Karthika Deepam Serial Today 10th May

కార్తీక దీపం

ఇది నవ వసంతం

కార్తీక దీపం తెలుగు సీరియల్ స్టార్ మా లో మొదటి సీజన్ మంచి విజయం సాధించడంతో ఇప్పడు “కార్తీకదీపం నవ వసంతం” రెండో సీజన్ నడుస్తోంది. ఇది కూడా మొదటి సీజన్ లాగే విజయవంతమైంది. ఈ సీరియల్ లో కార్తీక్ గా నటిస్తోన్న నిరుపమ్, దీప గా నటిస్తోన్న ప్రేమి విశ్వనాధ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. “కార్తీకదీపం నవ వసంతం” సోమవారం నుండి శనివారం వరకూ రాత్రి 8 గంటలకు స్టార్ మా లో ప్రసారమవుతోంది.

నటీ నటుల వివరాలు

రియల్ నేమ్ సీరియల్ నేమ్
ప్రేమి విశ్వనాధ్దీప
నిరుపమ్ పరిటాలకార్తీక్
చైత్ర (చైల్డ్ ఆర్టిస్ట్ )సౌర్య
రత్నంశ్రీధర్ (కార్తీక్ తండ్రి)
కాంచన (కార్తీక్ తల్లి)కాంచన
సీతసుమిత్ర
గాయత్రి సింహాద్రిజ్యోష్ణ

ఎపిసోడ్ హైలెట్స్

  • కార్తీక్ ని కలసిన దాసు
  • డిఎన్ఏ టెస్ట్ చేసినా నమ్మరన్న కార్తీక్
  • కార్తీక్, దాస్ కలిసి ఓ కొత్త ప్లాన్
  • తప్పు చేసినా జ్యోష్ణ నాకు ఇష్టం అన్న దాస్
  • పోలీసులకు వివరాలు చెప్పిన దీప

కార్తీక్ ని కలసిన దాసు

దీపే అసలైన వారసురాలు

Karthika Deepam Serial Today 10th May ఈరోజు కార్తీకదీపం సీరియల్ ట్విస్టులతో సూపర్ గా సాగిపోయింది. దాస్ కి గతం గుర్తొచ్చిన తర్వాత కార్తీక్ తో మాట్లాడుతాడు. నేను బ్రతికి ఉంటే ప్రమాదం అని, నన్ను చంపాలని చూస్తుంది అంటాడు దాసు. ఎవరు నిన్ను కొట్టారు? అని కార్తీక్ ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను తన కన్న తండ్రిని అని తెలిసే నన్ను చంపాలనుకుందంటే, అసలైన వారసురాల్ని వదిలి పెడుతుందా? ఆరోజు జ్యోష్ణ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు కూడా నేను దీపే అసలైన వారసురాలని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఎవరు వినలేదు. జోష్నా నిశ్చితార్థం రోజు దాసు ఇంటికి వెళ్లి అసలైన వారసురాలు దీప నే అని, చెబుదామనే లోపు, మరల వెంటనే దాసు గతాన్ని మర్చిపోతాడు. ఆ తర్వాత నాకు ఏమైందో గుర్తులేదు.

జ్యోష్ణ వల్ల అందరికీ ప్రమాదమే

దీప పెద్ద మామయ్య కూతురు. జోష్నా నీ కూతురేంటి? అని కార్తీక్ దాస్ తో అంటాడు. అంటే ఇవన్నీ పారిజాతం అమ్మమ్మ కి కూడా తెలుసు కదా? అని కార్తీక్ అంటాడు. లేదల్లుడు ఎవరికి ఏమి ఈ నిజాలు తెలియదని దాస్ మాట్లాడతాడు. దీప గురించి రహస్యం నాకు జోష్నాకి తప్ప ఇంకెవరికీ తెలియదని దాస్ అంటాడు. మా అమ్మతో చెప్పొద్దని జోష్నా నన్ను ఆపింది. ఒకవేళ ఈ మధ్యకాలంలో జోష్న మా అమ్మకి నిజం చెప్పొచ్చు. దీపే అసలైన వారసురాలని తెలిస్తే మా అమ్మకి కూడా నష్టమే.

జోష్నాకి నష్టమే కాబట్టి వాళ్లు దీపని చంపే ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా జోష్నా చేసే కుట్ర అవ్వచ్చు. ఎందుకంటే, మా అమ్మ దాన్ని అలా తయారు చేసింది. తనకి మనుషులన్నా, మనుషులు ప్రాణాలు అన్నా లెక్కలేదు అంటాడు దాస్. నాకు డౌట్ వచ్చింది, దశరథ మామయ్యకి గుండెల్లో బుల్లెట్ తగలడానికి జోష్ణ కారణమై ఉంటుంది. దీప ని చంపాలనుకున్నది కూడా, నా కూతురే అయ్యుంటుంది ఇంత జరిగినాక కూడా మనం మామూలుగా ఉంటే, ఎవరికి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు అని దాస్ కార్తీక్ తో అంటాడు.

నిన్ను, నన్ను పిచ్చివాళ్ళు అనుకుంటారు

ఇంత జరిగిన తర్వాత మనం మామూలుగా ఊరుకుంటే కుదరదు అల్లుడూ, ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెబుదామని దాస్ అంటాడు. ఆగు మావయ్య ఆగు ఇప్పుడు మనం వెళ్లి అందరికీ నిజం చెప్తే వాళ్లు నమ్ముతారనుకుంటున్నావా? అంటాడు కార్తీక్. నామీద ఈమధ్య నమ్మకం పోయింది. నీ మీద అయితే మొదటి నుంచి లేదు. అలాగని నువ్వు చెప్పగానే జోష్ణఊరుకుంటుందనుకుంటున్నావా? పారిజాతం అమ్మమ్మ ఇదంతా కూడా నా స్వార్థం కోసం చేసిందని చెప్తుంది అనుకుంటున్నావా?

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

నమ్మకపోతే నమ్మిస్తానని దాసు అంటాడు. ఏం చెప్పి నమ్మిస్తాం మావయ్య? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏం సాక్ష్యాలు ఉన్నాయని ఆగుతాడు కార్తీక్. ఇంటి వారసురాలు విషయంలో జరిగిన ఇంత పెద్ద విషయాన్ని చెప్తే నమ్ముతారు అనుకుంటున్నావా మామయ్య? నిన్ను అసలు గడప కూడా లోపలికి దాటనివ్వరు. నీవు చెప్పిన విషయాలు ఎవరో కూడా నమ్మరు. నీవు చెప్పిన విషయాలు వింటే, నీకు మతిస్థిమితం లేదని అందరూ అంటారు. నీతో పాటు నాకు కూడా మతిస్థిమితం లేదని అనుకుంటారు.

డిఎన్ఏ టెస్ట్ చేసినా నమ్మరు

దీప ఒక్కరితే ప్రమాదంలో ఉన్నట్టు కాదు. ప్రమాదంలో దశరథ మావయ్య, అత్తయ్య వాళ్లే కాదు నువ్వు కూడా ప్రమాదంలో ఉన్నట్టే కార్తీక్. జ్యోష్ణ పేపర్స్ తెచ్చి దానిపైన సంతకం పెట్టమనగానే పెట్టేసావు. దానిపైన జోష్ణ ఏం రాసి పెట్టుకుంటుందో మనకేం తెలీదు. ఆ షరతులకి నీవు అంగీకరించినట్టే. మనం అందరికి చెబుదాం పద అంటాడు దాసు. కార్తీక్ ఏం మాట్లాడడు. అది చూసి, జోష్నాకి నీవు భయపడుతున్నావా? అంటాడు దాసు. లేదు జాగ్రత్త పడుతున్నాను అంటాడు కార్తీక్.

నిజాల్ని అందరికీ తెలిసేలాగా చేయాలి అంటే, మనము తొందర పడకూడదు. మన ఇంట్లో అందరి మీద కూడా ఎటాక్ జరిగింది. నిన్ను కొట్టింది. ఇంట్లో వాళ్ళందరి మీద జరిగిన ఈ హత్యాప్రయత్నం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని తెలుసుకోవాలి. సాక్షాలతోనూ, ఆధారాలతోనూ మనం అందరి ముందు పెట్టి నమ్మిస్తేనే గానీ నమ్మరు. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అసలు వారసురాలు తెలిసిపోతుంది కదా అని నువ్వు అడగొచ్చు. అసలు దీప ఆ ఇంటి వారసురాలు అనే మాటే వాళ్లకు నచ్చదు. నిజంగానే దీపని ఆ ఇంటి వారసురాలని నిరూపించినా, ఆ టెస్ట్ పేపర్ లో ఎంత పెట్టి కొన్నావ్ రా? అని శివన్నారాయణ మనల్ని అడుగుతాడు. వాళ్ళ దృష్టిలో అది మన పరిస్థితి అని కార్తీక్ దాస్ తో అంటాడు.

తప్పు చేసినా అదంటే నాకు ఇష్టం

ఇన్నాళ్లు వాళ్లు నటించారు. ఇక్కడ నుంచి మనం నటించడం మొదలు పెడదాం. నువ్వు గతం గుర్తురాలేనట్టే ఉండాలి. నేను ఏమీ తెలియలేనట్టే ఉంటాను. వాళ్లు మనుషులు ఎవరెవరు ఉన్నారో కనిపెడదాం. ఇక్కడనుండి ఈ విషయం మనిద్దరి మధ్యే ఉండాలి. ఎప్పుడు చెప్పాలి. ఎక్కడ చెప్పాలి ఎలా బయట పెట్టాలననే విషయాన్ని నేను చెప్తాను. అప్పటివరకూ చాలా కామ్ గా ఉండాలి అంటాడు దాస్ తో కార్తీక్.

సరే అల్లుడు ఏం చేస్తావో చెయ్యి. నా కూతురు జోష్నా చెడ్డదైనా గాని, అదంటే నాకు ఇష్టం. నా భార్య కళ్యాణికి నాకు పుట్టిన మొదటి సంతానం. కానీ అది నేను కోరుకున్నట్టు పెరగలేదు. నిజం తెలిసి ఇన్ని సంవత్సరాలు చెప్పకపోవడం నాది తప్పే. ఆ తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను.. అని బాధపడతాడు దాస్. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించిన వాళ్ళు వేరే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి న్యాయం చేయాలో అలాంటి న్యాయమే చేద్దాం…మావయ్య కాస్త ఓపిక పట్టు. అని దాస్ కి భరోసా ఇస్తాడు కార్తిక్.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Karthika Deepam Serial Today 10th May

అమ్మ, నాన్న ఎక్కడ ?

సౌర్య సతాయింపు

గుడికి వెళ్దామని అడుగుతుంటే, నాన్న రాగానే వెళ్దాము అన్నారు. చిన్నపిల్లనని చూడకుండా వదిలేసి పోయారు. నాన్న ఎక్కడికి వెళ్లారో చెప్పడం లేదు…అని ఇద్దరి నానమ్మలతో సౌర్య అంటుంది. అమ్మకి ఫోన్ చేస్తాను అంటే నానమ్మ వద్దని వారిస్తుంది. మళ్ళీ అమ్మ నాన్న ఎక్కడా అంటూ విసిగిస్తుంది. అమ్మ నాన్న రెస్టారెంట్ పని మీద ఊరు వెళ్లారని అంటుంది వాళ్ళ నాన్నమ్మ. అమ్మ గురించి అడిగేతే నాన్న కూడా ఎప్పుడూ ఇలానే అబద్ధాలు చెప్తాడు. మీరూ కూడా అంతే అంటుంది సౌర్య. మొత్తానికి సౌర్య ని నానా కష్టాలు పది ఊరుకోపెడతారు.

హాస్పిటల్ లో దీపకి పరామర్శ

దీపని ప్రశ్నించిన పోలీస్

కార్తీక్ వచ్చి దీపని ఎలా ఉంది అని అడిగితె ఇప్పడు పర్వాలేదు అంటుంది. పోలీసులు వచ్చారు మాట్లాడతావా అంటే ఒకే అంటుంది. అప్పడు పోలీస్ లోపలికి వచ్చి నిన్ను పొడిచింది ఎవరూ అని అడుగుతాడు. ఒక మగ వ్యక్తి అనీ, ముసుగు వేసుకుని ఉన్నాడని అంటుంది. కొంచెం కూడా మీరు గుర్తుపట్టలేదా? మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా? అని అడుగుతాడు. లేదండి అంటుంది దీప. ఈ మధ్యకాలంలో మీరు ఎవరితో అయినా గొడవ పడ్డారా? అని అడుగుతాడు. జోష్ణ కాకుండా బయట ఇంకా ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన మనిషిని చంపవలసిన అవసరం ఎవరికీ ఉందని ఎస్ఐ మాట్లాడతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

విశ్లేషణ

నా దృష్టిలో ఈ సీరియల్ విజయవంతం అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటంటే, భార్యాభర్తల మధ్యలో మరో వ్యక్తి అది ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని పరాయి వ్యక్తి ప్రవేశిస్తే వాళ్ళ జీవితం కలతలమయం అవుతుంది. ఇదే పాయింట్ బేస్ చేసుకుని ఎన్నో చలనచిత్రాలు కూడా విజయవంతం అయ్యాయి. ఏ సీరియల్ కైనా ఒక ప్రేరణ అందించేది సినిమానే. ఒకప్పుడు సినిమా విజయానికి మహిళలు ప్రధాన పాత్ర పోషించేవారు. ఆడవాళ్లు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం తగ్గిన తర్వాత సీరియల్స్ కి క్రేజ్ పెరిగింది. మహిళలని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకులు సీరియల్స్ ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే కోవలో కుటుంభ ప్రేక్షకుల ఆదరణ పొందిన “కార్తీకదీపం నవవసంతం” తెలుగు సీరియల్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మా వెబ్సైటు ఫాలో అవ్వండి.

Leave a Comment