గుండెనిండా గుడిగంటలు సీరియల్ 09/05/2025

రసపట్టులో సీరియల్

ఇరకాటంలో పడ్డ బాలు

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 09/05/2025 ముక్కు సూటిగా, మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ, నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో మనిషికి అన్నీ కష్టాలు ఇబ్బందులే. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో హీరో బాలు క్యారెక్టర్ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఉన్నదున్నట్లుగా మొహం మీదే మాట్లాడేయడం ఈ క్యారెక్టర్ యొక్క ప్రత్యేకత. దానివల్ల తన మనసులోని బరువు తీరిపోయినా, ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు మొదలవుతాయి. మనలో చాలామంది ఇలానే ఉంటారు. అందరూ ఐడెంటిఫై అయ్యే క్యారెక్టర్స్ తో ఈ సీరియల్ సూపర్ సక్సెస్ అయ్యింది. నిజాయితీగా నిజాలు మాట్లాడే బాలు, ఒక నిజాన్ని తన మనసులోనే దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కక్కాలో మింగాలో తెలియని పరిస్థితి అంటారు కదా అలా అన్నమాట.

ఎపిసోడ్ హైలెట్స్

  • మీనాకి మామగారు ఓదార్పు, అత్తగారు ఎత్తిపొడుపు
  • గుణ దగ్గర శివ పని చేస్తున్నాడని తెలిసి రోహిణి కంగారు
  • బాలు ని నిలదీసిన సత్యం. అత్తగారికి క్షమాపణలు చెప్పు
  • నేను తప్పు చేయలేదు..నేను చెప్పను అన్న బాలు
  • మాతో ఆటలు ఆడకండి, మమ్మల్ని వదిలేయండి బాలుపై మీనా ఫైర్

ప్రారంభం

బాలు, రాజేష్

దొంగతనం చేసేసిన శివ గాడు తప్పంతా నీ మీద తోచేసి, బానే తప్పించుకుంటున్నాడు. నిజాన్ని దాచి పెట్టి నువ్వెందుకురా మీనా దృష్టిలో చెడ్డవాడు అవుతున్నావు అంటూ రాజేష్ బాలు తో బాధపడుతూ ఉంటాడు. శివ గాడు దొంగతనం చేశాడనే విషయం బయటపడితే మా అమ్మ మీనాను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. వాడి కుటుంబం కూడా మనశ్శాంతిగా ఉండదు. బాధపెట్టే నిజం చెప్పడం కన్నా, కోపం తెప్పించే అబద్ధం చెప్పడం మంచిది.. అంటూ రాజేష్ కి సర్ది చెప్తాడు బాలు.

మీనా బాధ, ఏడుపు

ఒక్కొకరూ ఒకోలా ఓదార్పు

ఇంట్లో హాల్లో కుటుంబ సభ్యులందరి మధ్య కూర్చుని మీనా ఏడుస్తూ ఉంటుంది. రోహిణి, శృతి మీనాని ఓదారుస్తూ ఉంటారు. ఈ గోల ఏంట్రా బాబు అన్నట్టుగా మనోజ్ చూస్తూ ఉంటాడు. శివ ఎగ్జామ్స్ రాయకుండా ఇలా జరిగిందని మీనా ఏడుస్తూ ఉండడంతో, ఎగ్జామ్స్ ఎవరితోనైనా రాయించవచ్చని, కానీ బాలు విషయంలోనే బాధగా ఉంది. ఇలా చేయడం ఏంటి అంటుంది శృతి. ఇప్పటివరకు మాటలే అంటున్నాడు. ఇలా కాళ్లు చేతులు కూడా విరుస్తున్నాడు అని రోహిణి అంటుంది. వాడికి కొత్త ఏముంది నా రెండు వేళ్ళు విరవలేదా ఏంటి? అంటూ ఆ మాటకి మనోజ్ అంటాడు.

కంగారు పడ్డ రోహిణి

బాలు, శివాని ఎందుకు ఇలా చేశాడో కారణం ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అంటాడు సత్యం. నా తమ్ముడు గుణ దగ్గర పనిచేస్తున్నాడని, వడ్డీ అడగడం కోసం వెళితే, గుణాని కొట్టారని, కొడుతున్నప్పుడు శివ అడ్డం వెళ్ళినందుకే బాలు శివా చేయి విరిచాడని మీనా ఏడుస్తూ మామ గారితో అంటుంది. ఆ మాటకి మనోజ్, రవి ఆశ్చర్యంగా చూస్తారు. ఆ మాట విన్న రోహిణి మరింత కంగారుపడుతుంది. శివ.. గుణా దగ్గర పనిచేస్తున్నాడు అంటే, నేను అక్కడ రెండు లక్షలు అప్పు తీసుకున్న సంగతి కూడా శివాకు తెలిసే ఉంటుంది. నా నెత్తి మీద ఇంకొక బాంబు వేయడానికి రెడీ అయ్యావా దేవుడా అంటూ మనసులోనే దేవున్ని తలుచుకుంటుంది రోహిణి.

బాలుని నిలదీసిన సత్యం

అదంతా నిజం కాదు, ఆ శివ బావ మీద తిరగబడే రకం కాదు. ఏదో తప్పు జరిగి ఉంటుంది అంటుంది ప్రభావతి. మీనా బాధలో ఉంటే నువ్వేంటి అలా అంటున్నావ్? అని ప్రభావతి పై సీరియస్ అవుతాడు సత్యం. మనోజ్ మిమ్మల్ని ఏదో అన్నందుకే రెండు వేల్లు విరిచాడు. వాడు కూడా అలాంటి తప్పేదో చేసి ఉంటాడు అంటుంది ప్రభావతి. ఇంతలో బాలు వస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. బాలు లోపలికి వెళ్ళిపోబోతుంటే తండ్రి ఆపుతాడు. ఇక్కడ అందరూ నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఏమీ పట్టినట్టుగా లోపలికి వెళ్ళిపోతావు? అంటూ అడుగుతాడు.

వాడు చేసే పనులు బాలేదు

శివాని ఎందుకు కొట్టావు? వాడి చెయ్యి ఎందుకు విరిచావు అంటూ సత్యం బాలు అని అడుగుతాడు. బాలు మీనా వైపు చూస్తాడు. బాలు వైపు ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. వాళ్ళక్క ఏమీ చెప్పలేదా? అంటాడు బాలు. అది మాత్రమే కారణం కాదని మా అందరికీ అర్థమవుతుంది. దిక్కులు చూడకుండా జవాబు చెప్పు అంటాడు.. సత్యం. కాలేజీకి వెళ్లకుండా చెడు సహవాసాలు చేస్తున్నాడు అందుకే అంటాడు బాలు. అలాంటప్పుడు ఆ ఇంటి పెద్దగా ఆ విషయం నువ్వు మీనాకి గానీ, వాళ్ళ అమ్మకి గానీ చెప్పాలి. అంతేగాని ఇలా చేయి విరిచేయడమేంటి అంటాడు సత్యం. శివకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయట ఎంత రేష్ గా ఎందుకు బిహేవ్ చేసావ్ అన్నయ్య అంటూ రవి కూడా ఓ మాట అంటాడు.

పెద్ద కథే ఉంది

తప్పు ఒప్పులు, మనవాళ్లు పరాయివాళ్లు అనే ఆలోచన మీ అన్నయ్యకి ఉంటుందా? సొంత అన్నయ్య వేళ్ళు విరిచిన వాడికి బావమరిది చేయి విరిచేయడంలో ఆశ్చర్యమేముంది? అంటుంది శృతి. బాలు అంత గట్టిగా శివుని కొట్టి, చేయి విరిచేసాడంటే దీని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుంది. అదేంటో బయటపడాలి అంటుంది ప్రభ. ఎవరికి ఏం చెప్పాలో, శివ డబ్బులు కొట్టేసాడు అని చెప్తే అది ఎంత దూరం వెళుతుందో, మీనా నన్ను ఎలా అపార్థం చేసుకుంటుందో? అని మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

నేను అలంటి వాడ్ని అయితే మీరు ఉండరు

ఏంట్రా నీ రౌడీయిజం అందరి మీద చూపిస్తావా? అంటూ మనోజ్ అనగానే, నేను రౌడీనే రా, మీరంతా డీసెంట్ మనుషులా అని అనగానే, నీకు చదువు లేదు కాబట్టి మా అందరి మీద కడుపు మంట నీకు అంటాడు మనోజ్. నువ్వు నోరు ముయ్యి లేదంటే అని బాలు అనగానే, మనోజ్ చేయి కూడా విరి చేస్తావా? అంటూ రోహిణి తగులుకుంటుంది. మీనా కాబట్టి ఊరుకుంది. అదే ఇంకొకరు అయితే పోలీస్ కేసు పెట్టేవారు. ఇది క్రిమినల్ కేస్ తెలుసా? అంటుంది శృతి. నేను క్రిమినల్ అయితే మీరు ఎవరూ కూడా ఈ ఇంట్లో ఉండరు అంటూ బాలు వార్నింగ్ ఇస్తాడు. నా సొంత విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అంటూ సీరియస్ అవుతాడు.

పేదవాళ్ళకి కోపం రాకూడదు

వాడు చేసిన పని మీకు తెలుసా? నువ్వు చూసావా? అంటూ చెప్పబోతాడు బాలు. చెప్పండి అన్నట్టుగా మీనా చూస్తుంది. పెద్ద తప్పు ఏం చేశాడో అది బయటపెట్టు ముందు అని ప్రభావతి అనగానే, వదిలేయండి, చెడు తిరుగుళ్ళు తిరగడం నాకు నచ్చడం లేదు, అందుకే కోపం లో గట్టిగా కొట్టాను అంటాడు బాలు. మేము నమ్మలేము రా అని సత్యం అంటే, వదిలేయండి మామయ్య అంటూ మీనా వస్తుంది. ఆయన్ని ఎవరు ఏమీ అడగకూడదు. ఎందుకంటే మేము పేదవాళ్ళం. పేదవాళ్ళకి కోపం రాకూడదు. కొట్టినా, తిట్టినా చేతులు కాళ్లు విరిచేసినా అదేంటని అడగకూడదు. కనీసం పెద్దవాళ్లతో కూడా చెప్పుకోకూడదు. ఏం చేసినా పడి ఉండాలి అంటుంది మీనా బాధతో.

కొడుకుకంటే బాగా చూసుకున్నారు

నువ్వు బాధపడకు మీనా నేను కనుక్కుంటా కదా అంటూ సత్యం అనగానే, ఏముంది అక్కడ ఈయన ఫ్రెండ్ కోసం నా తమ్ముడి చేయి విరిచేసాడు అంటుంది మీనా. ఎవరూ లేని అనాధల్లాగా మారిపోయాం. మాకేమన్నా బాధ కలిగినా కూడా బయటకు చెప్పకూడదు. ఈ వేళ వాడికి అయింది. రేపు మా ఫ్యామిలీలో ఎవరికైనా జరగవచ్చు. మా బ్రతుకులు ఇంతే.. అంటూ మీనా బాధపడుతుంది. చూసావా ఎంత బాధ పడుతుందో? అంటూ నువ్వు ఎందుకు మూర్ఖంగా తయారయ్యావు? వాళ్ళింట్లో నిన్ను అల్లుడుగా కంటే కొడుగ్గా చూస్తారని నువ్వే కదా చెప్పావు అని అంటాడు సత్యం.

నేనే వాడి చెయ్యి విరిచేస్తాను

నా తమ్మడు ఎంతో మారిపోయాడని, జాబు చేస్తున్నాడని, జాబు చేస్తున్నానని వెళ్లి పార్కుల్లో పడుకోవడం లేదు అంటుంది మనోజ్ ను ఉద్దేశించి మీనా. అటు తిప్పి ఇటు తిప్పి మనోజ్ వైపు తీసుకొస్తావేంటి? అంటుంది ఆ మాటకి రోహిణి. మీ ఆయన కూడా అటు తిప్పి ఇటు తిప్పి నా తమ్ముడు ఎప్పుడో చేసిన బైక్ దొంగతనం గురించి ఇప్పుడు చెప్పడం లేదా అంటుంది మీనా. నిజంగా అంత పెద్ద తప్పే వాడు చేసుంటే, నేనే వాడి చెయ్యి విరిచేస్తాను, నేనే వాడిని ఇంట్లోంచి బయటకు గెంటుతాను..అని మీనా వాళ్ళతో అంటుంది.

లేనిపోనివి కల్పించవద్దు

జరిగిన దానికి, నువ్వు చెప్పిన దానికి అసలు ఏమీ సంబంధం లేదు. నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు అంటుంది ప్రభ. నువ్వు వాడికి డబ్బులు ఇస్తే, దాని గురించి ఏమైనా గొడవ అయిందా? నువ్వు సంపాదించింది అంతా అక్కడే ఇస్తున్నావా ఏంటి? అంటూ ప్రభావతి అంటుంది. లేని ఇంకో కొత్త గొడవ అని సృష్టించొద్దు అత్తయ్య అంటుంది మీనా. మేము ఎవరి డబ్బులు ఆశించడం లేదు. గుట్టుగా బ్రతుకుతున్నాం.. అంటుంది మీనా. ఎవరు ఎంతగా మాట్లాడినా, ఎవరు ఎన్ని మాటలు అంటున్నా బాలు మౌనంగా ఉండిపోతాడు.

మీ ఆయన మీద చూపించు

తప్పంతా మీ ఇంట్లో పెట్టుకుని, నా కొడుకు గురించి మాట్లాడతావ్ ఏంటి? అంటూ ప్రభావతి మీనాపై సీరియస్ అవుతుంది. అందరూ నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతుంటే వింటూ ఊరుకోవాలా? అంటుంది మీనా. నీ ప్రతాపం ఇక్కడ కాదు, మీ ఆయన దగ్గర తేల్చుకో. నిజం చెప్పమని మీ ఆయనని అడుగు అంటుంది ప్రభావతి. ఇవన్నీ అనవసరం రా ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అంటాడు సత్యం. శివ తప్పే చేసి ఉండొచ్చు. నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తావ్. వెళ్ళు మీ అత్తగారికి క్షమాపణ చెప్పు అంటాడు సత్యం. ఏంటి అని ప్రభ అనగానే, నువ్వు ఆగు ప్రభ అంటూ సీరియస్ అవుతాడు.

నాన్న నేను ఏం తప్పు చేయలేదు. కొన్ని నెలల నుంచి చేయని తప్పులన్నీ నామీద పడుతున్నాయి అంటాడు బాలు.ఎప్పుడు ఎవరు తప్పు చేసినా చివరికి నా మీదకే తోస్తున్నారు. నా మీద నిందలు వేస్తున్నారు. నేనెవరికీ క్షమాపణ చెప్పదలుచుకోలేదు. తప్పుగా అనుకోకండి. ఇది పొగరు కాదు అంటూ పైకి వెళ్ళిపోతాడు బాలు. ఏడుస్తూ చూస్తూ ఉండిపోతుంది మీనా. ఏంట్రా బాబు ఈ గోల అన్నట్టు చూస్తాడు మనోజ్. ఇన్నాళ్లు మీనా కొంగుకు కట్టుకుని ఆడిస్తుంది అనుకున్నాను. అయితే బాలు గాడు ఏమీ మారలేదు అన్నమాట. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్లిద్దరిని ఇంట్లోంచి బయటికి పంపించే ప్లాన్ వేద్దాం.. అనుకుంటుంది ప్రభావతి.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 09/05/2025

బాలు పై మీనా ఫైర్

నన్ను వదిలేయండి

వంటగదిలో మీనా చపాతీలు చేస్తూ ఉంటుంది. నీకేం పని పాట లేదా? అని బాలు అనగానే, నాకు ఏం పని పాట లేదు. ఇంట్లో మందిని కొట్టేది, బయట మందు కొట్టేది మీరే కదా అంటుంది. నాతో ఏదన్నా సమస్య వస్తే నాతో చెప్పాలి కానీ ఇంట్లో చెప్పడం ఏంటి? అంటాడు బాలు. సమస్య మీతోనే వస్తే ఏం చేయమంటారు. జరిగిందేంటో తెలుసుకోవాలి అంటాడు. తెలుసుకున్నాను.. ఇంకేం తెలుసుకోవాలి మా అమ్మకి ఈ విషయం తెలిసి ఎంత బాధ పడుతుందో తెలుసా? అంటుంది మీనా. అందుకని మా నాన్నకి చెప్తావా అని బాలు అడగ్గానే, మా నాన్న లేరు కదా అంటుంది మీనా. ఏదైనా చెప్పుకోవాలంటే తండ్రి తర్వాత తండ్రి మామయ్య గారికి చెప్పుకోవాలి కదా అంటుంది మీనా.

నన్ను శాడిస్ట్ చేస్తున్నావ్

అసలు ఇవన్నీ వాళ్లందరికీ ఎందుకు చెప్పాలి? ఇవన్నీ నాతో చెప్పొచ్చు కదా? వాళ్ళందరూ నా మీద పడేటట్టు చేయాలా? అనగానే ఏం చేయమంటారు నా తమ్ముడు పరిస్థితి తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నా గుండె మండిపోతుంది. మనసు రగిలిపోతుంది.. అందుకే బయట పెట్టాను వదిలేయండి అంటుంది మీనా. ఇంట్లో బాధని చెప్పుకునే హక్కు కూడా నాకు లేదా? అంటూ తన పనిలో సీరియస్ గా నిమగ్నం అయిపోతుంది. కంగారులో వేడిగా ఉన్న గిన్ని పొయ్యి మీద నుంచి దించుతుంది. చెయ్యి కాలిపోయి అయ్యో అనడంతో, బాలు దగ్గరికి వెళ్తాడు. గాయం చేసే వాళ్లకు తగ్గించే హక్కు లేదు..అంటూ చెయ్యి దూరంగా తీసేస్తుంది. వాడి చెయ్యి విరిగింది. ఇప్పుడు నా చేయి చూస్తే గానీ మీకు మనశ్శాంతి లేదా? అంటుంది. మొత్తానికి నన్నుశాడిస్ట్ చేస్తున్నావ్ అంటాడు బాలు.

మీరు ఆడిస్తున్నారు కదా?

మీరు నన్ను, నా పుట్టింటిని బొమ్మలు చేసి ఆడించడం లేదా అంటుంది. ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటారో మీకే తెలియదు. అని మీనా అనగానే నిజంగానే నాకు తెలియదు. నిజంగానే తెలిసి ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని. అందరితో మంచివాన్ని అనిపించుకోవాలంటే నటించాలి. అలాంటి నటన నాకు రాదు. తప్పుని తప్పుగా ఎత్తిచూపే ధైర్యమే నాకుంది. మా అమ్మ నిన్నుఎన్ని మాటలు అన్నా రోజూ గొడవ పడుతూనే ఉంటాను. చూసి చూడనట్టు ఉండాలేమో? అంటాడు బాలు. నీకు తెలియదు మీనా అంటూ చెప్పబోతాడు. మీరు నిజాలు మాట్లాడితేనే ఎవరూ భరించలేరు. అబద్ధాలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు. మీకు కారణం అక్కర్లేదు అంటూ ఏడుస్తుంది. ఇకనుండి మీ అమ్మగారు నామీద గొడవ పడినప్పుడు నన్ను వెనకేసుకు రాకండి. నా చావు నన్ను చావనివ్వండి. మా బ్రతుకుల జోలికి రాకండి ఇక వెళ్ళండి. అంటూ సీరియస్ అవుతుంది. బాలు మౌనంగా వెళ్ళిపోతాడు.

ముగింపు

మీనా మాటల్ని గుర్తు చేసుకుంటూ బాలు డాబా పైన పడుకుంటాడు. ఇవన్నీ చూస్తుంటే మేము నిజంగానే విడిపోతామేమో, వెళ్లి నిజం చెప్పస్తే పోలా? అంటూ కిందకి వస్తాడు. పడుకున్న మీనా దగ్గరికి వెళ్లి సౌండ్ చేస్తాడు. మీనా లేచి నిజం చెప్పడానికి వచ్చారా? అనుకుంటుంది మనసులో. నిజం చెప్తే మీనా తట్టుకుంటుందా అనుకుంటాడు బాలు. ఏదైనా నోరు విప్పి చెప్పొచ్చు కదా? నేను పరాయిదాన్ని అయిపోయినా? అనుకుంటుంది మీనా. ఈరోజుతో ఈ ఎపిసోడ్ మంచి ట్విస్ట్ తో ముగిసింది. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ మా చానల్లో ప్రసారం అవుతుంది.

సీరియల్ లోకేషన్

ఈ సీరియల్ షూటింగ్ లోకేషన్ కి ఒకసారి నేను వెళ్లడం జరిగింది. హైదరాబాదులోని ఒక కాలనీలో ఇంటిని అద్దెకి తీసుకుని షూటింగ్ జరుపుతున్నారు. ఇది సాధారణంగా సినిమాలకు వాడే సెట్ లా కాకుండా మనం నివసించే ఒక మామూలు ఇల్లు లాగే ఉంటుంది. ఎ. మనోజ్ కుమార్ అనే బోర్డు ఇంటి బయట వేలాడదీసి ఉంటుంది. ఈ హౌస్ లో గదులను షూటింగ్ సీన్స్ కి తగ్గట్టుగా మార్చుకుంటూ సీరియల్ యూనిట్ ఎంతో అందంగా ఈ సీరియల్ ని తెరమీదకు తీసుకొస్తుంది. షూటింగ్ లో నటీనటులందరూ ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ పాల్గొంటూ ఉంటారు. వాళ్ల మధ్య ఉండే ఆ ఫ్రెండ్లీ వాతావరణానికి తగ్గట్టుగానే, సీరియల్ కూడా సరదాగా కుటుంభ భావోద్వేగాలతో చూసే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే రెగ్యులర్ టీవీ సీరియల్స్ అప్డేట్స్ కోసం మన సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Leave a Comment