మనసుకు హత్తుకునే కథ
మనల్ని మనం చూసుకునే పాత్రలు
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 12/05/2025 ఏ సినిమా అయినా, సీరియల్ అయినా విజయవంతం అవ్వాలంటే, అందులో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకునే కథ, కథనాలు పాత్రలు ఉండాలి. మాటీవీలో విజయవంతంగా దూసుకెళ్తున్న “గుండె నిండా గుడి గంటలు” సీరియల్ లో కూడా ఇలా మనల్ని మనం స్క్రీన్ పై చూసుకునే పాత్రలు కథే కనిపిస్తుంది. అందుకే ఈ సీరియల్ ఇంతగా విజయవంతమైంది. సహజత్వం నిండిన పాత్రలతో, చక్కటి డైలాగ్స్ తో, మంచి మంచి సీన్స్ తో అలరిస్తున్న గుండె నిండా గుడి గుడిగంటలు సీరియల్ లో రోజుకో ట్విస్ట్, తర్వాత ఎపిసోడ్ లో ఏమవుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది స్టార్ మా లో సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు ప్రసారమవుతోంది. మరి ఈరోజు ఎపిసోడ్ “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు హైలెట్స్
- తమ పెళ్లి చూపులు రోజు గుర్తు చేసుకున్న సత్యం, ప్రభ
- సైకిల్ పై వెళ్తున్న రవి, శ్రుతిని చూసి షాక్
- నీ దొంగతనం వీడియో ఉందన్న బాలు
- శివని పలకరించడానికి వెళ్ళిన సత్యం
టాక్సీ స్టాండ్ కి గుణ
వడ్డీ తో పాటు అసలూ కట్టండి
టాక్సి స్టాండ్ లో రాజేష్ తో పాటు మిగతా డ్రైవర్లు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి బైక్ మీద గుణ వస్తాడు. ఏంటి అందరూ చాలా హుషారుగా ఉన్నట్టున్నారు అంటూ అందరినీ పలకరిస్తాడు. మేమెలా ఉంటే నీకు ఎందుకు? నెల నెల వడ్డీ కడుతున్నాం కదా అంటాడు అక్కడ ఉన్న డ్రైవర్. నేను ఈసారి వడ్డీ గురించి రాలేదు. అసలు, వడ్డీ రెండు కలిపి తీసుకుందామని వచ్చాను. వడ్డీ తీసుకోవడానికి వస్తే కొడుతున్నారు కదా? అంటాడు. గుణ మాట విన్న రాజేష్ ఇప్పటికిప్పుడే అసలు తీసుకు రమ్మంటే ఎలా తీసుకొస్తారు? అని అడుగుతాడు.
బాలు వల్లే ఇదంతా
24 గంటలు టైం ఇస్తున్నానని, నాకు రావలసిన అసలు, వడ్డీ మొత్తం కట్టాలని లేకపోతే మీ కార్లు తీసుకెళ్లిపోతానని గుణ వార్నింగ్ ఇస్తాడు. ఆ మాట విన్న డ్రైవర్స్ అందరూ షాక్ అవుతారు. మీ ఆపద్బాంధవుడు ఉన్నాడు కదా బాలు, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే కాపాడుతాడు కదా వెళ్లి వాడికి చెప్పుకోండి అంటాడు. గుణ వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్స్ ఈ బాలు గాడి వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్నీవస్తున్నాయని, ఆరోజు వాణ్ణి కొట్టకుండా ఉంటే, వీడు అసలు డబ్బులు అడిగేవాడు కాదని బాలుని నిందిస్తారు. దానికి రాజేష్ అడ్డుపడుతూ మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకునేది వాడే కదా. వాడు ఏ సందర్భంలో గుణాని కొట్టాడో మీకు తెలుసు కదా? అని అందరికీ సర్ది చెప్తాడు.
రవి, శృతి
ఫ్లాష్ బాక్ లోకి
గదిలో రవి, శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. రవీ ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో చెప్పమని శృతి అడుగుతుంది. రవికి గుర్తుండదు. ఈరోజు కూడా నీకు గుర్తులేదా? అంటూ రవి మీద పడుతుంది. ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకునే చూసుకుంటారు. ఈరోజు మనం కలుసుకున్న రోజు. నీకు ఏమీ గుర్తుండవు అంటుంది శృతి. మగవాళ్ళకి 100 టెన్షన్స్ ఉంటాయి. ఆడవాళ్లు అన్నీ గుర్తుపెట్టుకుంటారు అంటాడు రవి. లేదు నా మీద నీకు ప్రేమ తగ్గింది, అందుకనే ఏమీ గుర్తుండడం లేదు అంటుంది శృతి. మరి నీకు గుర్తున్నాయా? అని రవి అడగాగానే, రవిని కలిసిన రోజు దగ్గర్నుంచి ప్రపోజ్ చేసిన రోజు వరకూ అన్ని చెప్తుంది. నీకే నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటుంది.
గుర్తు లేకపోతే ప్రేమ తగ్గిపోయినట్టేనా అంటూ రవి అంటాడు. నాకెన్నో సార్లు ఫోన్ చేసేవాడివి, ఇప్పుడు ఒక్కసారైనా ఫోన్ చేస్తున్నావా? అంటుంది శృతి. ప్రతిరోజు నీతో ఉంటున్నప్పుడు ఇక ఫోన్లు ఎందుకు? అంటాడు రవి. అంటే నేను అంత బోర్ కొట్టేసానా అంటుంది శృతి. ఏదైనా ఉంటే డైరెక్ట్ గానే మాట్లాడుకుంటున్నాం కదా? అలాంటిదేమీ లేదు అంటాడు రవి. అయినా గానీ వినకుండా లేదు, నేను నీకు బోర్ కొట్టేసాను అంటుంది. నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తానంటూ కింద హాల్లోకి రవిని బలవంతంగా తీసుకెళ్తుంది.
సత్యం, ప్రభావతి
ఆటో గ్రాప్ స్వీట్ మెమోరీస్
హాల్లో సత్యం కూర్చుని ఉంటాడు. ఇంకా డ్యూటీకి వెళ్లలేదా అంటాడు రవిని శృతిని చూసి. ఇంకా వెళ్ళలేదు. ఒక విషయం చెప్పండి అంటుంది శృతి. ఏంటని సత్యం అడగ్గానే, మీరు ఆంటీని ఎప్పుడు చూస్తారు అని అడుగుతుంది. ఇప్పుడే వంట గదిలోకి వెళ్ళింది అంటాడు సత్యం. చూడటమంటే ఇప్పుడు చూడడం కాదు అంకుల్, ఆంటీ నీ ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు అంటుంది శ్రుతి. ఆ మాట అడుగుతున్నప్పుడు ప్రభావతి వస్తుంది. ఆ మాట విని అవన్నీ ఇప్పుడు గుర్తుంటాయా ఏంటి? ఎప్పుడో జరిగినవి అంటుంది ప్రభావతి. ఆంటీ కూడా నీలాగే రవి. నువ్వు అమ్మ పోలిక. నీకు, మీ అమ్మకు ఏమీ గుర్తుండవు అంటుంది శృతి. సత్యం కాసేపు ఆలోచించుకుని గుర్తుచేసుకుంటాడు.
చిలకపచ్చ రంగు చీర
సత్యం ప్రభావతిని ఎప్పుడు చూస్తాడో, డేటు టైం తో సహా చెప్తాడు. 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నీకు ఎలా గుర్తున్నాయి నాన్న అంటూ ఆశ్చర్యపోతాడు రవి. సత్యం ఇంకా కంటిన్యూ చేస్తూ, ప్రభావతి ఆరోజు పెళ్లి చూపుల్లో కట్టుకున్న చీర రంగు గురించి, గాజుల గురించి, చెవికి పెట్టుకున్న కమ్మలు గురించి అన్నీ వివరంగా చెప్తాడు. అది విన్న ప్రభావతి ఆశ్చర్యపోయి, సిగ్గుపడిపోతుంది. నిన్ను ఇలాగే వదిలేస్తే ఫ్లాష్ ప్యాక్ లోకి వెళ్లి సాంగ్ కూడా వేసుకునేటట్టు ఉన్నావు అంటాడు రవి సత్యంతో. చూసావా ప్రేమ అంటే, ఎప్పుడో జరిగిన విషయాలను కూడా అంకుల్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో అంటూ రవిని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. సత్యం, ప్రభావతి ఒకరినొకరు సిగ్గుపడుతూ చూసుకుంటారు. అన్ని గుర్తుపెట్టుకున్నావా? “పో” సత్యం అంటూ సిగ్గు పడిపోతుంది.
రోహిని దగ్గరకు..
రవిని తీసుకుని రోహిణి వాళ్ళ గదిలోకి వస్తుంది శృతి. బయటికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది రోహిణి. నువ్వు, మనోజ్ మొట్టమొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు? అని అడిగితే ఏప్రిల్ ఫస్ట్ అని చెప్తుంది రోహిణి. ఆ డేట్ విని చూసావా ఎవరు ఫూల్ అయ్యారో? అంటాడు రవి. టాపిక్ డైవర్ట్ చేయకు అంటూ రవిని గిచ్చి, ఆరోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు మనోజ్ అని అడిగితే, రోహిణి వివరాలన్నీ చెప్తుంది. అవన్నీ ఎలా గుర్తు పెట్టుకున్నావ్ వదినా అంటూ రవి అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని రోహిణి అడగ్గానే, చెప్తా ఉండు అంటూ రవిని తీసుకుని శృతి ఆ గదిలోంచి బయటికి వెళ్లిపోతుంది.
ఇక మనోజ్ వంతు
పెరట్లో మనోజ్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. మనోజ్ అని గట్టిగా వెనకనుంచి శృతి పిలవగానే, మనోజ్ భయపడతాడు. ఏంటి అంటాడు కంగారుగా. మీరు ఫస్ట్ టైం రోహిణిని చూసినప్పుడు ఏ డ్రెస్ వేసుకుంది అని అడుగుతుంది… శృతి. వివరాలు చెప్తాడు మనోజ్. చూశారా ఇదే ప్రేమంటే ఇది అంటుంది రవితో శృతి. ఏంటి ఇవన్నీఇప్పడు ఎందుకు అని అడుగుతాడు మనోజ్. వెళ్లి రోహిణిని అడగండి అంటూ, అక్కడి నుంచి రవిని తీసుకొని వెళ్ళిపోతుంది. మనోజ్ కి ఏమీ అర్థం కాదు. ఎందుకొచ్చారు? ఏమి అడిగారు? ఎందుకు వెళ్లిపోయారు? రోహిణి ని ఏం అడగాలి అంటూ బిక్క మొహం వేసుకొని చూస్తాడు.
తప్పు ఒప్పించిన శ్రుతి
నేనేదో కొన్ని విషయాలు మర్చిపోయినందుకు, ఇంతమందిని డిస్టర్బ్ చేయాలా? అంటూ గదిలోకి వచ్చిన రవి, శృతిని అడుగుతాడు. వాళ్ళు ఏమి డిస్ట్రబ్ అవ్వలేదు. వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటారులే అంటుంది శృతి. చూసావు కదా ఎలా సిగ్గుపడ్డారో అంటుంది. మొత్తానికి ఇవన్నీ నువ్వు మర్చిపోయినందుకు, నీ తప్పు ఒప్పుకుంటావా? మర్చిపోయానని ఒప్పుకుంటావా? అంటుంది. ఒప్పుకుంటున్నాను అంటాడు రవి. మరి ఇప్పుడు ఏం చేస్తావు అంటే, సాయంత్రం త్వరగా వచ్చి మన యానివర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు రవి, దానికి ఆనందపడిన శృతి నన్నుస్టూడియో దగ్గర అంటూ దించు అంటూ రవిని అడుగుతుంది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లిపోతారు.
తప్పు నీదే బాలు
నేను చూసుకుంటానన్నబాలు
టాక్సీ స్టాండ్ దగ్గరికి బాలు వస్తాడు. డ్రైవర్లు అందరూ అక్కడే ఉండడం చూసి, ఏంట్రా ట్రిప్ కి వెళ్లలేదా అని అడిగితే, గుణ వచ్చి వార్నింగ్ ఇచ్చిన సంగతి చెప్తారు, ఒక డ్రైవర్ నేన తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టాను. వాడు దానిమీద ఏమి రాసి, ఏం చేస్తాడో ఏంటో అంటూ టెన్షన్ పడతాడు. నువ్వు ఆరోజు గుణాని కొట్టకుండా ఉంటే, మాకు ఈరోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా అంటారు. మిగతా డ్రైవర్స్ అంతా బాలు వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతుంటే, దానికి రాజేష్ అడ్డుపడతాడు. మన దగ్గర కార్లు లాగేసుకుంటే మనం ఎలా బతకాలి? మనకి ఈ పని తప్పితే వేరే పని కూడా తెలీదని మిగతా డ్రైవర్లు అనడంతో, మీరు ఏమీ బాధపడకండి. అలా ఏం జరగదు. ఇప్పుడే వస్తాను ఉండండి, అంటూ బాలు అక్కడినుండి కారులో బయలుదేరుతాడు.

గుణా ఆఫీస్ కి బాలు
నా దగ్గర నీ గుట్టు విప్పే వీడియో ఉంది
గుణ ఆఫీస్ కి వచ్చిన బాలు, నాతో గొడవపడి డ్రైవర్స్ అందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అని అడుగుతాడు. ఆ విషయం నీకెందుకు? అని గుణ అడిగితే, వడ్డీ అసలు ఒకేసారి కట్టమని వచ్చి వేధిస్తున్నావట కదా? అని కూడా అడుగుతాడు. అది నీకు సంబంధం లేని విషయం డబ్బులు ఇచ్చింది నేను. తీసుకున్నది వాళ్ళు అంటాడు గుణ. గొడవ జరిగింది మన ఇద్దరికీ, నా మీద కోపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకు అంటాడు బాలు. నువ్వు అందరి ముందు నన్ను కొట్టి అవమానించావు కదా? దానికి పగ తీర్చుకోవాలి కదా? అంటాడు కోపంగా. బుద్ధిగా చదువుకుంటున్న శివని నీతో తిప్పుకుంటూ, దొంగతనాలు కూడా చేయిస్తున్నావని ఆ వీడియో నా దగ్గర ఉందని అంటాడు బాలు.
ఏం చేసుకుంటావో చేసుకో
ఆ వీడియో బయటకొస్తే నాకంటే, శివకే ఎక్కువ ప్రమాదం అని ఎదురు తిరుగుతాడు గుణ. ఇప్పటివరకూ తప్పుడు దారిలో తిరిగి శివ దారి తప్పాడని వాడిని వదిలేయని బాలు అంటాడు. అది మేము చూసుకుంటాం నీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతాడు. అన్నీ చూస్తూ వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అంటూ గట్టిగా అరుస్తాడు బాలు. నీవల్ల ఆ డ్రైవర్స్ అందరికీ నేనంటే భయం లేకుండా పోయిందని, అందరూ నన్ను జోకర్లా చూస్తున్నారని అంటాడు గుణ.
అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అని బాలు అడిగితే, నా కాళ్ళ మీద, శివ కాళ్ళ మీద పడి మీ ఫ్రెండ్స్ అందరి ముందు నాకు సారీ చెప్పు అంటాడు. ఆ మాటకి కోపం వచ్చిన బాలు షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. ఇది నా ఆఫీసు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అనవసరంగా జైలు ఫాలో అవుతావు అని భయపెడతాడు గుణ. రేపు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి కార్లు లాక్కుంటాను అంటాడు. ఎలా లాక్కుంటావో నేను చూస్తాను అంటూ బాలు బయటకు వెళ్లిపోతాడు. వీడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే వీడి ప్లాన్ ఏంటి అని ఆలోచనలో పడతాడు గుణ.
రవి, శ్రుతి
అలా సైకిల్ పై షికారు
స్టూడియోకి సైకిల్ మీద డ్రాప్ చేయమంటుంది శృతి. దాంతో రవి శృతి ఇద్దరూ సైకిల్ మీద వస్తూ ఉంటారు. రవి స్లోగా తొక్కుతుంటే, ఇంకా స్పీడ్ గా తొక్కు అంటుంది శృతి. నువ్వు ఈ మధ్య ఫుడ్డు ఆర్డర్స్ ఎక్కువగా పెట్టకపోతే, అలాగే తొక్కేవాడ్ని అంటాడు. అంటే నేను లావైపోయానా అంటుంది. నేను తొక్కుతా ఉండు, అంటూ రవిని ముందు ఎక్కించుకుని సరదాగా శృతి సైకిల్ తొక్కుతుంది. వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ అలా సైకిల్ మీద వెళ్లడాన్ని అటుగా కారులో వస్తున్న శృతి వాళ్ళ నాన్న చూస్తారు. కారు ఆపుతాడు. ఏంటి అని అడిగితే భార్య అడిగితే, అలా చూడు అంటాడు ముందుకి చూపిస్తాడు. శృతి, రవి సైకిల్ మీద రావడం కనిపిస్తుంది.
అదేంటి వాళ్ళు సైకిల్ మీద వస్తున్నారు? రవికి బైక్ ఉంది కదా అంటుంది శృతి అమ్మ. ఆ బైక్ ని అమ్మేసి ఉంటాడు. హోటల్ ఓనర్ ని చేసుకోవాల్సిన నా కూతురు వీడిని చేసుకుంది. రేపు ఈ సైకిల్ కూడా పోయి, ప్లాట్ ఫామ్ మీదకి వచ్చే టైం వస్తుంది చూడు అంటాడు భార్యతో. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ప్రోమో
హాల్లో బాలు, సత్యం వాదులాడుకుంటూ ఉంటారు. నువ్వు చాలా మంచోడివి రా బాలు. కానీ నీ కోపం మూర్ఖత్వం నీ మంచితనాన్ని చంపేస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్న మాటలకి నా దగ్గర సమాధానం లేదు తెలుసా? అంటాడు సత్యం. ఆ మాట విన్న బాలు ఆ శివ గాడు నిన్నేమైనా అన్నాడా అంటూ సీరియస్ గా వెళ్ళబోతాడు. ఇదిగో ఈ కోపమే వద్దు అనేది అంటూ సత్యం బాలుని ఆపుతాడు. ఇదంతా మీనా చూస్తూ ఉంటుంది. మీనా నిన్నే నమ్ముకుందని, ఎంత జాగ్రత్తగా ఉండాలి రా అంటాడు సత్యం. ఆయన కావాలని కొట్టాడని నేను అనుకోవడం లేదు మామయ్య, దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి? అంటుంది బాలుని చూస్తూ. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఈ సీరియల్ స్టార్ మా ఛానల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతుంది.
విశ్లేషణ
ఈరోజు ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన సీన్ ఏమిటంటే, సత్యం తన పెళ్లి చూపుల రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడం. ఆ సీన్ చూస్తుంటే నా పెళ్లి చూపుల సీన్ మళ్లీ కళ్ళముందు కదిలింది. ఎవరి జీవితంలో అయినా వివాహం అనేది ఒక మధురమైన ఘట్టం. దానికి నాంది పలికేది పెళ్లి చూపులతోనే కదా? మన లైఫ్ పార్ట్నర్ ని ఫస్ట్ టైం చూసిన ఆ పెళ్లిచూపులు తంతుని ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మరి ఆ సీన్ చూసిన తర్వాత మీ పెళ్లి చూపుల విషయం మీకు గుర్తుకొచ్చిందా? మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.








