కుటుంభ కథ
ఇది అందరి కథ
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 14/05/2025 ఏదైనా సీరియల్ విజయవంతం అవ్వాలంటే కథలో మలుపులనేవి చాలా ఇంపార్టెంట్. రోజుకు ఒక మలుపుతో, పాత్రల మధ్య సంఘర్షణతో సీరియల్ ని ఎండ్ చేస్తే తర్వాత ఎపిసోడ్ పై ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. ఆ విధంగా సీరియల్ ని నడిపించడంలో గుండె నిండా గుడి గంటలు టీం విజయవంతం అయ్యింది. ప్రతి ఎపిసోడ్ లోనూ చక్కటి ట్విస్ట్ తో ఈ సీరియల్ ని ముగిస్తున్నారు. ఈ సీరియల్ లో విష్ణుకాంత్, అమూల్య గౌడ జంటగా నటిస్తున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారమవుతోంది. ఉమ్మడి కుటుంబ కథగా అందర్నీ అలరిస్తున్న ఈ సీరియల్ ఈరోజు (14/05/2025) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు హైలెట్స్
- మనోజ్ షర్టు సాంబార్ వాసన కనిపెట్టిన రోహిణి
- కార్ అమ్మేసి ఆటో డ్రైవర్ గా మారిన బాలు
- ఈ విషయం మీనాకి చెప్పొద్దని రాజేష్ ని రిక్వెస్ట్ చేసిన బాలు
- హోటల్ లో కస్టమర్ తో మనోజ్ గొడవ
- మనోజ్ ని ఉద్యోగం లోంచి తీసేసిన ఓనర్
- మరోసారి శివపై చేయి చేసుకున్న బాలు
బాలు అందర్నీ కొడతాడు
మీరు డబ్బులు పంచండి
శివని పరామర్శించి ఇంటికి వస్తాడు సత్యం. ఇంటి బయట కూర్చుని ఉంటాడు. వచ్చిన దగ్గరనుంచి ఏమీ మాట్లాడటం లేదు ఏంటి? అని ప్రభావతి అడుగుతుంది. ఆ బాలుగాడు ఊర్లో అందర్నీ కొట్టడం, మీరు కొట్టిన వాళ్లందరికీ డబ్బులు పంచిపెట్టడం. డబ్బులు తీసుకున్నారా వాళ్ళు? ఇంకా కావాలని అడిగారా? అంటూ మీనా తల్లి గురించి మాట్లాడుతుంది ప్రభావతి. వాళ్ల డబ్బులు తీసుకోలేదని, వద్దన్నారని సత్యం చెప్పడంతో అబ్బో అన్నట్టు చూస్తుంది ప్రభ. కూతురు బాగా సంపాదిస్తుంది కదా, పూల కొట్టు పెట్టి ఆ డబ్బులు అన్ని వాళ్ళకి ఇస్తుందేమో అని ప్రభావతి అంటుంది. నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడొద్దు అంటూ సత్యం ప్రభావతిపై కొంచెం సీరియస్ అవుతాడు. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది.
మిమ్మల్ని ఏమైనా అన్నారా?
మా అమ్మ మాటలు పట్టించుకోకండి మామయ్య, అని మీనా సత్యంతో అంటుంది. శివకి దెబ్బలు తగిలాయనే బాధలో అలా మాట్లాడింది. మీ అమ్మ అన్న దాంట్లో తప్పేం లేదమ్మా అని సత్యం అంటాడు. ఏం జరిగిందో అర్థం కాక ప్రభావతి చూస్తుంది. మిమ్మల్ని ఏమైనా అన్నారా? అంటూ అడుగుతుంది. మీ అమ్మ ఏమంది? అని మీనాని అడుగుతుంది. ఆ మాటకి సత్యం ఆ ఇంట్లో నాకు ఉండే మర్యాద ఎప్పటికీ అలాగే ఉంటుంది. దాని గురించి నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. అని ప్రభావతితో అంటాడు. ఇంతలో అక్కడికి బాలు వస్తాడు. లోపలికి వెళ్తుంటే సత్యం పిలుస్తాడు. ఇద్దరూ కలసి ఇంట్లోకి వెళ్తారు.
నా కొడుకుతో జాగ్రత్త
బాలుని లోపలికి తీసుకెళ్లిన తర్వాత బయట ఉన్న మీనాతో ఏంటి మీ ఆయన్ని, మా ఆయన అలా లోపలికి తీసుకెళ్లాడు అని ప్రభావతి అంటుంది. నాకేం తెలుసు? అది మీ ఆయన్ని అడగండి అంటుంది మీనా. మాకు మీలాగా గొడవలు ఏమీ లేవు అడుగుతాను అంటుంది ప్రభావతి. ఆ బాలు గాడు మీ తమ్ముడు శివని కొట్టాడు కదా, ఈ గొడవలు ఇంకా ఇలాగే పెద్దవి అవుతాయి. తర్వాత బాలు తో జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే అంటూ మీనా కి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడి ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. మీనా అలా చూస్తూ ఉండిపోతుంది.
నువ్వు చేసిన పని ఏంట్రా?
లోపలికి వచ్చిన తర్వాత సత్యం శివని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్లినట్టుగా బాలు తో చెప్తాడు. ఎందుకిలా చేసావ్ అని అడుగుతూ, నువ్వు చాలా మంచోడివి నీ మూర్ఖత్వమే నీకు శాపంలా తయారయింది అని బాలుతో సత్యం అంటాడు. శివ ఆ దెబ్బతో చాలా బాధపడుతున్నాడని, నాకే చాలా బాధనిపించిందని వాళ్ళ అమ్మ ఎలా తట్టుకుంటుంది? అని సత్యం అంటాడు. ఇంతలో మీనా లోపలికి వస్తుంది. వాళ్ళు అడిగిన మాటలకు, నా దగ్గర సమాధానం లేదు తెలుసా అంటాడు సత్యం. ఆ శివ గాడు ఏమన్నా అన్నాడా నిన్నూ అంటూ కోపంగా ముందుకెళ్ల పోతాడు బాలు. వెంటనే బాలుని ఆపుతాడు సత్యం.
మీనా నిన్నే నమ్ముకుంది
ఈ ఆవేశమే నీకు వద్దనేది. చిన్నపిల్లాడు వాడి మీద నీకు కోపం ఎందుకు? ఆవిడ ప్లేస్ లో మీ అమ్మే ఉండి ఉంటే ఎంత హడావుడి చేసేదో నీకు తెలుసు. ఎన్నో శాపాలు పెట్టేది అంటాడు సత్యం. సొంత అల్లుడే దీనికి కారణమయ్యాడని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటాడు సత్యం. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని తిరిగి తండ్రిని బాలు అడుగుతాడు. వాళ్లు బయట వాళ్లు కాదు కదా? మన బంధువులే కదా అందుకనే వెళ్లాను అంటాడు సత్యం. మీ అమ్మ ఎన్ని మాటలు అన్నా, మీనా నిన్నే నమ్ముకుని ఉంటుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కొడుకు పై సీరియస్ అవుతాడు సత్యం.
శివ ఏం చేసాడో తెలుసా?
ఇందులో నా తప్పేమీ లేదు నాన్న అని అంటాడు బాలు. చెయ్యి విరిచేసి, తప్పేమీ లేదంటావేంటి? అంటూ తండ్రి సీరియస్ అవుతాడు. ఇంతకుముందు నువ్వు చాలా మందితో గొడవ పడ్డావు కానీ, ఇంత దారుణంగా మృగంలా ప్రవర్తించడం నేను చూడలేదు అంటాడు సత్యం. నాన్న అసలు వాడిని నేను ఎందుకు కొట్టానో తెలుసా? అంటూ చెప్పబోతాడు. ఇంతలో మీనాని చూసి ఆగిపోతాడు. చెప్పు అని తండ్రి అంటే, ఏం లేదు వదిలేసేయ్ అంటాడు. నేను ఇంకెవరితోనూ గొడవ పడను. ఎవరినీ కొట్టను. ముఖ్యంగా నువ్వు తలదించుకునే పనులు ఇంకెప్పటికీ చేయను అంటూ బాలు వెళ్ళిపోతాడు. మీనా బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. వాడి మనసులో ఏదో బయటకు చెప్పుకోలేని బాధ ఉందని, బయటపడలేకపోతున్నాడని, మీనా తో సత్యం అంటాడు. ఆయన కావాలని కొట్టారని నేను అనుకోవడం లేదు మామయ్య, కానీ దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటుంది మీనా.

కస్టమర్ పై సాంబార్
ఊడిన మనోజ్ జాబ్
హోటల్లో మనోజ్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు. ఒక కస్టమర్ వచ్చి ఇక్కడ ఎవరూ లేరేంటి? అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మనోజ్ వచ్చి అతని దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఇంతలో ఒక సర్వర్ వచ్చి తను బాత్రూం కి వెళ్ళాలని, మనోజ్ కి సాంబార్ ఇచ్చి ఒక కస్టమర్ కి ఇమ్మని చెప్తాడు. మనోజ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సాంబార్ తీసుకుని కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే, స్లిప్ అయ్యి మనోజ్ ఆర్డర్ తీసుకున్న కస్టమర్ మీద సాంబార్ పడుతుంది. ఆ కస్టమర్ మనోజ్ తో గొడవకు దిగుతాడు. మనోజ్ కూడా తగ్గకుండా గొడవ పడతాడు. ఇద్దరూ ఒకరి షర్టు కాలరు మరొకరు పట్టుకుని కొట్టుకొబోతారు. ఇంతలో ఓనర్ అక్కడికి వచ్చి ఇద్దరినీ ఆపుతాడు. కస్టమర్ కి సారీ చెప్తాడు.
స్టార్ హోటల్ కడతా
మనోజ్ ని పక్కకు తీసుకెళ్లి, నీకు పని చేయడం రావడం లేదు. వచ్చిన దగ్గరనుంచి చూస్తున్నాం అంటూ హోటల్ ఓనర్ మనోజ్ పై సీరియస్ అవుతాడు. ఎవరో వస్తారు, టిఫిన్ తినేసి నువ్వు కడతావని చెప్తారు ఏంటిది? అంటూ ఓనర్ అడుగుతాడు. అది నా జీవితంలో కట్ చేసుకోమని చెప్పాను కదండీ అంటాడు మనోజ్. నీకు జీతమే దండగ అనుకుంటే, మళ్ళీ అందులో కట్ చేసుకునేదేంటి? నీకు ఉద్యోగం లేదు, ఏమి లేదు. ఇకనుంచి వెళ్ళిపో అని సీరియస్ అవుతాడు. నీ బోడిలో హోటల్ ఇక్కడ ఎవడు చేస్తాడు రా అని మనోజ్ కూడా ఓనర్ పై సీరియస్ అయ్యి, ఈ హోటల్ ని త్వరలోనే నేను కొంటాను. నా హోటల్లో సర్వర్ గా ఉండడానికి సిద్ధంగా ఉండు అంటూ మనోజ్ కోపంతో బయటకు వెళ్లిపోతాడు.
ముగింపు
మీనా ఇంటికి మీనా తల్లి, చెల్లి సుమతి వస్తారు. గుమ్మం దగ్గర నిలబడి మీనా అని పిలవగానే, ఇది మీనా ఇల్లు కాదు. సత్యం ఇల్లు లేకపోతే ప్రభావతి ఇల్లు అంటూ అవమానకరంగా ప్రభావతి మాట్లాడుతుంది. లోపలికి రమ్మని కూడా పిలవకుండా అవమానం చేస్తే, మీనా వాళ్ళ అమ్మపై సీరియస్ అవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను కదా వెళ్లండి అంటుంది. మరోవైపు శివ తన తండ్రి ఫోటోకి చేయి నొప్పితో హారతి ఇవ్వలేకపోతాడు. శివ తల్లి బాధపడుతూ, అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తున్నావు? అనగానే అక్కడికి బాలు వస్తాడు. మీ బస్తీ జనం ముందు నా గురించి అవమానకరంగా మాట్లాడాలా అంటూ అత్తగారిపై సీరియస్ అవుతాడు. శివ బాలుని అవమానం చేసి మాట్లాడడంతో మరొకసారి శివ చెంప పై పీకుతాడు బాలు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ సీరియల్ స్టార్ మా లో సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతుంది.
విశ్లేషణ
ఈ సీరియల్ లో శివ క్యారెక్టర్ చూస్తుంటే నాకు కొంతమంది దారి తప్పుతున్న నేటి యువతరం గుర్తుకొస్తూ ఉంటుంది. సమాజంలో చాలామంది యువకులు వ్యసనాలకు బానిసలై, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంట్లో పెద్ద వాళ్ళ మాట వినకుండా, తామేదో పెద్దవాళ్లమైపోయినట్టు ప్రవర్తిస్తూ అనేక వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. బయట ప్రపంచం ఎంత ఆకర్షిస్తున్నా విలాసాలకు, వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవిష్యత్తు కోసం పరితపించే వారికి ఎప్పటికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది. ఆ గీతను సరిగ్గా అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే జీవన ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.








