గుండెనిండా గుడిగంటలు సీరియల్ 25/04/2025

Table of Contents

సీరియల్ టైమింగ్స్

“గుండెనిండా గుడిగంటలు” సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతోంది. విజయవంతంగా మంచి టిఆర్పి రేటింగ్స్ తో ఈ సిరియల్ ముందుకు సాగుతోంది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో నా రివ్యూ లో చూడండి.

నటీనటుల వివరాలు

మీనాఅమూల్య గౌడ
జ్యోతి గౌడమౌనిక
విష్ణు కాంత్బాలు
అనీలా శ్రీ కుమార్ప్రభావతి
ఉష శ్రీపార్వతి
యశ్వంత్ కనిగిరిమనోజ్
ఛత్రపతి శేఖర్సాంబయ్య
భరత్శివ
డబ్బింగ్ జానకిసుశీల
భాను ప్రకాష్సంజు

ఈరోజు ఏం జరిగిందంటే..

బావ, బావమరుదుల సవాల్

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 25/04/2025 కారు దిగిన తర్వాత పొగరుగా డబ్బులు విసిరేసి వెళ్లిపోతున్న సంజయ్ ని పిలుస్తాడు బాలు. మర్యాదగా కింద వేసిన డబ్బుల్ని తీసి కళ్ళకు అద్దుకుని, తిరిగి నాకు ఇవ్వకపోతే వీళ్ళందరూ ముందు దొర్లించి దొర్లించి కొడతాను అంటాడు. ఆ మాటలకి భయపడ్డ సంజయ్ తిరిగివచ్చి డబ్బులు తీసి, బాలు చేతిలో పెడతాడు. నేను అడిగింది ₹200 అని బాలు అంటే.. ముష్టి తీసుకో అంటాడు. నేను ముష్టి తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుగా అంటే, మళ్ళీ భయపడిన సంజయ్ మిగిలిన డబ్బులు బాలు దగ్గర తన ఇంటి వైపు ముందుకెళ్ళిపోతాడు. ఇంతలో సంజయ్ ని పక్కింటి ఆయన పిలుస్తాడు. సంజయ్ అటువైపు వెళ్ళగానే మౌనికను బాలు ప్రశ్నిస్తాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 25/04/2025

ఒట్టేసి నిజం చెప్పు

అన్నయ్య.. ఒట్టులు అవి ఎందుకు అన్నట్టుగా మౌనిక మాట దాటవేస్తుంది. బాలు తల మీద ఒట్టు వేయించుకుంటున్న దృశ్యాన్ని చూసిన సంజయ్, ఇది గాని ఇప్పుడు నిజం చెప్పిందంటే నాకు తోలు తీస్తాడని, భయపడతాడు. వెంటనే మౌనిక దగ్గరికి వెళ్లి ఇంకా ఏంటి మాటలు లోపలికి రా అంటూ మౌనికని లాక్కుని వెళ్ళిపోతాడు.

నిజంగా నీ తలకు తగిలిన దెబ్బలు మామూలుగానే తగిలాయా? లేకపోతే సంజయ్ వల్ల ఏమన్నా జరిగిందా? నిజం చెప్పు మౌనిక అని అడుగుతాడు బాలు. నేనే జారిపడ్డానని సంజయ్ ఏం చేయలేదని అబద్ధం చెప్తుంది మౌనిక. నీకు ఏదైనా జరిగితే వీడికి మామూలుగా ఉండదంటూ సంజయ్ ని ఉద్దేశించి అంటాడు బాలు. నీకే కష్టం వచ్చినా గాని ఈ అన్నయ్య ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు అంటాడు. అయినప్పటికీ బాలుకి కొంచెం అనుమానం ఉండడంతో ప్రమాణం చేసి తన మీద ఒట్టేసి నిజం చెప్పమంటాడు.. బాలు.

చెప్పుకోలేని బాధలో మౌనిక

మౌనికని.. సంజయ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ ఉంటే, బాధతో వెనక్కి తిరిగి చూస్తుంది మౌనిక. బాలు కూడా అలా బాధగా చూస్తూ ఉండిపోతాడు. మౌనిక చెప్పింది నిజమై ఉంటుంది లేకపోతే తనే కొట్టి, తనే హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్తాడు. సంజయ్ కి నా మీద కోపంగానీ, తన చెల్లి మీద ప్రేమే అని బాలు మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు.

హోటల్ లో మనోజ్

చదువుకి, పనికి సంబంధం లేదు

మనోజ్ హోటల్ కిచెన్లో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో మనోజ్ కొలీగ్ వచ్చి.. మనోజ్ ఏంటి చూస్తున్నావ్ అని అడగ్గానే, రెండు మూడు జాబ్స్ కి అప్లై చేశాను, వాటికి ఇంకా రిప్లై రాలేదు అంటాడు. ఎక్కడ జాబ్ చేస్తూ వేరే జాబ్ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు కొలీగ్. ఏం చేస్తాం నా కర్మ పదవ తరగతి చదివిన వాళ్ళతో పని చేయాల్సి వస్తోంది అంటాడు మనోజ్. ఎంత చదివామన్నది కాదు, మన పనిని ఎంత నిజాయితీగా చేస్తున్నామా అన్నది ముఖ్యం అంటాడు కొలీగ్. ఇంతలో మేనేజర్ వచ్చి ఏంటి ఇక్కడ మాటలు.. అక్కడ కస్టమర్స్ వచ్చారు వెళ్ళండి.. అంటూ వాళ్ళిద్దర్నీ వెళ్ళమంటాడు.

చిత్తు కాగితాల వాడి చేతిలో..

మనోజ్ చిత్తు

రోడ్డుమీద చిత్తు కాయితాలు ఏరుకునే ఒకడు మనోజ్ పనిచేస్తున్న హోటల్ వైపు వచ్చి, హోటల్ కి వెళ్లి ఏదైనా తినాలనుకుంటాడు. గబగబా లోపలికి వస్తుంటే అక్కడ మేనేజర్ ఆపి ఇక్కడ నీకు ప్రవేశం లేదని చెప్తాడు. ఇది కాస్ట్లీ హోటల్ అని ఇక్కడ నువ్వు కొనలేవని అంటాడు. దానికి హర్ట్ అయిన చిత్తు కాగితాలు వాడు.. వెంటనే జేబులోంచి నాలుగైదు క్రెడిట్ కార్డులు తీసి చూపిస్తాడు. ఇవి సరిపోతాయా? అని మేనేజర్ ని అడగగానే.. హోటల్ మేనేజర్ వాడ్ని కూర్చొని చెప్తాడు. ఇంతలో మనోజ్ వాడి దగ్గరికి ఆర్డర్ తీసుకోవడానికి వస్తాడు. చూసి షాక్ అవుతాడు. ఏం కావాలి సార్ అనగానే కేజీ చిత్తు కాగితాలు 1/2 కేజీ అట్టలు కావాలి అంటూ ఎటకారం చేస్తాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 25/04/2025

వీడు చిత్తు కాగితాల వాడు

మనోజ్ ని గుర్తుపట్టిన చిత్తు కాగితాలు ఏరుకునే వాడు.. నువ్వు పార్కులో పడుకునేవాడు వాడవు కదా, అప్పుడే నాకు అసిస్టెంట్ గా రమ్మంటే.. నేను పెద్ద జాబ్ చేస్తాను అన్నావు. మరి ఇప్పుడేంటి? హోటల్లో పని చేస్తున్నావ్ అని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతాడు. ఆ మాటకి కోపం వచ్చిన మనోజ్.. ఎవడ్రా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ మనోజ్ వాడి కాలర్ పట్టుకుని బయటకు తోయపోతాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

కస్టమర్ కి గౌరవం ఇవ్వు

ఇంతలో మేనేజర్ వచ్చి మనోజ్ ని ఆపుతాడు. వీడు ఎవడో తెలుసా రోడ్డుపైన చిత్తు కాగితాలు వేరుకునేవాడు అంటాడు మనోజ్. అతను బయట ఏం చేస్తున్నా కానీ మన హోటల్ కి వచ్చాడు కాబట్టి మన కస్టమర్.. అతన్ని గౌరవించాలి. సారీ సార్ అంటాడు మేనేజర్. కాలర్ పట్టుకుంది మీ వాడైతే, మీరెందుకు సారీ చెబుతున్నారు. ఇతనితో సారీ చెప్పించండి అంటాడు వాడు.

సారీ చెప్పిన మనోజ్

మనోజ్ సారీ చెప్పు అంటాడు మేనేజర్. సారీ సార్ ఏం కావాలి అని ఆర్డర్ తీసుకుంటాడు మనోజ్. హోటల్ లో ఉన్న లిస్ట్ అంతా మనోజ్ చెప్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వాడు రవ్వకిచ్చిడి కావాలని చెప్తాడు. మనోజ్ కౌంటర్ దగ్గరికి వచ్చి రవ్వ కిచిడి ఒకటి ఆర్డర్ చెప్పు అని కౌంటర్లో ఉన్న వ్యక్తిని అడగ్గానే, రవ్వ కిచిడి లేదని చెప్తాడు. అయితే వెళ్లి నువ్వే కస్టమర్ కి చెప్పు అంటాడు మనోజ్. నేను ఎందుకు చెప్తాను. నువ్వే చెప్పుకో వెళ్లి అంటాడు.. కౌంటర్లో వ్యక్తి. వెనక్కి వచ్చిన మనోజ్ రవ్వ కిచిడీ లేదని వాడితో చెప్పడంతో, నా టైమంతా వేస్ట్ అయిందని సీరియస్ అవుతాడు చిత్తు కాగితాలవాడు. వెంటనే మేనేజర్ వచ్చి, నేను చేపిస్తాను వేడివేడిగా 5 నిముషాలు ఆగండి అంటాడు.

రోహిణి ఫోన్

ఇంతలో రోహిణి మనోజ్ కి ఫోన్ చేస్తుంది. మనోజ్ ఎక్కడున్నావని అడిగితే ఆఫీసులో ఉన్నానని అబద్దం చెప్తాడు. ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదా పనిమీద కాకుండా తిండి మీద కూడా కాస్త ధ్యాస పెట్టు అంటుంది రోహిణి. మీ ఆఫీస్ పక్కన ఏదైనా హోటల్ ఉందా అని అడుగుతుంది. ఆ మాటకి కంగారు పడతాడు మనోజ్. కొంపదీసి ఇక్కడకి గాని వచ్చిందా ఏంటి? అన్నట్టు. ఉంది అని చెప్పడంతో ముందు అక్కడ తిని, తర్వాత పని చూసుకో అని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి.

బంగారం తో ఇంటికి వచ్చిన బాలు

మీనా కోసం పుస్తెలు

ఇంట్లో సోఫాలో కూర్చుని ఉంటాడు సత్యం. ఇంతలో బయట నుంచి వచ్చిన బాలు, నాన్నఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది.. అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయిందా? అని అడుగుతాడు. నా జీవితానికి అంత అదృష్టం ఎక్కడిది రా బాబు అంటాడు సత్యం. అవునులే పాపం అన్నట్టు జాలి పడతాడు బాలు. వెంటనే బాలు.. అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ అందరిని రమ్మని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏమైందంటూ హాల్లోకి వస్తారు. ఎందుకురా అలా అరుస్తున్నావని ప్రభావతి అడగ్గానే వాడు నీతో ఏదో మాట్లాడాలి అంటున్నాడు అని సత్యం అంటాడు.

నీ అవమానానికి నా సమాధానం

నువ్వు ఆఫీసులో బిజీగా ఉన్నానని చెప్పావు.. అప్పుడే వచ్చేసావ్ ఏంటి మనోజ్ అంటుంది రోహిణి మనోజ్ తో. ఈరోజు పని ఎక్కువ చేశాను, కొంచెం తలనొప్పిగా ఉందని ముందుగానే వచ్చేసాను.. అంటాడు మనోజ్. ఆ మాట విన్న బాలు తల లేని వాళ్ళకి కూడా తలనొప్పి వస్తుందా? అని ఎటకారంగా మాట్లాడుతాడు. ఇంతలో సత్యం కల్పించుకుని.. ఇంతకీ నువ్వు ఎందుకు వీళ్ళందర్నీ పిలిచావో అది చెప్పరా అంటాడు. ఈ ప్రభావతి అమ్మ.. నా భార్య ఆ పుట్టింటి నుంచి బంగారం తీసుకురాలేదని చాలా ఘోరంగా అవమానించింది. అవునా కాదా? అంటాడు బాలు. ఇంట్లో అందరూ బాలు చెప్పింది నిజమే అన్నట్టు అవును అంటారు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 25/04/2025

వదిన దృష్టిలో నువ్వు హీరో అన్నయ్య

అన్నయ్యకి తమ్ముడు పొగడ్తలు

నా భార్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను. నా భార్య కోసం బంగారం తీసుకొచ్చాను.. అంటూ జేబులోంచి పుస్తెలు తీసి అందరికి చూపిస్తాడు బాలు. అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. సత్యం చేతిలోకి తీసుకుని చూస్తూ ఆనందపడతాడు. బాలు ప్రభావతి వైపు చూసి కాలర్ ఎగరెస్తాడు. నేను కష్టపడ్డ డబ్బులతో అప్పుడు మా చెల్లెలుకి కొన్నాను, ఇప్పుడు నా భార్య కొన్నాను అంటాడు. బాలు.. అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య అంటూ పొగుడుతాడు చిన్న తమ్ముడు. వదిన దృష్టిలో నువ్వు హీరో అయ్యావు అంటాడు చిన్న తమ్ముడు.

నాకు చాలా ఆనందంగా ఉంది

చాలా మంచి పని చేసావు బాలు, నా కోడలు పసుపు తాడుతో ఇంట్లో తిరుగుతుంటే నాకు చాలా బాధగా ఉండేది. ఈరోజు నువ్వు బంగారం కొని, నీ భార్య నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టావ్,, అంటూ బాలుని సత్యం పొగుడుతాడు, ఈ జన్మలో బంగారం కొనలేను, షష్టిపూర్తి అయిన కానీ కొనలేడని ఇంట్లో ఎవరో అన్నారు అంటూ ప్రభావతిని ఉద్దేశించి ఎటకారం చేస్తాడు బాలు. మీనా చాలా ఆనందపడుతుంది.

మీనా చేతికి బంగారం ఇస్తాడు బాలు. అవి చూసిన మీనా బాలువైపు ప్రేమగా చూస్తుంది. చూసారా అత్తయ్య.. ఆయన పంతానికి పోతే ఈ రోజే బంగారం కొంటారని చెప్పాను. నేను పెట్టుకున్న నమ్మకాన్ని మా ఆయన నిలబెట్టాడు.. అంటూ ప్రభావతితో మీనా అంటుంది. మీ కొడుకుని మీరే తక్కువ చేసి మాట్లాడకండి. కారు డ్రైవర్లు కూడా చాలా గొప్పగా బతుకుతున్నారంటూ మీనా చెబుతుంది.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

ఇంతకంటే సౌభాగ్యం ఇంకేముంది?

మీనా మాటలు విన్న బాలు థాంక్యూ పూలగంప అంటాడు. వీడేంట్రా బాబు ఆకాశంలో విహరిస్తున్నాడు అన్నట్టుగా ప్రభావతి ఎటకారం చేస్తూ.. బోడి తులం కూడా లేదు. పెద్ద బంగారం షాప్ కొనేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడేంటి అంటుంది బాలుని. ఇంతలో శృతి కల్పించుకుని, వాళ్ళు బాగానే ఉన్నారు మీరే ఓవరాక్షన్ చేస్తున్నట్టుగా ఉంది ఆంటీ అంటుంది. నేను తాళి మాత్రమే కావాలని బలంగా కోరుకున్నాను.. అది నాకు దక్కింది.. అంటూ బాలుని ఉద్దేశించి మీనా అంటుంది. మీనా నీకు ఇది నచ్చిందా అని బాలు అడగగానే, ఇంతకంటే సౌభాగ్యం ఇంకేం ఉంటుందండి అంటుంది మీనా.

బంగారం కొనటానికి డబ్బులు ఎక్కడివి?

అబద్ధం చెప్పిన బాలు

మీనా బాలు తెచ్చిన బంగారాన్ని దేవుడి దగ్గర పెట్టి, దండం పెట్టుకుంటుంది. వీడిని నమ్ముకుంటే జీవితాంతం ఆ పసుపు కొమ్ముతోనే, ఆ పసుపు తాడుతోనే ఉండాలి.. అని ప్రభావతి అన్న మాటలు మీనా గుర్తు చేసుకుంటుంది. దానికి సమాధానంగా బాలు బంగారం తెచ్చి ఇవ్వడాన్ని సంతోషిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన బాలుని ఏవండీ అంటూ వాటేసుకుంటుంది. అందరి ముందు నా పరువు నిలబెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది.

ఆనందభాష్పాలు

మీనా నీ మొహం లో సంతోషం చూడడానికే నేను ఇలా చేశాను.. కన్నీళ్లు పెట్టుకోకు అంటాడు బాలు. ఇవి కన్నీళ్లు కాదు ఆనందభాష్పాలు అంటుంది మీనా. అందరి ముందు పుస్తెలు దర్జాగా మెడలో వేసుకోవచ్చు కదా అని బాలు అనగానే, ఎప్పుడు పడితే అప్పుడు ఇవి వేసుకోకూడదు అని మీనా చెబుతుంది.

మా ఆయన బంగారం

ఇంతకీ బంగారం కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీనా అడగ్గానే.. కారులో ఒక కస్టమర్ తన బ్యాగు మర్చిపోయాడని, అందులో డబ్బులు ఉన్నాయని, అవి దేవుడే ఇచ్చాడని భావించి ఆ డబ్బులతో బంగారం కొన్నానని బాలు చెప్తాడు. పరాయి వాళ్ళ డబ్బులు మీరు అసలు తీసుకోరని నాకు తెలుసు.. నాటకాలు ఆడకండి అని మీనా అంటుంది. నిజంగా మీకు డబ్బు దొరుకుంటే, వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళకే ఇస్తారు. లేకపోతే పోలీస్ స్టేషన్లో ఇస్తారు అంటుంది మీనా. మా ఆయన బంగారం అంటుంది. అయితే కరిగించుకో చాలా నగలు చేయించుకోవచ్చు అంటాడు బాలు.

రోహిణికి వార్నింగ్ మెసేజ్

త్రుటిలో తప్పించుకుంది

తన గదిలో పార్లర్ కి వెళ్లడానికి రెడీ అవుతున్న రోహిణికి ఫోన్లో వాయిస్ మెసేజ్ వస్తుంది. అందులో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి వార్నింగ్ ఇస్తాడు. నాకు రావలసిన డబ్బులు త్వరగా ఇవ్వకపోతే ఈ వాయిస్ మెసేజ్ మీ అత్తయ్యకి వెళ్తుంది నీ గతం బయటపడుతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఆ గదిలోకి ప్రభావతి వచ్చి ఏంటి ఆ మెసేజ్ అని అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య.. మీ గురించి కాదు ఇది వేరే మ్యాటరు అన్నట్టుగా అబద్ధం ఆడుతుంది రోహిణి. మీనా కి బాలు చిన్న బంగారం కొన్నా గాని. కిలో బంగారం కొన్నట్టుగా మీనా ఫీల్ అయిపోతుంది అంటుంది ప్రభావతి.

నగలు వేసుకో

బాలు కి అంత బంగారం కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. మీనా షాపులో బిజినెస్ బాగుంది కాబట్టి అందులో నుంచే డబ్బులు తీసి ఇచ్చి ఉంటుంది అంటుంది రోహిణి. బాలు.. మనోజ్ కంటే గొప్పవాడుగా కనపడాలని ఇలా చేసి ఉంటుంది అంటుంది రోహిణి. వాళ్ళ సంగతి అలా వదిలేయ్.. ఏమీలేని మీనానే అంత హడావుడి చేస్తుంటే, అన్నీ ఉన్న నువ్వు బంగారపు నగలు ఎందుకు వేసుకోవు? వెంటనే తీసుకుని వేసుకో అంటుంది ప్రభావతి. ఆ మాటకి రోహిణి కంగారు పడుతుంది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 25/04/2025

తర్వాత ఎపిసోడ్ ప్రోమో

గుడిలో మళ్ళీ పెళ్లి

రేపటి ఎపిసోడ్ లో బాలు, మీనా గుడికి వెళ్తారు. మీనా కి, బాలు కి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరుండి మళ్లీ పెళ్లి చేసినట్టుగా చేస్తారు. బాలు మంగళసూత్రాన్ని మీనా కి కడతాడు. రేపటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి.

Leave a Comment