Gunde Ninda Gudi Gantalu Serial 19/05/2025

మంచి సందేశం

ఇదే ఈ సీరియల్ ప్రత్యేకత

Gunde Ninda Gudi Gantalu Serial 19/05/2025 ఒక సినిమా అయినా, సీరియల్ అయినా మంచి వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించాలి. అప్పుడే దానికి అసలైన విలువ. సమాజంలో రోజురోజుకీ పతనమవుతున్న కుటుంబ వ్యవస్థ, దాదాపు కనుమరుగైన ఉమ్మడి కుటుంభ వ్యవస్థలోని లోటుపాట్లను, ఆటుపోటులను అందరి హృదయాలను హత్తుకునేటట్టు “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ ప్రతి రోజు ముస్తాబవుతోంది. ప్రస్తుతం, బావ అయిన బాలుకి, బావమరిది అయిన శివ కి మధ్య అభిప్రాయ భేదాలతో ఈ సీరియల్ రోజురోజుకీ రక్తి కడుతోంది. జనరేషన్ గ్యాప్ ని అద్భుతంగా చూపిస్తూ, ఈనాటి యూత్ ఎలా పాడైపోతున్నారు? అనే విషయాన్ని శివ క్యారెక్టర్ తో ఈ సీరియల్ ఎస్టాబ్లిష్ చేస్తోంది. వినోదంతో పాటు, హత్తుకునే సన్నివేశాలతో అలరిస్తున్న “గుండె నిండా గుడిగంటలు” సీరియల్లో విష్ణు కాంత్, అమూల్య గౌడ జంటగా నటిస్తున్నారు. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం.

ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్

  • బాలుని నిలదీసిన సత్యం
  • నేని ఇంతే అంటూ నిజం దాచేసిన బాలు
  • మీనాతో మరోసారి వాదులాట
  • డాబా పైకి నిద్రపోడానికి వచ్చిన మనోజ్, రవి
  • ముగ్గురు అన్నదమ్ముల ఆప్యాయత
  • ముచ్చట్లు చెప్పుకున్న ముగ్గురు తోటికోడళ్ళు

బాలుపై రెచ్చిపోయిన సత్యం

నీ మొహం నాకు చూపించకు

మామగారి సంవత్సరీకం కోసం అత్తగారింటికి వెళ్లి బావమరిది శివను మళ్లీ కొడతాడు బాలు. తిరిగి ఇంటికి వచ్చిన బాలుని సత్యం నిలదీస్తాడు. మరి ఇంత మూర్ఖంగా తయారయ్యావు ఏంట్రా? వాళ్లేదో కార్యక్రమం చేసుకుంటుంటే వాళ్ళని మరింత బాధ పెట్టి వచ్చావు అంటూ బాలు పై సీరియస్ అవుతాడు సత్యం. తను ఏం చేసినా ఒక కారణం ఉంటుందని, ఊరికే ఏమీ చేయనని బాలు అంటాడు. ఆ మాట విన్న ప్రభ ఆ కారణమేంటో చెప్పొచ్చు కదా? అని అడుగుతుంది. బాలు మాట దాటవేస్తాడు. అక్కడే ఉన్న మీనా తన తండ్రికి సంవత్సరీకం కూడా సరిగ్గా చేయలేకపోయామని, ఆయన ఆత్మకు శాంతి లేదని బాధపడుతుంది. ఆ మాటలు విన్న సత్యం, బాలు పై మరింత రెచ్చిపోతాడు. నీ పనులు, నువ్వు నచ్చడం లేదని నా కంటికి ఎదురుగా నువ్వు రావద్దని, కొడుకుని తిట్టిపోసి అక్కడనుండి సత్యం వెళ్లిపోతాడు.

నా చెయ్యి కూడా విరిచేయండి

మీనా కూడా హాల్లో నుండి వంట గదిలోకి వెళుతుంది. మీనా ను ఫాలో అవుతూ బాలు కూడా వంటగదిలోకి వెళ్తాడు. అక్కడే ఉన్న ప్రభ, అత్తగారంటే బాలు గాడు ఎంతో ప్రేమ చూపించేవాడని, ఇలా మండిపడుతున్నాడు అంటే ఏదో బలమైన కారణమే ఉందని, అదేంటో ఈరోజు తెలియకపోయినా ఖచ్చితంగా బయటపడుతుందని ప్రభ, కోడలు రోహిణి తో అంటుంది. రోహిణి కూడా నిజమే అత్తయ్య అన్నట్టుగా ప్రభ తో అంటుంది. వంటగదిలోకి వచ్చిన బాలు, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తావ్ ఎందుకు? అంటూ మీనాని ప్రశ్నిస్తాడు. నా కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మావయ్య గారికి చెప్పకుండా ఎవరికి చెప్తాను? అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది మీనా. మా నాన్న నా మొహమే చూపించొద్దు అన్నాడు. ఎందుకు ఇదంతా అంటాడు. అయితే నా చెయ్యి గానీ కాలు గాని విరిచేయండి, అని బాలుని అనడంతో మీనా అంటూ ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోతాడు.

నేనే చెడ్డవాడ్ని

తను కారణం లేకుండా ఏ పని చేయనని మరోసారి మీనాతో బాలు అంటాడు. మీకు కారణాలు అవసరం లేదని, మీకున్న కారణం ఆవేశమని, ఆవేశంతో బయటి వాళ్ళనే కాకుండా ఇంట్లో వాళ్ళను కూడా కొడుతున్నారని, నా కుటుంబాన్ని నన్ను ఇలా వదిలేయండి. ఇంకెప్పుడూ మా విషయాల జోలికి రావద్దు అని మీనా కోపంతో అంటుంది. నేను చిన్నప్పుడు నుంచి ఇంతే. నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మీరు మీరు అందరూ మంచివాళ్లు, నేనే చెడ్డవాడిని అని బాలు అనడంతో, ఆ మాటకి మీనాకి ఏమనాలో అర్ధం కాక వంట గదిలో ఉన్న సామాన్లను కోపంతో చెల్లా చెదురు చేస్తుంది. అక్కడి నుండి బాలు బయటకు వెళ్ళిపోతాడు.

ప్రభావతి ఆనందం

వంటగదిలో బాలు, మీనాల మధ్య జరిగిన గొడవని హాల్లో నుండి ప్రభావతి వింటుంది. ఈ గొడవ ఇలాగే ముదిరి ఇంకా పెద్దదైతే, మీనా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతుంది. నా కోరిక తీరుతుంది. అంతేకాదు, అది పెట్టిన ఆ పూల కొట్టు కూడా ఎలాగోలా పీకించేయాలి అంటూ మనసులో ఆనంద పడుతుంది. బాలుకి, మీనా కి గొడవ జరిగిన విషయంలో చాలా సంతోషంగా ప్రభావం ఉంటుంది ప్రభావతి.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
Gunde Ninda Gudi Gantalu Serial 19/05/2025

హాలిడే ట్రిప్

శ్రుతికి నో చెప్పిన రవి

గదిలోకి వచ్చిన శృతి, వాళ్ళ అమ్మ స్టూడియోకి వచ్చినట్టుగా రవికి చెప్తుంది. స్టూడియోకెందుకు? ఇంటికే రావచ్చుగా అని రవి అంటే, మనిద్దరం సైకిల్ మీద వెళ్లడం చూసి, మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి వచ్చింది అంటుంది. ఇలాంటి స్టుపిడ్ రీజన్స్ లేకుండా మీ మమ్మీ రాదుగా అన్నట్టుగా రవి మాట్లాడుతాడు. హ్యాండ్ బ్యాగ్ లోంచి వాళ్ళ మమ్మీ ట్రిప్ కోసం ఇచ్చిన కూపన్స్ తీస్తుంది శృతి. నాలుగు రోజులు ట్రిప్ కి వెళ్ళమని, ఈ కూపన్స్ మా డాడీ ఇచ్చారని మనం వెళ్దామని రవితో అంటే, నాకు ఖాళీ లేదని రెస్టారెంట్లో చాలా బిజీగా ఉన్నానని రవి అంటాడు. శృతి ఎన్ని రకాలుగా చెప్పడానికి ప్రయత్నించినా సెలవు పెట్టి నేను రాలేను అంటూ రవి అక్కడినుండి వెళ్ళిపోతాడు. వేస్ట్ ఫెలో అంటూ శృతి రవిని తిట్టుకుంటుంది.

డాబా పైకి వచ్చిన కాపురం

బాలుకి తోడుగా..మనోజ్, రవి

రాత్రి అవ్వగానే చాప, దిండు తీసుకుని డాబా పైకి వస్తాడు బాలు, ఈ ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఎండు చేపని ఎండబెట్టినట్టు ఎండబెడతారు అనుకుంటూ చాప వేసుకుని పడుకుంటాడు, ఇంతలో మనోజ్ కూడా చాప దిండూ తీసుకుని డాబా పైకి రావడం చూసి షాక్ అవుతాడు. నీకేమైంది రా? అని అడిగితే, కింద బాగా ఉక్కపోతగా ఉందని, అందుకే వచ్చానని అంటాడు. ఓహో అంత వేడిగా ఉందా వాతావరణం? అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, రవి కూడా చాప దిండు పట్టుకుని డాబా పైకి వస్తాడు. ఈసారి రవిని చూసి ఇద్దరు షాక్ అవుతారు. నీకేమైంది? అని అడిగితే గదిలో వాతావరణం చాలా హీట్ ఎక్కిందని, అందుకే పైన పడుకోవడానికి వచ్చానని అంటాడు రవి. పెళ్లికాకముందు పెద్ద తప్పు చేసినా, చిన్నగా చూసేదని ఇప్పుడు చిన్న తప్పుకే పరిస్థితి ఇలా తయారైందని రవి అంటాడు.

అన్నదమ్ముల అనుబంధం

చిన్నప్పుడు అమ్మానాన్న పోట్లాడుకుంటే, మన ముగ్గురం ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం కదా అని చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటారు. ఆ రోజులే బాగుండేవి రా ఇప్పుడు పెళ్లయిన తర్వాత ముగ్గురికీ కూడా కష్టాలు కట్టకట్టుకుని వచ్చాయి అని అన్నదమ్ములు జోక్స్ వేసుకుంటారు. మరి ఇలాంటి టైం లో నువ్వు మందు కొడతావు కదరా? అని బాలుని మనోజ్ అడుగుతాడు. మందు కొడితే కొన్ని నిజాలు బయటికి వస్తాయి. అందుకే పెళ్ళాలను కొడదాం అంటాడు బాలు. భార్యల్ని కొట్టడం సంస్కారం కాదు అని మనోజ్ అనగానే, సరదాగా అన్నాలే అని అన్నదమ్ములు ముగ్గురు చిన్ననాటి విషయాలు మరి కొన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటారు.

తోటిలోడళ్ళు టీ కథ

మీనా తో కలిసిన రోహిణి, శ్రుతి

బాలు డాబా పైన పడుకోవడంతో నిద్ర పట్టక, వంటగదిలో టీ పెట్టుకుంటూ ఉంటుంది మీనా. ఇంతలో అక్కడికి శృతి వస్తుంది. నిద్ర పట్టడం లేదు నాకు కూడా ఇవ్వు అనిఅంటే, రవి ఏం చేస్తున్నాడు అని మీనా అడుగుతుంది. రవి డాబా పైన పడుకున్నాడని శృతి చెప్పడంతో, ఏమైంది? అని అడుగుతుంది. రవి పైకి కనిపించని మరో బాలు లాంటోడని, అంత సాఫ్ట్ కాదని శృతి అంటుంది. ఇంతలో నిద్ర పట్టక రోహిణి కూడా అక్కడికి వస్తుంది. ముగ్గురు తోటికోడళ్ళు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. తనకి కూడా టీ కావాలని రోహిణి అంటుంది. ముగ్గురూ టీ తాగుతూ పక్కపక్కనే కూర్చుంటారు.

ముగ్గురూ ఇలా ఎప్పుడూ కలవలేదు

పెళ్లికి ముందు మగవాళ్ళు వేరని, పెళ్లయిన తర్వాత వేరని ఒకరికొకరు చెప్పుకుంటారు. పెళ్లి కాకముందు మనం తప్పు చేసిన వాళ్ళే సారీ చెప్తారని, ఇప్పుడు మాత్రం మౌనంతో చంపుతారని శృతి అంటుంది. ముగ్గురు కూడా ఒక రక్తం పంచుకునే పుట్టిన అన్నదమ్ములే కదా, పైకి కనిపించకపోయినా ముగ్గురికి కూడా ఒకలాంటి లక్షణాలే ఉన్నాయని అనుకుంటారు. ఏది ఏమైనా వాళ్లు పైన పడుకోవడం చాలా మంచిదయింది. మన ముగ్గురం కూడా ఒకరి మనసులో మాట మరొకరు షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికిందని అనుకుంటారు. ఇంతలో డాబా పైన పడుకున్న బాలు, రవి, మనోజ్ ముగ్గురూ జోకులేసుకుంటూ నవ్వుకోవడం వినబడుతుంది. మనం ఇలా బాధలో ఉంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని, రేపటి నుంచి మనం ఏంటో చూపించాలి. మీరు కూడా అదే మాట మీద ఉండండి అంటుంది శృతి. ముగ్గురూ నవ్వుకుంటారు.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

రేపటి ప్రోమో

రేపటి ఎపిసోడ్ ప్రోమో లో, బయట కారు లేదని ఏమైందని బాలుని సత్యం అడుగుతాడు. తన ఫ్రెండ్ కి ఇచ్చినట్టుగా బాలు చెప్తాడు. వీడు చెప్పిందాంట్లో ఏదో అబద్ధం ఉంది అనుకుంటుంది ప్రభావతి. బాలు తన గదిలో ఫోన్లో వీడియో చూస్తూ సీరియస్ గా ఉంటాడు. అది మీనా గమనిస్తుంది. బాలు ఫోన్ మంచం పై పెట్టి వాష్ రూమ్ కి వెళ్తాడు. ఏం చూస్తున్నాడు ఇందులో అంత సీరియస్ గా ఉన్నాడు అని మీనా అనుకుంటూ, ఫోను తీసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో బాలు వాష్ రూమ్ నుండి బయటకు వస్తాడు. మీనా ఫోన్ చూడడం చూసి కంగారు పడతాడు. ఇదీ ఈరోజు కథ. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం అవుతుంది.

విశ్లేషణ

మారిపోతున్న జీవన పరిస్థితుల వల్ల ఉమ్మడి కుటుంబాలనేవి ఈ రోజుల్లో అరుదైపోతున్నాయి. ఈ సీరియల్ లో ముగ్గురు అన్నదమ్ములు వాళ్లకి ముగ్గురు భార్యలు ఉంటారు. ఉండడానికి అందరూ కలిసే ఉంటున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా, ఒకరిపై మరొకరి అక్కసు వెళ్ళగకుతూ ఉంటారు. ఒకప్పుడు కుటుంబంలో ఇంటి పెద్ద సంపాదిస్తూ ఉంటే మిగతా కుటుంబ సభ్యులు ఇంట్లోనే తిను కూర్చునేవారు. ఇప్పుడు ఎవరికి వారు సంపాదించవలసిన పరిస్థితి రావడంతో, కుటుంబ సభ్యుల మధ్య ఈ అసూయలు, పంతాలు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, మనిషికి మనిషికి తోడుంటే ఈ అనుబంధాలు గట్టిపడి మానవ సంబంధాలు మరింత బలంగా మారతాయని నా అభిప్రాయం. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెగ్యులర్ గా ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన వెబ్ సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Leave a Comment