గుండెనిండా గుడిగంటలు సీరియల్ 02/05/2025

సీరియల్ ప్రత్యేకత

ఫ్యామిలీ ఎంటర్టైనర్

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 02/05/2025 మిడిల్ క్లాస్ ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతలు, అలకలు, గొడవలు ఇవే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని ప్రధానాంశాలు, ఈ సీరియల్ ఇంతగా జనాధారణ పొందడానికి ముఖ్య కారణం ప్రధాన పాత్రలు మీనా, బాలు. ఈ రెండు పాత్రల్లో అమూల్య గౌడ, విష్ణుకాంత్ చక్కగా నటిస్తున్నారు. వీళ్ళ జంట కూడా చూడముచ్చటగా ఉండడంతో సీరియల్ కి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సీరియల్ తమిళ ధారావాహిక “సిరగాడిక్క ఆసై” కి రీమేక్ గా తెలుగులో స్టార్ మా ఛానల్ లో సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు ప్రసారమవుతోంది. ఛానల్ కంటే ముందుగానే హాట్ స్టార్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హాట్ స్టార్ చందాదారులు మాత్రమే ముందుగా చూడగలరు. రోజుకో మలుపుతో, ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో నా రివ్యూ లో ఇప్పుడు చూద్దాం.

హైలెట్స్

  • శ్రుతి తో బాలు గొడవ
  • బాలు రూమ్ కి షిఫ్ట్ అయిన సత్యం, ప్రభ
  • రవి, శ్రుతి గొడవ
  • సత్యం కి సారీ చెప్పిన శ్రుతి
  • గుణా గొడవలో శివ ని కొట్టిన బాలు

సత్యం డిశ్చార్జ్

శ్రుతి తో గొడవ

సత్యం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. కుటుంబ సభ్యులు అంతా సత్యాన్ని ఇంటికి తీసుకొని వస్తారు. ఇంట్లో ఉన్న రోహిణి ఇప్పుడు ఎలా ఉంది మామయ్య గారు? నేను వద్దామనుకున్నాను ఈలోపే మీరు వచ్చేస్తున్నారని మనోజ్ చెప్పాడు అంటుంది. శృతి కూడా లోపలి నుంచి వచ్చి అదేంటి అప్పుడే వచ్చేశారు? నేను ఒక వారం రోజులైనా పడుతుందేమో అనుకున్నాను అంటుంది. ఆ మాటకి బాలుకి మండుతుంది. అంటే చాలా పెద్దగానే ప్లాన్ చేసావ్ అన్నమాట అని శృతి తో అంటాడు. పెద్దగా ప్లాన్ చేయడం ఏంటి? ఇంత త్వరగా వచ్చారంటే సమస్య చిన్నదని అంటున్నాను అంటుంది శృతి.

తమ్ముడి భార్యతో ఇలా మాట్లాడతారా?

అన్నయ్య నన్ను అక్కడ తిట్టావు కదా. మళ్ళీ ఇక్కడ కూడా మొదలు పెట్టాలా? అని రవి అంటాడు. నీకు అక్కడ ఏమైంది? నాకు ఇక్కడ ఏమవుతుంది? అంటూ శృతి అనడంతో, చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతావ్ ఏంటి అంటూ బాలు అడుగుతాడు. తమ్ముడు భార్యతో అలాగేనా మాట్లాడేది అంటూ బాలు పై మీనా సీరియస్ అవుతుంది. కోడలు మామగారికి ఇలాంటి పరిస్థితి తీసుకురావచ్చా అని బాలు అంటే, అసలు ఏం జరిగిందంటూ శృతి రెట్టించి అడుగుతుంది.

దోమల మందు వీధిలో కొట్టు

నువ్వు కొట్టిన దోమల మందు వల్ల మామయ్య గారికి సీరియస్ అయింది. ఆ స్మెల్ నాకే సరిగ్గా పడలేదు. అలాంటి స్ప్రేలు ఇకనుండి ఇంట్లో కొట్టకూడదని డాక్టర్ చెప్పారు అంటుంది మీనా. నేను ఏమీ కావాలని ఏమీ చేయలేదు కదా? అందరికీ దోమలు కుట్టకూడదు అనే ఉద్దేశంతో నేను ఇల్లంతా ఆ మందు స్ప్రే చేశాను అంటుంది శృతి. అందరికీ కట్టకూడదని నువ్వు అంతగా ఫీల్ అవుతుంటే, వెళ్లి వీధిలో కొట్టు అంటాడు బాలు. ఆ మాటకి ప్రభావతి ఈ గొడవలు నువ్వు పెద్దవి చేయాలని చూస్తున్నావా శృతికి తెలియదని చెప్తుంది కదా అంటుంది.

ఇదే పని మీనా చేస్తే?

ఇదే పని మీనా చేసుంటే, నువ్వు ఎంత రాద్ధాంతం చేసే దానివి.. శృతి వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్లు కాబట్టి వాళ్ళు ఏం చేసినా నీకు మంచిగానే అనిపిస్తుంది, అయినా సమస్య వచ్చింది మా నాన్నకే కాదు నీ భర్తకి కూడా అంటూ చురకలు అంటిస్తాడు బాలు. ప్రభావతి కి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. వదిలేయ్ రా ఎందుకు గొడవ పెద్దది చేస్తావ్ అంటాడు సత్యం.

మా నాన్న కోసం ఏదైనా చేస్తా

డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు వస్తే ఎవరిది బాధ్యత? అంటుంది శృతి. ఇప్పుడు అంతకంటే ఎక్కువే జరిగింది. బిల్లు నువ్వు, మీ ఆయన కడతారా? నేను అప్పు చేసి కట్టాను. అయినా మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. డబ్బులు గురించి నేనెప్పుడూ పట్టించుకోను అంటాడు బాలు. నువ్వు తప్పుని తప్పని ఒప్పుకో అంటూ శృతిని అనడంతో, బాలుని నాతో మాట్లాడొద్దని చెప్పు అంటుంది రవితో శ్రుతి.

నేను చెప్పా..కదా? ఆగితే సరిపోయేది

బాలు కోపంతో మాట్లాడటం లేదని, బాధతో మాట్లాడుతున్నాడని ఏమీ అనుకోవద్దు అని మీనా శృతి తో అంటుంది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా మీనా అంటుంది శృతి. నేను ఆపినప్పుడు ఆగిపోతే సరిపోయేది. ఇవన్నీ ఆలోచించే నేను కొట్టొద్దని చెప్పాను. ఆ వాసనకి నేనే చాలా ఇబ్బంది పడ్డాను అంటుంది మీనా. మీనా చెప్పినప్పుడు ఆపితే బాగుండేది… అంటూ రోహిణి కూడా అంటుంది. ఇలాంటి మందు కొడితే, మీ మామయ్య గారికి ప్రమాదమని డాక్టర్స్ చెప్పారు. ఆగిపోతే సరిపోయేది కదా అంటూ ప్రభావతి కూడా శృతి ని అంటుంది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

అప్లికేషన్ పెట్టుకోవాలా?

నువ్వు ఉండి ఉంటే శృతిని ఆపుతావా? డబ్బున్న వాళ్ళు ఏం చేసినా, నువ్వు తానా అంటే తందానా అంటావు అంటూ తల్లితో అంటాడు బాలు. ఇలా ప్రతిదీ నేను అడిగి చేయాలంటే కష్టం రవి అంటుంది శృతి. ప్రతిదీ అప్లికేషన్ పెట్టుకుని చేయాలా? అంటుంది. ఆ మాటకి బాలు, చూసావా నీ కోడలు నిన్నే అంటుంది. ఎంత పొగరుగా మాట్లాడుతుందో విన్నావా అంటాడు బాలు ప్రభావతితో. పొగరు గిగరు అని మాట్లాడొద్దు అని చెప్పు రవి అంటుంది శృతి కోపంతో.

తెలిసే మాట్లాడతారా?

బాలు హాల్లో మూలన ఉన్న బెడ్ ని బయటకు తీస్తూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి “నీ పెళ్ళాం ఈ ఇది కూడా లోపల వెయ్యమని చెప్పిందా? అని బాలుతో అంటుంది. మీరు తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడుతారో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నేనేమి అలా చెప్పలేదు. ప్రతిదానికి నా మీద ఎందుకు పడతారు అంటూ మీనా ప్రభావతితో అంటుంది. ఆ మాటకి ప్రభావతి మొహం పక్కకు తిప్పుకుంటుంది. ఆ బెడ్ ని అక్కడే ఉండనివ్వరా అంటూ సత్యం అంటాడు. నువ్వు నా రూమ్ లో పడుకో.. అక్కడ అయితే ఎవరూ స్ప్రే చేయరు అని బాలు అంటే, ఆ మాటకి ఛీ అంటూ శృతి లోపలికి వెళ్ళిపోతుంది.

డబ్బున్న పొగరు, అహంకారం

శృతి నువ్వైనా ఆగొచ్చు కదా ఏంటి ఈ గొడవ అంటుంది మీనా. మీ ఆయన ఆగుతున్నాడా బిల్లు కట్టానని బిల్డప్ ఇస్తున్నాడు. ఎంత బిల్ అయిందో చెప్తే ఆ బిల్లు నేను పే చేస్తాను అంటుంది శృతి. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. శృతికి డబ్బు ఉందన్న పొగరు, అహంకారం అని బాలు అనగానే, ఏవండీ మీరు ఆగుతారా అంటూ బాలుని మీనా ఆపుతుంది. కన్నతండ్రి కి కొడుకులు కాకపోతే, ఇంకెవరు ఖర్చు పెడతారు. వీళ్ళెప్పుడు నాన్న కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టిన పాపాన పోలేదు అంటూ మనోజ్ ని రవిని ఉద్దేశించి బాలు అంటాడు. అదంతా వింటున్న సత్యం “నన్ను ఇలా వదిలేసి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళండి” అని బాధతో అంటాడు.

గది క్లీన్ చేస్తా

ఈ బెడ్ మోయడానికి సాయం చేయరా.. అంటూ రవిని, బాలు అడుగుతాడు. మీరు కాస్త ఆగండి అంటుంది మీనా. చూసావా? నీ బెడ్ రూమ్ లో పడుకోమని నువ్వు అంటుంటే, నీ పెళ్ళాం మాత్రం వద్దంటుంది. అని ప్రభ అనడంతో, నాకు నోరు ఉంది నేను మాట్లాడుతాను, శృతి ఏదైనా చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలా అని మాట్లాడింది అప్పుడు మీ నోరు ఎందుకు లేవలేదు అని మీనా అంటుంది. మంచి చెడు తనకి తెలుసునని, మా గది క్లీన్ చేస్తానని, డస్ట్ ఉంటే మామయ్య గారికి పడదు కాబట్టి ఆగమన్నానని, మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

నాన్న క్షమించు

బాధతో రవి

సత్యం ప్రభావతి ఉన్న గదిలోకి రవి వస్తాడు. నాన్నకి సారీ చెప్తాడు. ఎందుకురా అంటే, శృతి వల్లే కదా నీకు ఆరోగ్యం పాడైపోయింది. శృతికి తెలియదు కదరా జరిగిందేదో జరిగిపోయింది. నేను బాగున్నాను కదా శృతిని బాధపడొద్దు అని చెప్పు వెళ్ళు అంటాడు సత్యం. ఈ బాధలన్నీ ఆ బాలు గాడు వల్లే అంటుంది ప్రభావతి. బాలు ఎప్పుడు కూడా తప్పుని తప్పనే చెప్తాడని అనడంతో, చెప్పొచ్చు వదిన, మరదలు అని కూడా చూడకుండా ఏంటా మాటలు అంటుంది. నాకు ఏదైనా జరిగితే వాడు అంతే అన్నట్టుగా సత్యం మాట్లాడతాడు. నా అదృష్టం బాగుండి మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అంటుంది.

శ్రుతి వచ్చి సారీ చెప్పు

రవి ఆర్డర్

మీ అన్నయ్య చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, మాట్లాడొద్దని చెప్పు అని తమ గదిలో శృతి రవితో అంటుంది. మాట్లాడకుండా ఎలా ఉంటాడు? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నేనేం చేశాను రవి అంటూ శృతి అనడంతో, మా నాన్నకి సారీ చెప్పు అని రవి అంటాడు. సారీ చెప్తే ఓకేనా? అయితే పదా అంటూ అక్కడి నుండి సత్యం రూమ్ కి ఇద్దరూ వెళ్తారు.

సారీ అంకుల్

శ్రుతి క్షమాపణ

రవి శృతి ఇద్దరు కలిసి సత్యం, ప్రభావతి ఉన్న రూమ్ లోకి వస్తారు. అంకుల్ సారీ అంకుల్.. మీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆ బాలు గాడు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు వదిలేయమ్మా ఎందుకు ఫీల్ అవుతావు అంటూ ప్రభావతి అంటుంది. అంకుల్ కి నావల్ల ఇలా అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను…అంటుంది శృతి. సరే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళండి అంటుంది ప్రభావతి. శృతి వెళ్లిపోతుంది. రవి నువ్వు ఏమైనా గొడవ పడ్డావా శృతి తో అంటూ ప్రభ అడగడంతో, అదేమీ లేదమ్మా అని రవి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసారా? ఎంత కోటీశ్వరులు అమ్మాయి అయినా గానీ, వచ్చి సారీ చెప్తుంది అంటూ శృతిని వెనకేసుకొస్తుంది ప్రభావతి. మళ్లీ మీనా గురించి ప్రభావతి తప్పుగా మాట్లాడటంతో సత్యం సీరియస్ అవుతాడు.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

షీలా ఫోన్

ఫొటోస్ చాలా బాగున్నాయి

హాల్లో కూర్చున్న సత్యం కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది మీనా. ఇంతలో ఊరు నుంచి షీలా ఫోన్ చేస్తుంది. అమ్మమ్మ ఎలా ఉన్నావ్ అని అడిగి, ఊరు నుంచి వచ్చినాక బాగా బిజీ అయ్యాను అంటుంది మీనా. ప్రేమగా మాట్లాడుతుంది షీలా. వాళ్ళిద్దరు మాటలు వింటూ సత్యం ఆనందపడతాడు. అన్ని పనులు నువ్వే ఎందుకు చేస్తావ్? అని షీలా మీనాని అడుగుతుంది. మన పనులే కదా? అలా అనుకుంటే ఎలా? అని మీనా అనగానే, గంతకు తగ్గ బొంతలా, నా కోడలికి ఈ కోడలు తగిలింది అంటూ మీనా నుద్దేశించి అంటుంది.

మంగళసూత్రాలు కొన్నాడట

బాలు మీ పెళ్లి ఫోటోలు పంపించాడని, మంగళ సూత్రాలు కొన్నాడట కదా అని అడుగుతుంది అమ్మమ్మ. బాలు అనుకుంటే, ఏదైనా చేస్తాడు. మీ అత్త దృష్టిలోనే వాడు వేస్ట్. మరి ఆ ఫోటోలు చూసి మీ అత్తయ్యకి నిద్ర పట్టిందా? అని అడగానే, మీనా నవ్వుతుంది. కొడుకు సంసారం బాగుంటే చూసి ఓర్చుకోలేని తల్లి. అయినా దాని గురించి నాకెందుకులే. మీనా షీలా తో మామగారు సత్యంకి వచ్చిన హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పబోతే సత్యం వద్దని వారిస్తాడు. ఇంతలో బాలు వస్తాడు.

అంతా బాగున్నారా?

ఫోన్ తీసుకుని షీలా డార్లింగ్ ఎలా ఉన్నావు? అని అడుగుతాడు. నేను బానే ఉన్నాను రా అంటుంది. ఇంతలో సత్యం హాస్పిటల్ కి తీసుకెళ్లిన విషయం చెప్పబోతాడు. వెంటనే బాలుని ఆపమని సత్యం సైగ చేస్తాడు. మీరు పంపించిన ఫోటోలు చూశానని, చాలా బాగున్నాయి అని బాలుతో అంటుంది. నీ భార్య మంచిదని, బాగా చూసుకోమని షీలా చెప్తుంది. మొన్న ఊరు వచ్చినప్పుడు దిగిన ఫోటో పంపిస్తే పెద్దదిగా చేసి ఇంట్లో పెట్టుకుంటాను అంటుంది. నేనే పంపిస్తాలే అంటాడు బాలు.

ఫోటో రోడ్డు మీద పెట్టుకుంటారా?

మీరిద్దరూ కూడా అమ్మ దగ్గర నా హాస్పిటల్ విషయం ఎక్కడ నోరు జారతారో అని చాలా కంగారు పడ్డాను అంటాడు సత్యం. ఎందుకు చెప్పొద్దన్నారు అని మీనా అడగ్గానే, ఈ వయసులో అవన్నీ చెప్పి అమ్మని బాధ పెట్టడం ఎందుకు అంటాడు సత్యం. ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది. ఫోటో పంపించమంటుంది ఏంటి? అని బాలుని సత్యం అడగ్గానే, మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలు పంపించమంటుంది అంటాడు. మనం కూడా కట్టించి, ఫోటో ఇంట్లో పెట్టుకుందాం.. అని సత్యం అనగానే, ఫోటో పెడతారా అంటుంది ప్రభావతి, మరి ఇంట్లో పెట్టక రోడ్డుపై పెడతారా ఫోటో అని బాలు ఎటకారంగా మాట్లాడుతాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 02/05/2025

తర్వాత ఎపిసోడ్ లో

బావ బావామరుదుల గొడవ

ఫొటోస్ ప్రింట్ వేయించడానికి స్టూడియో కి వస్తాడు బాలు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసిన ఫోటో స్టూడియో అతను కొన్ని రోజుల క్రితం మీ అమ్మగారి దగ్గర నుంచి డబ్బులు ఎవరైనా కొట్టేసారా అని అడుగుతాడు. అవును అంటాడు బాలు. మీకు ఒక వీడియో చూపిస్తా అంటూ రోడ్డుపై వెళ్తున్న ప్రభావతి బాగ్ లాక్కున్నదృశ్యాలను చూపిస్తాడు. ఆ వీడియోలో గుణ ఉంటాడు.

రాజేష్ దగ్గరికి వచ్చి వడ్డీ డబ్బులు అడుగుతాడు గుణ. ఇప్పుడు లేవు అనగానే, కారు తీసుకెళ్తా అంటాడు. రెండు రోజులు టైం ఇవ్వు అనగానే, పోనీ మీ ఆవిడని పంపిస్తావా? అని అంటాడు. దానికి గుణాని కొడతాడు రాజేష్. రాజేష్ ని కొట్టబోయిన గుణాని బాలు కొడతాడు. శివ, బాలు కాలర్ పట్టుకుంటాడు. శివాని ఎత్తి అవతలపడేస్తాడు బాలు. తర్వాత ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Leave a Comment