బాలు, మీనా మళ్లీ పెళ్లి
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/04/2025 గుండె నిండా గుడిగంటలు మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్ లో ఒకటి. ఈ సీరియల్ లో కథ, సీన్స్ అన్నీ సహజమైన పద్ధతిలో ఉండడంతో చూసే ప్రేక్షకులను అమితంగా, ఈ సీరియల్ ఆకట్టుకొంటోంది. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లు అయిన బాలు, మీనా పాత్రలు ప్రేక్షకులకు ఫేవరెట్ పాత్రలులా మారిపోయాయి. ఈ సీరియల్లో నటుడు విష్ణుకాంత్ బాలుగా మీనా భర్తగా నటిస్తున్నాడు. అమూల్య గౌడ మీనాగా నటిస్తోంది. ఇక మరో ముఖ్యమైన ప్రభావతి పాత్రలో అనిలా శ్రీ కుమార్ నటిస్తున్నారు. స్టార్ మా ఛానల్ లో సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది.
ఈ ఎపిసోడ్ హైలైట్స్
- బాలు, మీనాల మళ్ళీ పెళ్లి సీన్స్
- బాలు, మీనాల లవ్ కెమిస్ట్రీ
- కొడుకు, కోడల్ని దండలతో చూసి ప్రభావతి షాక్ అవ్వడం
- ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెడుతూ పేర్లు చెప్పడం
నగల గురించి అడిగిన ప్రభావతి
కంగారు పడిన రోహిణి
రోహిణి గదిలోకి ప్రభావతి వస్తుంది నగలు గురించి మాట్లాడుతుంది. ఏమీ లేకపోయినా మీనానే నగల వేసుకుంటుంది నీకు ఎన్నో నగలు ఉన్నాయి కదా.. ఎందుకు వేసుకుండడం లేదు? అంటూ రోహిణి ని అడుగుతుంది. నీ నగలన్నీ బ్యాంకులో పెట్టావా? లాకర్లో పెట్టావా అని అడగ్గానే, ప్రశ్న ఈవిడే వేసి ఆన్సర్ కూడా చెప్తుంది అనుకుంటుంది రోహిణి. నగలు అమ్మేశానని చెప్తే ఏమైపోతుందో ఏంటో అంటూ కంగారు పడుతుంది.
కనీసం 20 తులాలు
మలేషియా ఫోన్ చేసి మీ నాన్నగారిని ఒక కిలో బంగారం పంపించమని ప్రభావతి అడుగుతుంది. ఆ మాటకి మరింత కంగారుపడుతుంది రోహిణి. నాన్నగారు టూర్ లో బిజీగా ఉన్నారు అని రోహిణి చెప్పగానే, మీ మామయ్యని అడగొచ్చు కదా? కనీసం తక్కువలో తక్కువ ఒక 20 తులాలైనా అడుగు అంటూ బలవంతం చేస్తుంది ప్రభావతి. తను అన్ని వైపుల నుంచి ఇరుక్కుపోతున్నానని రోహిణికి అర్థం అవుతుంది. భగవంతుడా ఏం చేయాలంటూ దేవుడిని తలుచుకుంటుంది. ప్రభావతి ఇంకా బంగారం గురించి మాట్లాడుతూ ఉండడంతో, నాకు పార్లర్ కి వెళ్లే టైం అయిందంటూ అక్కడి నుంచి రోహిణి బయటపడుతుంది.
చిరాగ్గా పార్లర్ కి వచ్చిన రోహిణి
కిలో బంగారం కావాలంట
పార్లర్ కి వచ్చిన రోహిణి అక్కడున్న ఫ్రెండ్ తో.. ఏదైనా ఐలాండ్లోకి పారిపోవాలని ఉంది. మా అత్తగారు పెట్టే టార్చర్ రోజురోజుకు ఎక్కువైపోతుంది అంటూ బాధపడుతుంది. కొత్తగా ఏం ప్రాబ్లం వచ్చింది? అని ఫ్రెండ్ అడిగితే, నాన్నని అడిగి ఒక కిలో బంగారం తీసుకురమ్మంటుంది. లేదా మామయ్యని అడిగి 20 తులాలైనా తీసుకురమ్మని అంటుంది. బంగారం ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు అంటూ తల పట్టుకుంటుంది.
తలపోటు వస్తుంది
ఒక్క అబద్ధం ఎంత దూరం తీసుకొచ్చిందో చూసావా అంటుంది రోహిణి ఫ్రెండ్. ఆ బాలు, మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతేనే గాని ఈ కష్టాలు నుండి నేను గట్టెక్కను అంటుంది రోహిణి. వాళ్లు వెళ్లే లోపు నీ కాపురమే పోయేటట్టుగా ఉంది అంటుంది ఫ్రెండు. లేని మీ మలేషియా నాన్నను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది అంటుంది. ఆ మాటలకి మరింత కంగారుపడిన రోహిణి నాకు కొంచెం టీ పట్టుకురా అంటుంది. టీ ఒక్కటేనా టాబ్లెట్స్ కూడా తీసుకురానా? అంటుంది ఫ్రెండ్. ఏదో ఒకటి తీసుకురా త్వరగా అంటుంది చిరాగ్గా రోహిణి.
గుడికి బయలుదేరిన మీనా, బాలు
విషయం చెప్పకుండా మీనా దాగుడుమూతలు
ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా మీనా బాలుని గుడికి తీసుకొస్తుంది. దేవత గుడిలో తాళి వేసుకోవడానికి ఇంత సస్పెన్స్ లో పెట్టాలా? అంటాడు బాలు. బాలుని మీనా గుడి లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా బాలు బామ్మర్ది శివ ఇంకా మరదలు ఉంటారు. బాలు బావమరిది శివ కాళ్లు కడుగుతాను అంటాడు. కాళ్లు కడగడం దేనికి రా ఏం జరుగుతుంది ఇక్కడ? అంటూ ప్రశ్నిస్తాడు బాలు. కడగనివ్వండి అంటుంది మీనా. బాలు కాళ్ళు శివ కడిగిన తర్వాత బావమరిది కట్నంగా డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. నువ్వేదో ఊరికే కడుగుతున్నావ్ అనుకున్నాను మొత్తానికి నాకే టెండర్ పెట్టావా? అంటూ జేబులోంచి డబ్బులు తీసి శివకి ఇస్తాడు.
కొత్త బట్టలు మార్చుకో
ఇంతలో మీనా వాళ్ళ అమ్మ వస్తుంది. బాలు మరదలు.. బాలు కి బట్టలు ఇచ్చి బట్టలు మార్చుకుని రమ్మంటుంది. ఈ కొత్త బట్టలు ఏంటి? బట్టలు మార్చుకొని రావడం ఏంటి? అంటూ బాలు అయోమయంగా చూసి మొత్తానికి మార్చుకుని వస్తాడు. గుడిలో ఉన్న పెళ్లి పీటల్ని చూసి బాలు ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టు ఉంది అంటాడు మీనాతో. ఎవరిదో కాదు మన పెళ్లి అంటుంది మీనా. మనకే మళ్లీ పెళ్లి జరుగుతుంది అంటుంది. మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నామని, మీ నాన్నగారి బలవంతంతో మీరు, మా అమ్మ బలవంతంతో నేను పెళ్లి చేసుకున్నామని ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్న భార్యగా ప్రేమతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటుంది మీనా.
సందడిగా మీనా, బాలు మళ్ళీ పెళ్లి
ఆనందంలో బాలు, మీనా
శివ, బాలు మరదలు వచ్చి ఇద్దరినీ పీటలపై కూర్చోబెడతారు. ఇద్దరికీ బాసికం, అలాగే బుగ్గన చుక్కా పెడతారు. పంతులుగారు వచ్చి ఇద్దరికీ పెళ్లి తంతు చేస్తూ ఉంటారు. అక్కడే గుడిలో ఉన్న మిగతా అందరూ అక్కడికి వస్తారు. శివ ఫోన్ లో ఈ పెళ్లి తంతు షూట్ చేస్తూ ఉంటాడు. మీనా, బాలు ఇద్దరూ ఒకరితలపై మరొకరు జీలకర్ర బెల్లం పెడతారు. పంతులుగారు తాళి తీసి బాలుకి ఇవ్వడంతో బాలు మీనా మెడలో మళ్లీ తాళి కడతాడు. బాలు కొన్న పుస్తెలతో ఉన్న తాడుని మళ్లీ కడతాడు.

అరుంధతి చూపించిన బాలు
మీనా వాళ్ళ అమ్మ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ పూలదండలు మార్చుకుంటారు. మీనా కాలికి బాలు మెట్లు తొడుగుతాడు. అగ్నిసాక్షిగా ఇద్దరు ప్రదక్షిణలు చేస్తారు. బాలు మీనా చేయి పట్టుకుని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. తాళి కళ్ళకు ఒద్దుకుంటుంది మీనా. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఈ ఆలోచన నీకెందుకొచ్చిందో గాని నిజంగా మన మంచికే జరిగింది అంటాడు బాలు. ఇవన్నీ ఇలాగే వేసుకుని ఇంటికి వెళ్తే మా అమ్మకి హార్ట్ ఎటాక్ వస్తుంది. పూలదండలతో మాత్రమే ఇంటికి వెళ్దామని బాలు అంటాడు. ఓకే అంటుంది మీనా.
పూలదండలతో వచ్చిన మీనా,బాలు
షాక్ లో ప్రభావతి
బాలు, మీనా పూలదండలతో ఇంట్లోకి వస్తారు. అది చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. గబగబా ఇంట్లో అందరినీ పిలుస్తుంది. సత్యం, మనోజ్, రోహిణి అందరూ పూలదండలతో ఉన్న బాలు, మీనాలను చూసి షాక్ అవుతారు. ఏంట్రా ఇది అని సత్యం అడిగితే, నా పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చాను.. నా భార్యతో రెండోసారి నాకు పెళ్లి జరిగింది అంటాడు బాలు. ఈవేళ మీ పెళ్లి రోజు కూడా కాదు కదా అంటాడు బాలు తమ్ముడు. ఇదంతా చూసి ప్రభావతికి కళ్ళు తిరుగుతాయి. పుస్తెలతాడు దేవుడి ముందు వేద్దామని గుడికి వెళ్లానని అక్కడ మా అత్తగారు బావమరిది వీళ్ళందరూ కలిసి మా ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేసి పంపించారని సత్యంతో అంటాడు బాలు.
నీళ్ళలో కారం కలపాలా?
కట్నం ఎంత ఇచ్చారు ఏంటి? అంటుంది ఎటకారంగా ప్రభావతి. మమ్మల్ని పిలిస్తే మేము వచ్చేవాళ్ళంగా అంటాడు సత్యం. నాకు కూడా అక్కడికి వెళ్లి నాకే తెలిసింది అంటాడు బాలు. భార్యతో పెళ్లి భార్యతో మళ్ళీ పెళ్లి అని ఎక్కువసార్లు అనకురా వినడానికి బాలేదు అంటుంది ప్రభావతి. శృతి ఎర్ర నీళ్ళతో దిష్టి తీయమ్మ అంటాడు సత్యం. ఆ నీళ్లు ఎర్రగా అవ్వాలంటే అందులో కారం కలపాలా? అని అడుగుతుంది శృతి. ఆ మాటకి మతి పోయినట్టు చూస్తుంది ప్రభావతి. రోహిణి ఎర్ర నీళ్లు జోలికి వెళ్ళవద్దు గాని, హారతి తీసుకొచ్చి ఇవ్వమ్మా అంటాడు సత్యం. రోహిణి హారతి తీసుకొస్తుంది.
కుడికాలు ముందు పెట్టండి
బాలు, మీనాలకి హారతిస్తుంది. ఇద్దరూ లోపలికి అడుగు పెడుతుంటే, ముందుగా మీ పెళ్లి జరిగినప్పుడు మీ పేర్లు సరిగ్గా చెప్పలేదని, మళ్లీ పేర్లు చెప్పమని సత్యం అంటాడు. నేను.. మా ఆవిడ మీనా వచ్చాము అంటూ సిగ్గుపడుతూ చెప్తాడు బాలు. నేను.. మా ఆయన బాలు వచ్చాం అంటుంది మీనా. వీళ్ళ ఓవరాక్షన్ ఏంట్రా బాబు అన్నట్టుగా లుక్ ఇస్తుంది ప్రభావతి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మని రోహిణి అంటుంది.
అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నాం
ఎందుకు ఇంత హడావిడి చేశారు మీ అమ్మ వాళ్లు అంటూ సత్యం మీనాని అడుగుతాడు. ఆరోజు నేను ఆవేశంలో మంగళసూత్రం తీసేసాను కదా.. ఆ రోజు నుంచి నా మనసు ఏమి బాగోలేదు మావయ్య అంటుంది మీనా. ఏదైనా కీడు జరుగుతుందని భయపడి, ఈ విధంగా మళ్లీ పెళ్లి చేసుకున్నాము. ఇదే అసలైన పెళ్లి అంటుంది. ఆ రోజు మేము ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం.. ఇప్పుడు ఇష్టంతో చేసుకున్నాం అంటుంది మీనా.
ముగింపు
బాలుని దేవుడి దగ్గరికి పటాల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇద్దరూ దండం పెట్టుకుంటారు. తర్వాత అత్తయ్య, మావయ్య ఆశీర్వాదం తీసుకుందాం పదండి అంటూ, ప్రభావతి ని, సత్యం ఇద్దరినీ ఒకచోట నిలబెడతారు. ఇద్దరూ పాదాలకు నమస్కరిస్తారు. నీ పెళ్ళాంతో మళ్లీ పెళ్లయినందుకు సంతోషం లేగండి అంటుంది ప్రభావతి. సత్యం సంతోషంగా ఉండండి అని దీవిస్తాడు. రేపటి ఎపిసోడ్ మీనా, బాలు ల రోమాన్స్ తో మొదలు కాబోతుంది. ఈ సీరియల్ మీకు ఎలా అనిపిస్తోందో క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.








