‘పెద్ది’గా రామ్ చరణ్ అరాచకం|Peddi First Shot Glimpse

అంచనాలు పెంచేసిన బుచ్చిబాబు

మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

‘పెద్ది’గా రామ్ చరణ్ అరాచకం|Peddi First Shot Glimpse : ఉప్పెన తీసిన కుర్ర డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమానా? అది కూడా ఆర్ ఆర్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత వర్కౌట్ అవుతుందా? ఇది రామ్ చరణ్, బుచ్చిబాబు సన సినిమా ప్రకటించినప్పుడు విని పించిన మాటలు. ఆ అనుమానాలన్నిటిని ఒకే ఒక్క చిన్న వీడియో గ్లిమ్ప్స్ తో పటాపంచలు చేసేసాడు పెద్ది. అభిమానులెవ్వరూ ఈ రేంజ్ మాస్ ఊహించలేదు. ఇక మిగతా సినీ అభిమానుల కైతే ఎలాంటి అంచనాలు లేవు. అందర్నీ ఒకే ఒక్క షాట్ తో మతిపోయేలా చేసింది రామ్ చరణ్, బుచ్చిబాబు ల ఫస్ట్ కాంబినేషన్.

ఇది కదా మెగా మాస్ రాంపేజ్ అంటున్నారు మెగా అభిమానులు. ఈరోజు రిలీజ్ అయిన పెద్ది సినిమా ఫస్ట్ షార్ట్ గింబిల్స్ చూసి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా లాస్ట్ మంత్ 27 న రిలీజ్ చేస్తారకున్న పెద్ద మూవీ ఫస్ట్ ఫిలిమ్స్ శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. ఉదయం 11: 45 నిమిషాలకు యూట్యూబ్ లో రిలీజ్ అయిన రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ కి, పెద్దిగా రామ్ చరణ్ సృష్టిస్తున్న అరాచకానికి యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవుతున్నాయి. మస్ట్ అవైటెడ్ మూవీ గా అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇటు మెగా ఫ్యాన్స్ లోను పెద్ది పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు విడుదలైన గ్లిమ్ప్స్ రామ్ చరణ్ లుక్ డైలాగ్స్ పై ఓవరాల్ గా ఓ లుక్కేద్దాం..

థియేటర్స్ లో మాస్ జాతరే

రికార్డుల మోత మోగాల్సిందే

ఒక్క నిమిషం ఐదు సెకండ్ల నిడివి ఉన్నపెద్ది ఫస్ట్ షార్ట్ గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసింది అని చెప్పాలి. ఊర మాస్ లుక్ లో, ఉత్తరాంధ్ర యాసలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇటు మెగా అభిమానులకు, సినీ లవర్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. హీరో క్యారెక్టర్జేషన్ ఎలా ఉండబోతుందో ఒక పర్ఫెక్ట్ డైలాగ్ తో రివీల్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ”ఒకటే పని చేసే నాకి.. ఒకేనాగ బతికే నాకి.. ఇంత పెద్ద బతుకేందుకు? ఏదైనా, ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయ్యాలా.. పుడతామా ఏంటి మళ్లీ? సెప్మి.. అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ తో గ్లిమ్ప్స్ టేక్ ఆఫ్ అందుకుంది.

నోట్లో పొగలు కక్కుతున్న బీడీ, చిందరవందరగా మాసిపోయినట్టు ఉన్న లాంగ్ హెయిర్, మాసిన గడ్డం, ముక్కులో నట్టికాడ, మాసినట్టు నలిగిపోయిన 1980 కాలం నాటి బట్టలు. ఒక ప్యాంట్ కాలుకి చిన్న మడత, సాదాసీదా చెప్పులతో క్రికెట్ గ్రౌండ్ లోకి పొగరుగా పెద్ది ఎంట్రీ. ఇది ఓవరాల్ గా రామ్ చరణ్ లుక్. ఇంత ఊరమాస్ లుక్ లో చరణ్ ని ఇప్పటివరకూ ఎప్పడూ చూడలేదు. అందుకే పెద్ది గ్లిమ్ప్స్ ఫస్ట్ షాట్ చూసిన మెగా అభిమానులకు పూనకాలు ఒకటే తక్కువ.

Pawan Kalyan Badri Completed 25 Years
Pawan Kalyan Badri Completed 25 Years

సుకుమార్ రంగస్థలం.. జస్ట్ టీజర్

శిష్యుడు అంతకు మించి

ఈ గ్లిమ్ప్స్ చూస్తుంటే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రియలస్టిక్ రగ్గడ్ మాస్ ఎంటర్టైనర్ గా పెద్ది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రంగస్థలం చరణ్ కి ఒక రేంజ్ లో మాస్ ఇమేజ్ క్రియేట్ చేసింది. రంగస్థలం కి మించి “పెద్ది” సినిమా ఉండబోతోంది అనే సంకేతాలు ఇచ్చేసాడు డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఏక్షన్ సీన్స్ పరంగా మరో రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోంది. ధాన్యం బస్తా ని చరణ్ చించి, ఆ ముక్కతో వేగంగా పరిగెడుతూ, ట్రాక్టర్ మీద నుంచి జంప్ చేసే షాట్ అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

ఊరమాస్ trending షాట్

మొత్తం గ్లిమ్ప్స్ లో ప్రతి షాట్ దేనికదే ప్రత్యేకంగా ఉన్నా, లాస్ట్ లో క్రికెట్ బాట్ తో బాల్ ని లాగిపెట్టి సిక్స్ కొట్టిన విధానం మాత్రం గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంది. క్రికెట్ గురించి అందరికీ తెలుసుకాబట్టి ఎదో ఒక మ్యాజిక్ ఈ సినిమాలో ఉండాలనే క్రియేటివ్ థాట్ తో డైరెక్టర్ బుచ్చిబాబు బాట్ హేండిల్ ని నేలకేసి కొట్టి మరీ సిక్సర్ కొట్టించాడు. ఇక చరణ్ ఫోర్సు అయితే “నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్” అనే విధంగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద ట్రెండ్ క్రియేట్ చేస్తుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది క్రికెటర్స్ దీనిని ఫాలో అయ్యే అవకాశాలున్నాయి.

'పెద్ది'గా రామ్ చరణ్ అరాచకం|Peddi First Shot Glimpse

రెహమాన్ ఈస్ బ్యాక్

ఇక పెద్ది సినిమాకి మ్యూజిక్ మాంత్రికుడు ఏ ఆర్ రెహ్మాన్ ని డైరెక్టర్ బుచ్చిబాబు ఏరికోరి ఈ సినిమాకి ఎందుకు పెట్టుకున్నాడో ఈ గ్లిమ్ప్స్ ప్రూవ్ చేసాయి. సినిమా థీం కి, బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు ఏ ఆర్ రెహ్మాన్ ఇచ్చిన బీజియం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. చాన్నాళ్ళుగా ఫాం లో లేని రెహ్మాన్ మీద అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ, తన మార్క్ చూపిస్తూ రెహ్మాన్ పెద్దికి అతి పెద్ద బలంగా మారనున్నాడు. ఇక సాంగ్స్ ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఇది 80 బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి రెహ్మాన్ ఖచ్చితంగా ఆ టైం లైన్ కి సెట్ అయ్యేలా, ఇప్పటి ట్రెండ్ కి ఎక్కేలా అయన ట్యూన్స్ ఉంటాయని అభిమానుల అంచనా.

చిట్టిబాబు, పెద్ది ఇద్దరకీ తేడా?

చిట్టిబాబు ని మించిన మాస్ కథానాయకుడిగా పెద్ది ని పరిచయం చేసాడు డైరెక్టర్. రామ్ చరణ్ మాస్ లుక్ అనగానే, ఎవరికైనా రంగస్థలం సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాకి తన గురువు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన డైరెక్టర్ బుచ్చిబాబుకి రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ పై మంచి కమాండ్ ఉందని అర్ధమవుతోంది. ఎప్పటినుంచో తనలో ఉన్న కసి ని పెద్ది ద్వారా సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడు. రత్నవేలు కెమెరామెన్ కాబట్టి, ఎంతోకాలంగా సుకుమార్ శిష్యరికం వల్ల టేకింగ్ పరంగా పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ లో సుకుమార్ ఛాయలు కనిపించాయి. అయితే గురువుని మించిన శిష్యుడిగా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకునే అవకాశం బుచ్చిబాబు సన కి వచ్చింది.

పెద్ది పెద్ద సంచలనం

పెద్ది మూవీ ఫస్ట్ షాట్ గ్లిమ్ప్స్ సోషల్ మీడియాను అల్లాడిస్తుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. తెలుగు తో పాటు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లిమ్ప్స్ రియాక్షన్ వీడియోస్ నిమిషాల్లోనే యూట్యూబ్ లో దర్శనమిచ్చాయి. అన్ని భాషల సినిమా అభిమానులు ఈ వీడియోస్ ని వెంటనే అప్లోడ్ చేయడం విశేషం. ఇది జాతీయ స్థాయిలో చరణ్ కి ఉన్న క్రేజ్ కి అడ్డం పడుతోంది.

టీజర్ హైలెట్స్

  • రామ్ చరణ్ మేకోవర్
  • శ్రీకాకుళం యాసలో చరణ్ డైలాగ్స్
  • రెహమాన్ బీజియం
  • చరణ్ కారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పిన డైలాగ్
  • లాస్ట్ లో సిక్స్ కొట్టిన స్టైల్
  • ప్రతీ ఫ్రేం లోనూ కనిపించిన డైరెక్టర్ బుచ్చిబాబు కసి

రంగస్థలం సెంటిమెంట్

రిపీట్ ఖాయం

ఫస్ట్ షాట్ గ్లిమ్ప్స్ తోనే అంచనాలను ఆకాశానికి పెంచేసిన పెద్ది టీం ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చ్ 27 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రంగస్థలం కూడా అప్పట్లో మార్చ్ ఎండ్ లో రిలీజ్ అయ్యి చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఒక సంవత్సరం ముందుగానే డేట్ లాక్ చేసారు కాబట్టి మరే ఇతర భాషలోనూ ఆ డేట్ కి వేరే సినిమా వచ్చే అవకాశం లేదు. అదే జరిగితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ థియేటర్స్ లో సృష్టించే కలెక్షన్స్ విధ్వంసానికి రికార్డ్స్ పగిలిపోవడం ఖాయం. గేమ్ చేంజర్ ఫలితం తర్వాత, ఆకలిగా ఉన్న మెగా అభిమానులకు పెద్దిగా రామ్ చరణ్ మంచి నాటుకోడి బిర్యానీ ని సిద్ధం చేస్తునట్టు ఈ గ్లిమ్ప్స్ చెప్పకనే చెప్పింది.

Leave a Comment