ఇది మన కథ
మన అందరి కథ
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 13/05/2025 ఏదైనా సీరియల్ గాని, సినిమా గానీ విజయవంతం అవ్వాలంటే అందులోని కథనాలు, పాత్రలు మన చుట్టూ ఉండే సజీవమైన పాత్రల్లా కనిపించాలి. ఒక సీన్ చూస్తుంటే ఇది మన ఫ్యామిలీలో జరిగేదే అనిపించాలి. ఒక క్యారెక్టర్ ని చూసినట్లయితే ఇలాంటి వ్యక్తి మన ఇంటి పక్క ఉన్నాడు కదా? అని అనిపించినప్పుడే ఆ సీరియల్ లోని పాత్రలతో, చూస్తున్న ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్ పక్కాగా కుదిరింది అంటే. ఇక ఆ సీరియల్ విజయానికి తిరుగు ఉండదు. ఇది మన కథ, మనందరి కథ అనిపించే కథతో మాటీవీలో ప్రసారం అవుతున్న “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ వీక్షకులందర్నీ ఆకట్టుకొంటోంది. సరదా సన్నివేశాలతో పాటు, భావోద్వేగా సన్నివేశాలతో అలరిస్తున్న ఈ సీరియల్లో ఈరోజు (13/05/2025) ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్
- కారు అమ్మేసిన బాలు
- గుణా అప్పు తీర్చిన బాలు
- శివ ని చూడటానికి వచ్చిన సత్యం
- శివ తల్లికి క్షమాపణ చెప్పిన సత్యం
- మీనా గురించి కంగారు పడిన అమ్మ
- బాలుని నిలదీసిన సత్యం

మీనాకి నిజం చెప్పేయాలి
కుదురులేని బాలు మనసు
చాప, దిండు తీసుకుని వచ్చి డాబాపై పడుకుంటాడు బాలు. పడుకున్న దగ్గరనుంచీ ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సుశీల వాళ్ళిద్దర్నీ ఆశీర్వదిస్తూ, మీరిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తర్వాత మీనా తో జరిగిన గొడవ, తనను వదిలి వెళ్ళిపోతానని మీనా కోపంగా వెళ్లిపోవడం, ఇవన్నీ గుర్తుకొచ్చి బాలు వెంటనే లేస్తాడు. నిజంగా ఇలాగే ఉంటే మీనాకి, తనకి గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయని నిజం చెప్పేయాలని డిసైడ్ అవుతాడు. గబగబా క్రిందకు దిగి, క్రిందన మీనా పడుకున్న గదిలోకి వస్తాడు బాలు.
మగాడిననే పొగరు
గదిలో మీనా కింద పడుకుని ఉంటుంది. మొబైల్ ఫోన్ కోసం వచ్చినట్టుగా, తన చేతిలో ఉన్న ఫోన్ తీసి టేబుల్ పై పెడతాడు బాలు. మీనా కి మెలుకువ రావాలనే ఉద్దేశ్యంతో చిన్నగా దగ్గుతాడు. మీనా కదలకపోవడంతో మరోసారి చిన్నగా తగ్గుతాడు. మీనాకు మెలకువ వచ్చి చూస్తుంది. నిజం చెప్పడానికి వచ్చారా? అని మనసులో అనుకుంటుంది. మీనా కి నిజం తెలిస్తే తట్టుకోలేదు కదా అనుకుంటాడు బాలు. ఒకరినొకరు చూసుకుంటారు కానీ, ఇద్దరూ మాట్లాడుకోరు. అక్కడే ఉన్న నీళ్ల బాటిల్ తీసి నీళ్లు తాగే వంకతో తాగుతాడు బాలు. నీళ్లు తాగిన తర్వాత మళ్లీ పైకి వెళ్ళిపోతాడు. సారీ అయినా చెప్పలేదు, కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదు. మగాడిననే పొగరు ఆడవాళ్లు ఏం చేసినా భరిస్తారనే అలుసు అని మీనా అనుకుంటూ, నాకు మాత్రం ఏం తక్కువ నేను మాట్లాడను అనుకుంటూ పడుకుంటుంది. మళ్ళీ బాలు వస్తాడేమో అని మరొకసారి అటువైపు చూస్తుంది.
కార్లు కోసం వచ్చిన గుణ
బాలు ఎంట్రీ
టాక్సీ స్టాండ్ లో రాజేష్ ఇంకా మిగతా డ్రైవర్లు ఉంటారు. ఈరోజు డబ్బులు కట్టకపోతే గుణ కార్లు తీసుకెళ్లిపోతాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి గుణ వస్తాడు. ఇంకొక రెండు రోజులు టైం ఇమ్మని, మా కడుపుల మీద కొట్టొద్దు అంటూ గుణాని బ్రతిమలాడుతారు డ్రైవర్స్. ఆ బాలు గాడు వల్ల నాకు చాలా అవమానం జరిగింది. వాడే నన్ను బ్రతిమలాడాలి అన్నట్టుగా గుణ వాళ్ళతో అంటాడు. వాళ్లు ఎంత చెబుతున్నా వినకుండా, గుణ కార్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అక్కడికి బాలు వస్తాడు.
గుణాని తన్నబోయిన బాలు
బాలుని చూడగానే వచ్చాడండి హీరో అంటాడు గుణ. బాలును వచ్చి తన కాళ్ళ మీద పడాలంటాడు. అది కూడా ఇష్టం లేనట్టుగా కాకుండా, మనస్పూర్తిగా చేయాలంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అన్నట్టుగా రాజేష్ అంటాడు. బాలు అలా చేయొద్దు అంటూ రాజేష్ బాలుతో అంటాడు. బాలు కాళ్ళకి దండం పెడుతున్నట్టుగా కొంచెం వెనక్కి వెళ్లి, కాలు లేపి గుణాని తన్నబోతాడు. భయంతో గుణ వెనక్కు జరుగుతాడు. నీ కాళ్లకు దండం పెట్టడానికి నువ్వేమైనా దేశభక్తుడు ఏంట్రా? ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చే ఎదవ్వి. నీకు డబ్బులే కదా కావాలి. ఒక్క నిమిషం ఉండు అంటూ డ్రైవర్లని పక్కకు తీసుకుని వెళ్తాడు బాలు.
అందరి అప్పులు తీర్చేసిన బాలు
ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో అడుగుతాడు బాలు. జేబులోంచి డబ్బులు తీసి బాలు ఒక్కొక్కరికి అందిస్తాడు. ఇదంతా రాజేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆ డబ్బులు తీసుకుని వచ్చి గుణాకి ఇవ్వబోతారు డ్రైవర్స్. వీడిని నమ్మలేమని వీడియో తీయమని రాజేష్ కి చెప్తాడు బాలు. వాళ్ళందరూ డబ్బులు ఇస్తుండడంతో, ఆశ్చర్యంగా తీసుకుంటూ ఉంటాడు గుణ. అంతా పూర్తయిన తర్వాత మళ్లీ ఇక్కడ కనపడితే బాగుండదు వెళ్లిపో అని సీరియస్ అవుతాడు. గుణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న బాలుని రాజేష్ ఆపి ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగితే, కారు అమ్మేసానని చెప్తాడు బాలు. మీ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారు కదా, ఇప్పుడు ఎలా అంటాడు రాజేష్. కారు లేకపోయినా నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను. ఏదైనా చేయగలను అంటాడు బాలు.
శివ ని చూడ్డానికి వచ్చిన సత్యం
బాలు తరపున సత్యం క్షమాపణ
శివని చూడ్డానికి సత్యం వస్తాడు. ఆ సమయానికి మీనా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎలా ఉంది శివ? అని అడిగితే ఇప్పుడు బాగానే ఉంది మావయ్య అంటాడు శివ. ఏంటన్నయ్య బాలు ఇంత పని చేసాడు. సొంత కొడుకు లాగా చూసుకుంటాను. శివ ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి కానీ, ఇలా ఎందుకు కొట్టాడని సత్యంని ప్రశ్నిస్తుంది. ఆ మాటకి సత్యంకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలవంచుకుంటాడు. మీనా బాధపడుతుంది. మాటలతో మందలించి ఉంటే సరిపోయేదని, ఇప్పుడు పరీక్షలు కూడా రాయాలని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ బాధపడుతుంది శివ అమ్మ.
ఆయన్ని ఎందుకు ఆడుగుతారు?
ఇంతలో కాఫీ తీసుకొచ్చిన సుమతి కూడా, తమ్ముడు తప్పు చేస్తే మందలించే హక్కు బావ కి ఉంది కానీ, ఇలా కొట్టడం ఏమాత్రం బాలేదు అంటుంది సుమతి. సత్యంకి ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే మీనా మావయ్య గారు శివకి ఎలాగుందో చూడ్డానికి వచ్చారు. ఈ విషయాలన్నీ మావయ్య గారితో ఎందుకు మాట్లాడుతున్నారు? అని మీనా అంటుంది. మాట్లాడనీ అమ్మ నా కొడుకు వల్ల కష్టం వస్తే, నాకు కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటారు అని మీనాతో అంటాడు సత్యం. ఆయన పోయిన దగ్గర నుంచి, పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా పెంచాలని, శివని కూడా అలాగే చూసుకుంటున్నానని వీడు ప్రయోజకుడు అయితే మాకు అదే ఆనందం కదా అని బాధపడుతుంది.
నన్ను క్షమించండి
నావల్ల వీళ్ళ నాన్న లేకుండా పోయడనే బాధ నాకు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు బాలు వల్ల మరోసారి నేను బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అని బాధలతో అంటాడు సత్యం. బాలు ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదని, వాడంతటివాడు ఎవరి జోలికి వెళ్లడని సత్యం అంటాడు. ఆ మాటకి శివ దొంగ చూపులు చూస్తాడు. శివ కూడా ఏ తప్పు చేసి ఉండడని, ఒకవేళ తప్పు చేస్తే బావ మీతో చెప్పేవారు కదా అని సుమతి అంటుంది. సుమతిని మీనా మాట్లాడొద్దు అంటూ ఆపుతుంది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని, నా కొడుకు వల్ల మీ కుటుంబానికి కష్టం వచ్చిందని, అందువల్ల క్షమించమని అడగడానికి వచ్చాను అంటాడు సత్యం. ఆ మాటకి అంత షాక్ అవుతారు.
బాలు మూర్ఖుడు కాదు, మంచోడు
ఎందుకు అన్నయ్య అంతంత మాటలు అంటుంది. ఆయన చేసిన దానికి మామయ్య గారితో ఇవన్నీ మాట్లాడడం అవసరమా? అని మీనా అమ్మ, చెల్లిపై కొంచెం సీరియస్ అవుతుంది. హాస్పిటల్ కి చాలా ఖర్చ అయ్యి ఉంటుందని, శివకి కూడా బలమైన ఆహారం పెట్టాలని చెప్పి కొంత డబ్బు సత్యం చెల్లికి ఇవ్వబోతాడు. ఆ డబ్బులు ఇచ్చి మళ్లీ రుణంలో మమ్మల్ని పడేయకండి, అంటూ డబ్బు తీసుకోదు. అల్లుడు గారికి ఆవేశం ఎక్కువ అని, రేపు మీనాకి కూడా ఏదైనా జరిగితే ఏం చేయాలి అన్నట్టుగా బాధపడుతుంది. బాలు అంత విచక్షణ తెలియని మూర్ఖుడు కాదమ్మా, మీరేమీ బాధపడకండి. ప్రేమ చూపించే వాళ్ల కోసం ప్రాణమైన ఇస్తాడు. మీనా మా ఇంట్లో క్షేమంగా ఉంటుంది నాది హామీ అంటూ సత్యం అంటాడు. శివాకి అలా అయ్యేసరికి అమ్మ నా గురించి బాధపడుతుంది అంటుంది మీనా.
కారణం లేకుండా చేయడు
ఆయన కారణం లేకుండా ఏ పని చేయడని మీనా వాళ్ళ అమ్మతో అంటుంది. సత్యం అక్కడినుండి బయలుదేరుతాడు. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అన్నయ్య అంటుంది. తప్పుగా ఏం మాట్లాడలేదు, అమ్మగా మాట్లాడారు. ఆడపిల్ల తల్లిగా మీ భయాలు మీకు ఉంటాయి. కానీ మీనా గురించి మీకు ఏ దిగులు అక్కరలేదు. తండ్రిగా చెప్తున్నాను అంటూ బయలుదేరుతాడు. ఎవరో చేసిన తప్పుకు ఆయన క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకు ఇలా మాట్లాడారు అంటూ సుమతిని అమ్మను మీనా అడుగుతుంది. మామయ్య వెళ్లి బావని తిడితే, బావ మళ్ళీ అక్కని తిడతాడని సుమతి అంటుంది. నేను మా ఆయనకి సమాధానం చెప్పుకుంటాలే అని మీనా అంటుంది. మా మధ్య ఏం జరిగినా ఆయన నామీద చేయి చేసుకోడు. నువ్వేం బాధపడకు అంటుంది మీనా తల్లితో.

ముగింపు
దీని తర్వాత మనోజ్ హోటల్ లో సీన్ జరుగుతుంది. మనోజ్ కి అప్పిచ్చిన ఒక వ్యక్తి వడ్డీ కోసం హోటల్ కి వస్తాడు. అతన్ని చూసి మనోజ్ దాక్కుంటాడు. మనోజ్ ని కనిపెట్టిన ఆ వ్యక్తి వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అని అడుగుతాడు. త్వరలోనే ఇస్తానని బ్రతిమిలాడుతాడు మనోజ్. మీ హోటల్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ తీసుకుని రా అని ఆర్డర్ వేస్తాడు. అన్ని తీసుకొచ్చిన తర్వాత అతను గబగబా తినడం చూసి, ఈ ఈ బిల్ నా చేత కట్టిస్తాడా ఏంటి అనుకుంటాడు మనోజ్. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం అవుతుంది. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.








