మనసుకు హత్తుకునే కథ, కథనాలు
అందరికీ నచ్చిన బాలు
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 30/04/2025 మాటీవీలో ప్రసారమవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజుకొక కొత్త మలుపుతో వీక్షకులను కట్టిపడేస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లోని అనుబంధాలను, ఆప్యాయతలను అందంగా చూపిస్తున్న ఈ సీరియల్లో హీరో బాలు క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కొంచెం అమాయకత్వం, కొంచెం గడుసుతనం, మరి కొంచెం చిలుపితనం ఈ మూడు కలగలిసిన పాత్రలో బాలుగా, నటుడు విష్ణుకాంత్ మంచి నటనతో మెప్పిస్తున్నారు, ఇక మీనా పాత్ర కూడా ఈ సీరియల్ కి మరో హైలెట్ అని చెప్పొచ్చు, మీనాగా అమూల్య గౌడ్, తన ఎన్నోసేంట్ పెర్ఫామెన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు, ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ ఈరోజు (ఏప్రిల్ 30) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్స్
- దోస గురించి గొడవ
- వదిన తల్లిలాంటిది అన్న మీనా
- మనోజ్ హోటల్ లో ప్రభావతి
- బాలు కి సారీ చెప్పిన రోహిణి
30 ఏప్రిల్ బుధవారం
తీవ్ర అస్వస్థకు గురైన సత్యం
బాలుకి మీనా ఫోన్
హాల్లో శృతి దోమల మందు స్ప్రే చేస్తుంది. ఆ దోమల మందుకి ఎక్స్పైరీ డేట్ ముగియడంతో, అది కెమికల్ స్మెల్ లాగా ఫామ్ అయ్యి అక్కడ ఉన్న వారిని ఇబ్బంది పెడుతుంది, మీనా కూడా ఆ వాసన భరించలేక ఏం చేస్తున్నావ్ శృతి? అని అడుగుతుంది. దోమల స్ప్రే కొడుతున్నానని శృతి తన పనిలో తాను ఉంటుంది. మీనా ఇబ్బంది పడుతున్న పెద్దగా పట్టించుకోదు. అదే సమయంలో హాల్లో ఉన్న సత్యం కి ఈ వాసన భరించలేక అస్వస్థత వచ్చి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. దాంతో హుటాహుటిన మీనా మామగారు సత్యంని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా బాలుకి తెలియజేస్తుంది.
హోటల్ లో సర్వర్
నీళ్ళు నమిలిన మనోజ్
మనోజ్ రోహిణి బెడ్రూంలో రోహిణి మనోజ్ ని ఎందుకు హోటల్లో సర్వర్ లాగా ఐటమ్స్ పేర్లు కలవరిస్తున్నావు అని అడుగుతుంది. నేను ఐటమ్ పేర్లు కలవరించడమేమిటి? అంటాడు మనోజ్. హోటల్ లో సర్వర్ ఆర్డర్ తీసుకుంటున్నట్టుగా వరుస పెట్టి మసాలా దోశ, ఇడ్లీ, వడ అంటూ చెప్తున్నావని రోహిణి అనడంతో, మనోజ్ కవర్ చేస్తూ నాకు మా ఆఫీస్ దగ్గర మసాలా దోశ అంటే ఇష్టం ఏదైనా నేను ఒకసారి చూసాను అంటే, నాకు ప్రతిదీ కూడా ఎక్కువగా గుర్తుండిపోతుంది అని చెప్తాడు. అయితే నీ మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట అంటూ ఎటకారం చేస్తుంది రోహిణి. పదేపదే హోటల్ లో సర్వర్ అనొద్దు అంటూ, రోహిణికి చక్కిలిగింతలు పెడతాడు.
తుళ్ళిపడి లేచిన ప్రభావతి
భర్త సత్యం సీరియస్
మనోజ్ గదిలోంచి చిన్న కొడుకు గదిలోంచి కంటిన్యూగా నవ్వులు వినపడుతూ ఉండడంతో, ప్రభావతి తుళ్ళిపడి లేస్తుంది. వెంటనే భర్త సత్యాన్ని లేపుతుంది. ఏంటండీ వాళ్ళ గొడవ అర్ధరాత్రి అనగానే పడుచు పిల్లలు సరదాగా ఉన్నారు నీకెందుకు పడుకోవే అంటాడు. ఈ గోల భరించలేకపోతున్నాను అంటే, బయటికి వెళ్లి పడుకోమంటాడు సత్యం. బయట కుక్కల అరుపులు కంటే ఇవే బెటర్ అన్నట్టుగా మాట్లాడి, బాలు మీనా ఇక్కడ లేకపోతే మనం వాళ్ల రూమ్ లో హ్యాపీగా పడుకునే వాళ్ళం కదా అంటుంది ప్రభావతి. ఆ మాటలకి మతుండే మాట్లాడుతున్నావా? నోరు మూసుకుని పడుకో అంటూ సీరియస్ అవుతాడు సత్యం.
మీనా తో రోహిణి
మాకు టిఫిన్ వద్దు
మీనా బయటకు వెళ్తుంటే, రోహిణి ఆపి టిఫిన్ గురించి అడుగుతుంది, టిఫిన్ చేసావా? అంటే దోశలు వేశానంటుంది. నాకు, మనోజ్ కి టిఫిన్ అవసరం లేదు అంటుంది రోహిణి, ఎందుకని మీనా అడిగితే మేము బయటనుంచి తెచ్చుకున్నాం అంటూ రోహిణి కొంచెం సీరియస్ గానే లోపలికి వెళ్ళిపోతుంది. హాల్లో టేబుల్ పైన టిఫిన్ కవరు పెడుతుంది రోహిణి. మీనాకి ఏమీ అర్థం కాక బయటికి వెళుతుంది.
టిఫిన్ లాగించిన బాలు
రోహిణి షాక్
టేబుల్ మీద టిఫిన్ ఉండడం చూసిన బాలు తన కోసమే మీనా అది తీసుకు వచ్చిందని, అనుకుని టిఫిన్ తింటూ ఉంటాడు. ఇంతలో మనోజ్ ను తీసుకుని కిందకు దిగుతున్న రోహిణి అది చూసి షాక్ అవుతుంది. అది మీకోసం తెచ్చిన టిఫిన్ అని, మీకు మసాలా దోశ ఇష్టమన్నారని నేనే వెళ్లి తీసుకొచ్చాను అంటుంది రోహిణి, ఇంతలో బయట నుంచి వచ్చిన మీనా బాలు టిఫిన్ చేస్తుండడం చూసి అది మన టిఫన్ కాదండి, రోహిణి మనోజ్ కోసం తీసుకువచ్చింది అని చెబుతుంది. తింటున్న బాలు షాక్ అవుతాడు. ఇంతలో రోహిణి, మనోజ్ పాటు ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు.
ఏంటి ఈ దోస పంచాయితీ
అది నా టిఫిన్, నాకోసం రోహిణి తెచ్చిందని మనోజ్ అనడంతో, ఇంకొకటి ఆర్డర్ పెట్టుకో అంటాడు బాలు. లేదా ఇందులోనే సగం తిను అన్నట్టుగా బాలు అనడంతో నీ ఎంగిలి నేను తినాలా అంటాడు మనోజ్. ఆ మాటకి సత్యం, ఏమంటున్నారు రా అన్నదమ్ముల మధ్య అలాంటి బేధాలు ఉంటాయా అంటూ మాట్లాడుతాడు. ఏంటి దోస కోసం ఈ పంచాయతీ అన్నట్టుగా శృతి అంటుంది. నేను మనోజ్ గురించి తీసుకువచ్చాను. ఇంకొకరి గురించి తీసుకువచ్చింది ఎలా తినాలనిపించింది అంటూ రోహిణి ప్రశ్నిస్తుంది.
నిజం చెప్పేస్తానని బాలు హడావిడి
తెలియక నా కోసం తెచ్చిన దోస అనుకుని నేను తింటుంటే, దోస గురించి ఇంత గొడవ చేస్తున్నారు మీకు పద్ధతులు తెలుసా అంటూ రోహిణి ఉద్దేశించి బాలు అందరితో అంటాడు. పద్ధతులు నీకు తెలిస్తే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతావు అని రోహిణి బాలుని ప్రశ్నించడంతో, నాన్న నేను ఇక్కడ ఉండలేను అన్నట్టుగా బాలు ఫీల్ అవుతాడు. ఆపండి అంటూ ప్రభావతి అరుస్తుంది. అది విన్న బాలు లాభం లేదు నాన్న.. నేను ఇంకా ఆపుకోలేను నిజం చెప్పేస్తాను అంటూ నిజం చెప్పబోతాడు. సత్యం కంగారుగా బాలు నోరుమూస్తాడు.
ఏంటి? ఆ రహస్యం
వాడు ఏదో నిజం చెప్తున్నాను అంటున్నాడు చెప్పనియ్యి అంటాడు మనోజ్. ఆ మాటలకి రోహిణి కంగారు పడుతుంది. వీడికి నా గురించి ఏం తెలిసిందో ఏమో, అవన్నీ ఇప్పుడు గాని చెప్తే నా బ్రతుకు బయటపడుతుంది అనుకుంటుంది.. రోహిణి. దోస కోసం నా భర్తని ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ మీనా ఫీలవుతుంది. వదిన తల్లి లాంటిది, పద్ధతులు తెలుసా నీకు అని మాట్లాడుతుంది అసలు మీకు పద్ధతులు తెలుసా అంటుంది మీనా.
దేవుడా నువ్వే కాపాడాలి
బాలు ఇంకొకరి వస్తువుల కోసం ఎప్పుడూ ఆరాటపడడని, అవసరమైతే తనే అందరికీ టిఫిన్స్ తీసుకొస్తాడని అంటాడు సత్యం. అది సరేగాని వాడు ఎందుకు బుసలు కొడుతున్నాడు? పాములాగా మీరు ఎందుకు వాడిని ఆపుతున్నారు అంటూ ప్రభావతి సత్యం అని అడుగుతుంది. బాలు కి తెలిసింది చెప్పకుండా నువ్వే ఆపు దేవుడా అంటూ రోహిణి దేవుని వేడుకుంటుంది. బాలుకి సారీ చెప్తుంది రోహిణి. అక్కడితో గొడవ సద్దుమనుగుతుంది. అందరూ నార్మల్ అవుతారు.
మనోజ్ హోటల్ కి ప్రభావతి
టేబుల్ కింద దూరిన మనోజ్
ప్రభావతి మీనాక్షి బయట మార్కెట్లో నడుచుకుంటూ వస్తూ ఆకలిగా ఉందని టిఫిన్ చేద్దాం అని చెప్పి అక్కడున్న ఒక హోటల్లోకి వెళ్తారు. అందులోనే మనోజ్ సర్వర్ గా పని చేస్తూ ఉంటాడు. తన తల్లి ప్రభావతి, మీనాక్షి రావడం చూసిన మనోజ్ టేబుల్ కిందకు దూరి, మళ్ళీ లేచి కిచెన్ రూమ్ లోకి పరిగెడతాడు. ఇంకొక సర్వర్ రావడంతో వాళ్లు తనకు తెలిసిన వాళ్ళని, ఆర్డర్ నేను తీసుకోలేనని నువ్వే వెళ్లి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు మనోజ్. బలవంతంగా ఒప్పుకుంటాడు సర్వర్.
మరోపక్క కొత్తగా వచ్చిన ఆ మనోజ్ ఎక్కడ? అంటూ మేనేజర్ అరుస్తూ ఉండడంతో ఆ మనోజ్ ఈ మనోజ్ ఒకరేనా అన్నట్టుగా కామాక్షి అనుమాన పడుతుంది. నా కొడుకు ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటుంది ప్రభావతి. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో తెలీక మనోజ్ కిచెన్ లో నుండి సతమతమైపోతూ ఉంటాడు.

ముగింపు
మరోవైపు హాల్లో ఎక్స్పైరీ డేట్ అయిన దోమల మందు కొట్టడంతో సత్యం తీవ్ర అస్వస్థతకు గురవుతాడు. వెంటనే సత్యాన్ని తీసుకుని ఆటోలో మీనా హాస్పిటల్ కి వెళుతుంది. బయట ఉన్న బాలు కి కాల్ చేసి విషయం చెప్తుంది. అది విన్న బాలు కంగారు పడతాడు. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సీరియల్ గురించి, మీకు నచ్చిన పాత్ర గురించి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.








