడియో కదా అన్నా మళ్లీ పోలీస్ కేసు అది పెడితే నాకు ఇబ్బంది అవుతుందని ఈ వీడియో ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు అని ఫోటో స్టూడియో కుర్రాడు అంటాడు. ఆ వీడియోని ఇంకెవరికి చూపించొద్దని చెప్పి తన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు బాలు. నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంటాడు. సరేనని చెప్పి స్టూడియో కుర్రాడు బాలు ఫోన్లోకి ఆ వీడియోని ట్రాన్స్ఫర్ చేస్తాడు.

అత్తగారింటికి బాలు
శివ గురించి వాకబు
మీనా ఇంటికి వస్తాడు బాలు. బాలుని చూసిన అత్తయ్య పలకరిస్తుంది. అక్క కూడా వచ్చిందా? అని మరదలు అడుగుతుంది. ఇటువైపు ట్రిప్పు కొచ్చి ఇలా చూడ్డానికి వచ్చానని బాలు చెప్తాడు. ఎలా ఉన్నారు అని అడిగితే, ఏదో అలా గడిచిపోతుంది బాబు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటూ అత్తగారు చెప్తుంది. అత్తయ్య గారు అన్న మాటలకు ఈ విషయం చెప్పాలా వద్దా? అన్నట్టుగా ఆలోచించుకుంటాడు. ఇంతలో మరదలు మంచినీళ్లు తీసుకుని వచ్చి బాలుకి ఇస్తుంది. ఆలోచనలో ఉండి బాలు వెంటనే తీసుకోడు. ఏదో ఆలోచిస్తున్నారు ఏంటి బావ? అంటూ మరదలు అడుగుతుంది. ఏం లేదు.. బాగా చదువుతున్నావా? అంటే, చదువుతున్నానని సమాధానం చెబుతుంది.
ఇంటికి దిష్టి తగిలింది
మీ నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది బాబు? అంటూ ఆరా తీస్తుంది. మీ ఇంటికి ఏదో దిష్టి తగిలినట్టుంది ఎప్పుడు కూడా ఏదో సమస్య వస్తుంది. ఒకసారి పూజారి గారికి చెప్పి ఏదైనా పూజ చేయించడం మంచిదేమో అంటుంది బాలు అత్తగారు. మొన్న మీరు, అక్క మళ్ళీ పెళ్లి చేసుకున్న ఫోటోలు ప్రింట్ చేయించారా? అంటూ మరదలు అడుగుతుంది. ఆ ఫోటో కోసం వెళ్తేనే ఒక విషయం తెలిసింది అంటాడు బాలు. ఏమైంది బాబు అంటుంది అత్తగారు. ఏమీ లేదని బాలు మాట దాటవేస్తాడు.
శివ ఎక్కడ?
భోజనం చేయమంటే, అవన్నీ వద్దు కానీ శివ ఏడి కనిపించడం లేదంటూ బావమరిది గురించి అడుగుతాడు. కాలేజీకి వెళ్ళాడని చెప్తుంది సుమతి. చదువుతోపాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడని శివా చెల్లి సుమతి చెప్తుంది. ఎక్కడ చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏమైనా చెప్పాడా? అని బాలు అడిగితే, వాళ్ళకి ఏమి తెలియదని చెప్తారు. ఇప్పుడు చాలా మారిపోయాడని చదువుతోపాటు జాబ్ చేస్తూ చక్కగా ఉంటున్నాడు అంటూ శివ మీద చాలా నమ్మకంతో చెబుతుంది తల్లి. ఆ మాటలు విన్న బాలు, శివ గురించి తెలిసిన నిజాన్ని చెప్పకూడదని అనుకుంటాడు.
కాలేజీకి బాలు
శివ చదువుతున్న కాలేజీ దగ్గరికి బాలు వస్తాడు. అసలు శివ కాలేజీకి వస్తున్నాడా లేదా? ఎవరినైనా ఫ్రెండ్స్ ని అడుగుదామని అనుకుంటాడు. ఇంతలో అటుగా వచ్చిన శివ ఫ్రెండ్స్ బాలుని గుర్తుపట్టి శివ ఈ మధ్య సరిగ్గా కాలేజీకి రావడం లేదని, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందేమో అని మేము అనుకుంటున్నామని బాలు తో చెప్తారు. కాలేజీకి రాలేదు, ఇంటిదగ్గరా లేడు అంటే, వీడు ఎక్కడో ఏదో చేస్తున్నాడు అదేంటో కనిపెట్టాలి అనుకుంటాడు బాలు.
రాజేష్, గుణ గొడవ
గుణ, శివ ఇద్దర్నీ వాయించిన బాలు
రాజేష్ తన క్యాబ్ ట్రిప్ పడడంతో, బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గుణ కార్ డోర్ ని తన్ని వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. ట్రిప్ కి వెళ్తున్నాను అంటాడు రాజేష్. ట్రిప్పులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంటికి వెళ్తే మీ ఆవిడ పండక్కి ఊరు వెళ్ళాడు అని చెప్తుంది. మీ ఆవిడని తీసుకెళ్లకుండానే ఊరు వెళ్ళావా? ఉండి అబద్ధాలు చెప్పిస్తున్నావ్ కదూ? అంటూ రాజేష్ ని ప్రశ్నిస్తాడు. దానికి పక్కనే ఉన్న రాజేష్ ఫ్రెండు నిజంగానే ఊరు వెళ్ళాడని గుణతో అంటాడు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? అంటూ అడుగుతాడు.
గుణ ని కొట్టిన రాజేష్
రెండు రోజులు టైం ఇవ్వమని రాజేష్ బ్రతిమలాడతాడు. కారు తీసుకెళ్తాను. రెండు రోజులు టైం ఇవ్వను అనగానే, మళ్ళీ వద్దు అంటూ రాజేష్ బ్రతిమాలతాడు. కారు ఇవ్వకపోతే మీ పెళ్ళాన్ని తీసుకెళ్లాలా అనగానే, రాజేష్ కి కోపం వస్తుంది. ఆ మాటకి ఆవేశంతో గుణపై చేసుకుంటాడు. గుణాని రాజేష్ గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంతలో శివ వచ్చి, నా ఫ్రెండ్ పై గొడవ పడతావా? అంటూ రాజేష్ ని అడ్డుకుంటాడు. నీకు ఈ విషయంలో సంబంధం లేదని, మీ బావ వస్తే బాధపడతాడని, వెళ్ళమని శివతో అంటాడు రాజేష్. నాకు నా ఫ్రెండ్ గుణ నే ముఖ్యం అని శివ ఆవేశంగా అంటాడు.
సీన్ లోకి బాలు ఎంట్రీ
కిందపడిన గుణ మళ్లీ లేచి, రాజేష్ పై అటాక్ చేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బాలు, గుణ చేయి పట్టుకుని ఆపుతాడు. నా ఫ్రెండ్ మీద చెయ్యి వేసావు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని బాలు కోపంతో అంటాడు. మధ్యలో నువ్వేంటి రా అనగానే బాలు గుణాని గట్టిగా పీకుతాడు. ఇంతలో శివ ముందుకు వచ్చి, బావ.. నా ఫ్రెండ్ బావ, ఒదులు బావ అంటూ బాలుని బ్రతుకులాడుతుంటాడు. వెంటనే బాలు శివ పై సీరియస్ అయ్యి, నీకు ఉంది రా.. నువ్వు పక్కనుండు అంటాడు.
శివాకి గట్టిగా ఇచ్చిన బాలు
బాలు గుణాని వదలకుండా కొడుతూ ఉంటాడు. వాడు నా ఫ్రెండ్ అంటూ, శివ బాలు షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. నా కాలరే నువ్వు పట్టుకుంటావా? అంటూ శివాని ఎగిరి అవతలపడేస్తాడు బాలు. నా ఫ్రెండ్ ని కొడతావురా అంటూ గుణ రావడంతో, చేయి చేసుకున్నాను. కాలు వేయడం మర్చిపోయాను అంటూ కాలెత్తి శివాని బలంగా తన్నుతాడు బాలు. శివ ఎగిరి దూరంగా పడతాడు.

ఇలాంటి వాడికోసం మీ బావతో..
ఇలాంటి ఎదవ కోసం మీ బావతోనే గొడవ పడతావా? శివాని అడుగుతాడు రాజేష్. వెళ్ళిపో ఇక్కడ నుంచి అనగానే, నా ఫ్రెండ్ పైనే చేయి వేస్తావా? అంటూ తిరిగి శివ రాజేష్ ని కొట్టబోతాడు. వెంటనే అడ్డుకున్న బాలు శివ చేయి వెనక్కి విరిచి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నీకు ఏమైనా అర్థం అవుతుందా? అని బాలు అనగానే, శివ కి ఏం తెలియదు వాడిని వదిలేయ్ అన్నట్టుగా రాజేష్ మాట్లాడుతాడు. చదువుకునే వయసులో ఈ పనులు ఏంట్రా? ఏం చేస్తున్నావ్ నీకు ఏమన్నా అర్థమవుతుందా? అంటూ చేయి పట్టుకుని గుంజుతూ ఉంటాడు. శివ బాధతో నొప్పి బావ అంటూ అరుస్తూ ఉంటాడు. బాలు బాగా గట్టిగా గుంజుతూ ఉంటాడు.
బాలు వాడిని వదిలేయరా? వాడికి ఏమైనా అయితే మీనా బాధపడుతుంది అని రాజేష్ అనడంతో వెంటనే వదిలేస్తాడు. ఇంకొక క్షణం ఇక్కడ గాని మీరు కనిపించారంటే, కారుతో గుద్ది చంపేస్తా అంటూ గుణాకి, శివాకి బాలు వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పక్కకు వచ్చిన గుణ నా గురించి ఎందుకురా మీ బావతో గొడవ పడ్డావు అంటే, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోను అంటాడు శివ. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పద అంటూ, ఇద్దరూ బైక్ మీద వెళ్ళిపోతారు.
గుణా కి నీకు గొడవేంటి?
వాడు చిన్న పిల్లోడు రా, వాడిపై ఎందుకు నీకు అని బాలుని రాజేష్ అడగ్గానే, నేను ఇన్నాళ్లు అలాగే అనుకున్నాను రా కానీ వాడు చాలా చేస్తున్నాడు అని బాలు అంటాడు. అంటే ఏమైంది అని రాజేష్ అడుగుతాడు. అవన్నీ తర్వాత చెప్తాను గుణతో నీకేంటి గొడవ అని అడుగుతాడు. వాడి దగ్గర వడ్డీకి అప్పు తీసుకున్నాడని, నెల నెల వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడని బాలుతో రాజేష్ ఫ్రెండ్ చెప్తాడు. ఆ డబ్బులే నాకు ఇచ్చావా? అని బాలు అడగగానే, సర్లేరా నేను ఎలాగైనా కడతాను నువ్వేం ఫీల్ అవ్వకు. నీ డబ్బులు నాకు ఇవ్వటం వల్ల ఇంత గొడవైంది. ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటూ బాలు రాజేష్ ని అడుగుతాడు. వదిలేయ్ అంటాడు రాజేష్.
ఏమైంది రా?
చేయి నొప్పితో శివ
ఇంటికి వచ్చిన శివ చెల్లెలిపై సీరియస్ అవుతాడు. కాలేజీలో లేట్ అయిందని ఎక్స్ట్రా క్లాసులు జరుగుతున్నాయని అంటాడు. ఎక్స్ట్రా క్లాసులు ఏంటో, మీ క్లాస్ కి వచ్చి రేపు మీ ఫ్రెండ్స్ ని అడుగుతాను అంటుంది సుమతి. నా సంగతి నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో అంటూ సీరియస్ అవుతాడు శివ. నువ్వు తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకురా? అంటూ అమ్మ అడుగుతుంది. పూలదండల్ని వేరే షాపులో ఇవ్వమని శివాని వెళ్ళమంటుంది. సుమతిని వెళ్ళమంటాడు. నాకు కూడా క్లాసులు ఉన్నాయి నేను చదువుకోవాలి నువ్వే వెళ్ళు అంటూ చేయి పట్టుకుని లేపుతుంది.
కింద పడ్డాను
చేయి బాగా నొప్పి పుట్టడంతో శివ గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా అంటూ తల్లి పైకి లేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను అంత ఓవరాక్షన్ చేస్తున్నావ్ అంటుంది సుమతి. ఏమైందిరా అంటూ అడగగానే బండి మీద నుంచి కింద పడ్డాను అనీ, చెయ్యి బాగా నొప్పి పుడుతుంది అని శివ బాధతో విలవిలలాడిపోతూ ఉంటాడు. ఇది బైక్ మీద నుండి పడినట్లు లేదని, ఎవరితోనైనా గొడవ పడ్డావా? అని సుమతి అడుగుతుంది. శివ ఏమి మాట్లాడడు. హాస్పిటల్ కి తీసుకెళ్తారు.
రేపటి ప్రోమో
శివ చెయ్యికి దెబ్బ తగిలిందని, హాస్పిటల్ కి రమ్మని మీనా, బాలు కి ఫోన్ చేస్తుంది. నాకు ట్రిప్పు ఉంది ఇప్పుడు రాలేనని బాలు మీనా తో అంటాడు. మీ తమ్ముడికి ఎలా ఉందమ్మా అని సత్యం అడుగుతాడు. చేతికి బాగా దెబ్బ తగిలింది అని మీనా అనడంతో, ఇంతలో అక్కడికి బాలు వస్తాడు. ట్రిప్పు కి వెళ్తానన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారేంటి అంటుంది మీనా. బామ్మర్దికి దెబ్బ తగిలితే పట్టించుకోవేంటి? వాడు చేసే పనులు మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అంటాడు బాలు. ఏం చేస్తున్నాడు ఏంటి? అంటుంది ప్రభావతి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.








