గుండె నిండా గుడిగంటలు ప్రత్యేకత
కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
Gundeninda Gudigantalu Serial 01/05/2025 సాధారణంగా టీవీ సీరియల్స్ అంటే కొంచెం అతి, ఓవర్ బిల్డప్ లు ఎక్కువగా ఉంటాయి, చిన్న దానికి, పెద్ద దానికి పెద్ద పెద్ద రియాక్షన్స్ తో నటీనటులు తమదైన శైలిలో అతి నటన ప్రదర్శిస్తూ ఉంటారు, మాటీవీలో ప్రసారమవుతున్న గుండె నిండా గుడిగంటలు దీనికి మినహాయింపు. సింపుల్ గా చక్కటి సీన్స్ తో, ఎలాంటి అసభ్యతాలేని డైలాగ్స్ తో, ఫ్యామిలీ అంతా అంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేసే సీన్స్ తో ఈ సీరియల్ వీక్షకులను ఆకట్టుకొంటోంది. ప్రతిరోజు మంచి ట్విస్ట్ తో ఎండ్ అవుతున్న “గుండె నిండా గుడి గంటలు” సీరియల్ లో ఈరోజు మే 1 ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఎపిసోడ్ హైలెట్స్
- హోటల్ లో తింటూ ప్రభ మనోజ్ కి ఫోన్ చేయడం
- బాలు, మీనాలపై రోహిణి కుట్ర
- సత్యం ని కాపాడిన మీనా
- మీనా పై రెచ్చిపోయిన ప్రభ
- ప్రభ మాటలకి అడ్డు చెప్పిన బాలు
సర్వర్ మనోజ్
పేరు మార్చుకోమని చెప్తాను
హోటల్లో టిఫిన్ తినడానికి వచ్చిన ప్రభావతి, మీనాక్షి మనోజ్ అనే సర్వర్ గురించి మాట్లాడుకుంటారు. మనోజ్ పేరు పెట్టుకుని ఆ పేరు విలువ తీస్తున్నాడని ప్రభ అంటుంది. ఒక వంద రూపాయలు ఇచ్చి పేరు మార్చుకోమని చెప్తాను అని ప్రభావతి అనగానే, మీనాక్షి నీకు మరీ చాదస్తం ఎక్కువైంది అంటుంది. మనోజ్ ని మేనేజర్ కస్టమర్ లు వచ్చారు ఆర్డర్ తీసుకో అంటూ చెప్పడంతో ఇంకో వైపు వెళతాడు. మనోజ్ బదులు ఇంకొక సర్వర్ వచ్చి ఈ ప్రభావతి, మీనాక్షిలకు ఐటమ్స్ ఇచ్చి వెళతాడు.
మనోజ్ కి ప్రభ ఫోన్
ప్రభావతి, మీనాక్షి గుర్తుపట్టకుండా మనోజ్ మాస్క్ పెట్టుకుని, ప్రభావతి పక్క టేబుల్ లో ఆర్డర్ తీసుకుంటూ ఉంటాడు. మనోజ్ ఉదయం ఏమి తినకుండా వెళ్లిపోయాడని, ఏమైనా తిన్నాడో లేదో కనుక్కుంటానని ప్రభావతి ఫోన్ తీసి మనోజ్ కి ఫోన్ చేస్తుంది. మనోజ్ ఫోను కౌంటర్ దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది. ఆ రింగ్టోన్ విని ఇది మనోజ్ రింగ్టోన్ లాగా ఉంది ఏంటి అంటుంది ప్రభావతి. కొంపతీసి ఆ మనోజే ఈ మనోజ్ ఏమో అని మీనాక్షి అంటుంది. తన ఫోన్ రింగ్ అవ్వడం గమనించిన మనోజ్ ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాడు. నేను చూస్తా ఉండు అంటూ మీనాక్షి ఫోన్ రింగ్ అవుతున్న కౌంటర్ వైపు వెళుతుంది.
తెలివిగా తప్పించుకున్న మనోజ్
ఇంతలో సడన్ గా అటుగా వచ్చిన హోటల్ స్టాఫ్ కౌంటర్ కుర్రాడిని అక్కడి నుండి నా ఫోను తీయమని మనోజ్ చెప్పడంతో, కౌంటర్ లో కూర్చునే వ్యక్తి వచ్చి అక్కడ చార్జింగ్ పెట్టిన మనోజ్ ఫోను తీస్తాడు. అది గమనించిన మీనాక్షి ఈ ఫోను ఈ కుర్రాడుదనుకుంటా అయితే మనోజ్ ఇక్కడ పనిచేయడం లేదన్నమాట అనుకుంటుంది. ఆ తర్వాత మనోజ్ కిచెన్ లోకి వచ్చి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. అది చూసి ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రభావతి.
ఆఫీస్ లో బిజీ నా?
ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రభావతి సాఫ్ట్వేర్ కంపెనీలో బిజీగా ఉన్నావా నాన్నా అని అడుగుతుంది. అవునమ్మా ఆర్డర్ తీసుకుంటున్నాను అంటాడు. ఆర్డర్ తీసుకోవడం ఏంట్రా అంటే, అదే అదే ఆర్డర్ వేస్తున్నానంటూ కవర్ చేస్తాడు. లంచ్ టైమ్ అని, లంచ్ చేస్తున్నానని ఈవినింగ్ వరకూ రానని ప్రభావతికి మనోజ్ చెప్తాడు. ఇంతలో ఆ హోటల్ మేనేజర్ మనోజ్ ఆర్డర్ తీసుకో అని అరవడంతో ఈ సర్వర్ మనోజ్ గోల ఏంట్రా బాబు అనుకుంటూ తల పట్టుకుంటుంది.
రోహిణి కుట్ర
బాలు, మీనాలే టార్గెట్
రోహిణి పార్లల్లోకి వచ్చి దివ్యని పిలుస్తుంది. హ్యాండ్ బ్యాగ్ లోంచి డబ్బులు తీసి దివ్యకిస్తూ, ఆ బ్లాక్ మెయిలర్ దిలీప్ కి ఆ డబ్బు ఇవ్వమని అంటుంది. ఈ డబ్బులు ఎక్కడివి? అని అడిగితే, బ్యాంకులో పర్సనల్ లోన్ పెట్టానని చెప్తుంది రోహిణి. ఎన్నిసార్లు ఇలా వాడికి డబ్బులు ఇస్తావు అని అడిగితే, వాడి వల్ల, వాడికి తెలిసిన సీక్రెట్స్ వల్ల నా కాపురం పోయేటట్టుంది. ఎలా అయినా సరే పార్లర్ కొనాలి… అంటుంది రోహిణి. కొనాలి అంటే డబ్బులు ఉండాలిగా అంటుంది దివ్య.
వేరే కాపురం పెట్టను
మనోజ్ ఈమధ్య ఉద్యోగం చేస్తున్నాడని, దాని ద్వారా ప్లాన్ చేస్తానని రోహిణి చెప్పడంతో, మనోజ్ జాబ్ చేయడం ఏంటి? పార్క్ లో లొకేషన్ గాని మార్చాడా ఏంటి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దివ్య. నువ్వేంటి ఆ బాలు లా మాట్లాడుతావు అంటూ రోహిణి దివ్యతో అంటుంది. నీ కాపురం బాగుండాలి అంటే మనోజ్, నువ్వు వేరే కాపురం పెడితేనే సెట్ అవుతుంది అంటుంది దివ్య, తనకి జాయింట్ ఫ్యామిలీలో ఉండడం ఇష్టమని, నేను అక్కడే ఉంటానని, బాలు మీనాలనే బయటకు పంపించే ప్లాన్ చేస్తానని రోహిణి దివ్యతో అంటుంది. తన అత్తగారి కోరిక కూడా అదేనని చెప్తుంది.
శ్రుతి దోమల మందు
సత్యం అస్వస్థత
శృతి ఇంటికి రావడంతో ఒక్కదానివే వచ్చావ్ ఏంటి శృతి? రవి రాలేదా? అంటూ మీనా అడుగుతుంది. రవికి వర్క్ ఉండి రాలేదు అంటుంది శృతి. కాపీ పెట్టి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే అంటుంది మీనా. రిలాక్స్డ్ గా శృతి హాల్లో కూర్చుంటుంది. ఇంతలో దోమలు కుడుతూ ఉండడంతో, దోమల మందు స్ప్రే చేద్దామని బాగ్ లోనుండి దోమల మందు తీసి కొడుతూ ఉంటుంది. కిటికీలన్నీ మూసివేసి దోమలు స్ప్రే కొడుతూ ఉంటుంది. ఇంతలో మీనా కాపీ తీసుకుని హాల్లోకి వస్తుంది. ఆ వాసన చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. వాసన ఎక్కువగా వస్తుందని, ఇక కొట్టవద్దు అంటూ మీనా చెబుతుంది. ఎక్కువ కొడితే దోమలు వెంటనే చనిపోతాయంటూ శృతి స్ప్రే ఎక్కువ చేస్తుంది.
తిరిగి స్టూడియో కి శ్రుతి
శృతి కొట్టిన స్ప్రే స్మెల్ ని భరించలేక చెంగుతో ముక్కుమూసుకుంటుంది మీనా. ఇంతలో శృతికి ఫోన్ రావడంతో స్టూడియో కు మళ్ళీ తిరిగి బయలుదేరుతుంది. కాపీ కూడా తాగకుండా గబగబా వెళ్ళిపోతుంది శృతి. ఇంతలో బయట నుంచి వచ్చిన సత్యం ఏంటి వాసన అనుకుంటూ ఉంటాడు. మీనా అని పిలుస్తాడు. మామ గారికి మంచినీళ్లు తీసుకుని వస్తుంది మీనా. మంచినీళ్లు తాగిన సత్యం అత్తయ్య ఎక్కడుందమ్మా అంటే కామాక్షి ఇద్దరు బయటికి వెళ్లారు అని చెప్తుంది. సత్యం ఆ వాసనకి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఈ వాసన ఏదో తేడాగా ఉంది అంటాడు మీనాతో.

గుండె పట్టేసినట్టు ఉంది
కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్తున్న మీనా. సత్యం ఎక్కువగా దగ్గుతూ ఉండడంతో మావయ్య ఏమైంది అంటూ కంగారుపడుతూ వెనక్కి వస్తుంది. సత్యం గుండె పట్టుకుంటూ ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. గుండె పట్టేసినట్టు ఉంది అంటాడు. కంగారు పడిన మీనా వెంటనే ఫోన్ తీసి బాలుకు చేస్తూ, ఏం కాదు మావయ్య, ఏం కాదు మావయ్య అంటూ సముదాయిస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలు ఫోను లిఫ్ట్ చేయడు. బయటికి వెళ్లి ఆటో తీసుకొని వస్తానంటూ బయటికి పరిగెత్తుతుంది.
సత్యాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన మీనా
చార్జింగ్ పెట్టిన ఫోన్ తీసి చూస్తాడు బాలు. మీనా చాలా సార్లు ఫోన్ చేసినట్టు ఉంది ఎందుకో అంటూ తిరిగి చేస్తే, మావయ్య గారికి సడన్ గా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయిందని, అందుకోసం హాస్పిటల్ కి ఆటోలో తీసుకెళ్తున్నానని చెప్పగానే, బాలు కంగారు పడతాడు, మొన్ననే కదా హార్ట్ కి ఆపరేషన్ అయింది? ఇప్పుడు ఇలా అయిందేటి అంటాడు బాలు తో ఉన్న రాజేష్. బాలు, రాజేష్ హాస్పిటల్ కి బయలుదేరుతారు.
హాస్పిటల్ కి బాలు
రాజేష్ సహాయం
హాస్పిటల్ కి వచ్చిన బాలు వెంటనే రూమ్ లోకి కంగారుగా వెళ్లడంతో డాక్టర్ ఆగమని చెప్పి బయటికి తీసుకొచ్చి బాలు తో మాట్లాడుతాడు. ఆయనకు ఇంతకుముందు హార్ట్ కి స్టంట్ వేశారు కదా? అని అడుగుతాడు డాక్టర్. సత్యానికి ఊపిరి తీసుకోవడంలో సమస్య వచ్చిందని మస్కిటో స్ప్రేవల్ల ఇది జరిగిందని డాక్టర్ బాలుకు చెప్తాడు. కరెక్ట్ టైం కి తీసుకొచ్చి మీ భార్య మీనా చాలా మంచి పని చేసిందని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అయ్యేదని డాక్టర్ చెప్తాడు.
ఏమైంది? ఆ దోమల మందు ఏంటి? అని మీనాని బాలు అడుగుతాడు. ఇంతలో నర్స్ బిల్లు తీసుకొచ్చి ఇస్తుంది. 15000 కట్టమని చెప్తుంది. ఇప్పుడు ఈ బిల్లు ఎలా కట్టాలి అని టెన్షన్ పడుతూ, బాలు వేరే వాళ్ళకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే, తన దగ్గర డబ్బులు ఉన్నాయని రాజేష్ డబ్బులు తీసి ఇస్తాడు. వద్దని బాలు అంటే, ఈ డబ్బులు కడితే గాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు..అంటూ రాజేష్ ఆ బిల్లు తీసుకుని కౌంటర్ వైపు వెళ్తాడు.
హాస్పిటల్ కి ప్రభావతి
బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న సత్యం ను చూసి బాధపడతాడు బాలు. ఇంతలో ప్రభావతి బయటనుండి వస్తూ, బాలు, మీనాల్ని తోసుకుంటూ వచ్చి, ఏవండీ ఏమైంది? ఏమైంది? అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైందని బాలుని కంగారుగా అడగడంతో ఇంట్లో దోమల మందు కొట్టడం వల్ల ఇలా అయింది అంటూ బాలు ప్రభావతితో అంటాడు.
మీనానే ఆ దోమల మందు కొట్టి ఉంటుందని, దానివల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందని, ఇంతకుముందు గుండెపోటు బాలు వల్ల వచ్చిందని, ఇప్పుడు ఈ ప్రాబ్లం మీనా వలన వచ్చిందని, దోమలుకి ఆ మాత్రం ఓర్చుకోలేవా అంటూ మీనా తాను కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా గాని గ్యాప్ ఇవ్వకుండా ప్రభావతి మీనాని తిడుతూ ఉంటుంది. ఇంతలో సత్యం కళ్ళు తెరుస్తాడు. మాస్క్ తీసిన సత్యం మీనాని ఏమీ అనకు అనడంతో, మీరు మాస్క్ ఎందుకు తీస్తారు? రెస్ట్ తీసుకోండి. డాక్టర్ మాస్క్ తీయొద్దు అన్నారు కదా? అంటూ సత్యంని ఏమీ మాట్లడనివ్వరు.
స్ప్రే నేను కొట్టలేదని, తను ఎప్పుడూ అంత బాధ్యత లేకుండా లేనని మీనా చెప్తుంది. మరి ఎవరు కొట్టారు దోమల మందు అని అడగ్గానే శృతి పేరు చెప్తుంది మీనా. విన్నావు కదా ఇప్పుడు ఎవరికి పెడతావు గడ్డి అంటూ బాలు ప్రభ తో అంటాడు. శృతి బాగా చదువుకున్న అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది? మనం తిడుతున్నామని చెప్పి మీనానే స్ప్రే కొట్టి, శ్రుతి మీదకు తోస్తుందని ప్రభ అనటంతో కనీసం నేను మనిషిలాగ కూడా కనపడటం లేదా? అంటూ మీనా బాధ పడుతుంది. కావాలంటే శృతికి ఫోన్ చేసి అడగమని చెప్తుంది. ఇదంతా బాధతో చూస్తూ ఉంటాడు సత్యం.
హార్ట్ పేషెంట్ ని ఇంట్లో పెట్టుకుని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ బాలు శృతి పై సీరియస్ అవుతాడు. రవి, మనోజ్ వస్తారు. రవి ఏమైంది అని అడగగానే వెళ్లి నీ పెళ్ళాన్ని అడగరా మగాడ అంటాడు బాలు. నీ భార్య వల్లే నాన్న హాస్పిటల్ పాలు అయ్యాడని బాలు అంటాడు. ఏమైందిరా అంటూ మనోజ్ కంగారు పడితే, హాస్పిటల్ బిల్లు కట్టాలంట వెళ్లి కట్టారా అని కౌంటర్ ఇస్తాడు బాలు.
ఒరేయ్ బాలు ఇక వదిలేయరా అంటూ సత్యం మాస్క్ తీస్తాడు. అది చూసిన ప్రభ వీళ్లిద్దరూ కొట్టుకుంటున్నారు నేనున్నాను కదా విడదీయడానికి మీరు ఎందుకు మాస్క్ తీస్తారు అంటూ సత్యంపై సీరియస్ అవుతుంది. శృతి చేసిందానికి రవిని తిట్టడం వల్ల ఏమి లాభం? ఒకరు తప్పు చేస్తే మీరు ఇంకొకరిని తిడతారు ఎందుకు? మీరు కూడా అత్తయ్య లాగే మాట్లాడుతున్నారు అంటుంది మీనా బాలుతో. ఏమైంది వదినా అని రవి అడగ్గానే, శృతి చేసిన పని గురించి చెప్తుంది మీనా.
మీనా చేసింది అని నువ్వు అనుకోగానే, మీనా మీద బాగా ఎగిరావు కదా? ఇప్పుడెందుకు అంత కూల్ గా చెప్తున్నావు అంటూ బాలు ప్రభావతిని అడుగుతాడు. మళ్ళీ బాలుకి దొరికిపోయానని, మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తాడో లేదోనని రవి మనసులో అనుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో..
సత్యం హాల్లో కూర్చుని ఉంటాడు. మిగతా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. అప్పుడే హాస్పిటల్లో నుంచి వచ్చేసారేంటి? నేను ఇంకా వారం రోజులైనా పడుతుందనుకున్నాను అని శృతి అంటుంది. అంటే చాలా పెద్ద ప్లాన్ వేసావా? అంటూ శృతిని బాలు అడుగుతాడు. వదిలేయరా అంటూ సత్యం బాలుతో అంటాడు. నువ్వు కొట్టిన దోమల స్ప్రేవల్ల మావయ్యకి సీరియస్ అయ్యింది అంటూ శ్రుతితో అంటారు అందరూ. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ సీరియల్ బాలు, మీనా గా నటిస్తోన్న విష్ణుకాంత్, అమూల్య గౌడ నటనకు మంచి స్పందన వస్తోంది. ఈ సీరియల్ ని స్టార్ మా ఛానల్ లో కంటే ముందుగానే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయవచ్చు. ఈ సీరియల్ పై మీ కామెంట్, అలాగే మీకు నచ్చిన పాత్ర గురించి క్రింద ఉన్న బాక్స్ లో తెలియజేయండి.








