గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

ఎపిసోడ్ హైలెట్స్

  • గుణా కి వార్నింగ్ ఇచ్చిన మీనా
  • మీనా పై పగ పట్టిన గుణ
  • మౌనిక మిస్సింగ్, సంజయ్ ని కొట్టిన బాలు
  • మీనాకి నిజం చెప్పిన రాజేష్
  • వడ్డీ వ్యాపారి చేతిలో బుక్ అయిన మనోజ్

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025 ప్రతిరోజు ఒక కొత్త మలుపుతో, ఆకట్టుకునే సన్నివేశాలతో మాటీవీలో ప్రసారమవుతున్న“గుడినిండా గుడిగంటలు” సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతలు, అలకలు మధ్య ప్రతి ఒక్కరూ తమను తాము పాత్రల్లో చూసుకునే విధంగా ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో కథ ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

బోనులో బాలు

ప్రభావతి ప్రశ్నల వర్షం

బాలు తన కారు అమ్మేసిన విషయం తెలిసిన ప్రభావతి బాలుని బోనులో నిలబెట్టి ప్రశ్నల మీద, ప్రశ్నలు వేస్తుంది. కార్ అమ్మేసి డబ్బు ఏం చేసావో చెప్పు? అంటూ నిలదీస్తుంది. రోహిణి, మనోజ్, రవి, శృతి, మీనా, సత్యం అందరూ అక్కడే ఉంటారు. చాలా అవసరమయ్యే కారు అమ్మేయాల్సి వచ్చిందనీ చెప్తాడు బాలు. ఆ కారుని ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్నామని కాబట్టి అది అందరికీ చెందినదని, సమాధానం చెప్పాల్సిందేనని ప్రభావతి పట్టు పడుతుంది. దానికి బాలు ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్ ఉందని అది బయట అవి బయటపెట్టానంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ బోన్ లో నిలబడాల్సి వస్తుందని రోహిణి ఉద్దేశించి అంటాడు.

కారు అమ్మితే మూడు నాలుగు లక్షలు వస్తుంది. ఆ డబ్బులు ఏం చేస్తావ్? అని మనోజ్ బాలుని అడుగుతాడు. నువ్వు కూడా 40 లక్షలు మింగేసావు కదా? ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే, నేను డబ్బులు మరుక్షణంలో తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడతాను అంటాడు బాలు. అటు తిరిగి ఇటు తిరిగి విషయం నా మీదకు వచ్చింది ఏంటి అని మనోజ్ అనుకుంటాడు. నాకు సంబంధం లేదు ఈ విషయంలో అన్నట్టుగా మనోజ్ అక్కడ నుంచి జారుకుంటాడు. ఆ కారుని ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్నారు కాబట్టి, ఆ పత్రాలని తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు బాలు.

అది సరే నీకు కార్ అమ్మేసే కష్టం ఎందుకు వచ్చింది? అసలు కారు ఎందుకుఅమ్మేసావ్ అదైనా చెప్పరా అంటూ సత్యం బాలుతో అంటాడు. చాలా అవసరమయ్యే చేసాను నాన్న, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్ను ఏమీ అడక్కండి అంటూ వెళ్ళిపోతాడు. బాలు వెళ్లిపోయిన తర్వాత ఇక పంచాయతీ పెట్టింది చాలు. ఈ సామాన్లన్నీటిని ఎక్కడివి అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళిపోతాడు సత్యం వెళ్లి పోతాడు. చివరికి రోహిణి, ప్రభావతి ఉంటారు. ఎన్నాళ్ళు తప్పించుకుంటాడో చూద్దాం అని బాలుని ఉద్దేశించి రోహిణి తో ప్రభావతి అంటుంది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025

ముందు వాడి సంగతి చూడు

మీనాకి బాలు సలహా

మీనా వంట గదిలో ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి మంచినీళ్లు తాగి వెళ్లిపోబోతాడు. ఏమండీ ఆటో అని మీనా అనగానే, ఆటో ఎందుకు తోలుతున్నారు? కారు ఎందుకు అమ్మేశారు? ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఇవేగా నీ ప్రశ్నలు అని బాలు మీనాతో అంటాడు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంటుంది మీనా. నాకు అంత టాలెంట్ లేదని, ఎప్పుడు చూడు నా మీద ప్రశ్నల వర్షం వేయడమేనా? మీ తమ్ముడు బేవర్స్ బ్యాచ్ తో తిరుగుతూ, అడ్డమైన పనులన్నీ చేస్తున్నాడు కదా వాడిని ఎప్పుడైనా అడిగావా? అంటూ శివ ప్రస్తావన తీసుకొస్తాడు.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

వాడు గుణ దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని, మిగతా పనులేవీ వాడికి సంబంధం లేదని మీనా అంటుంది. మగ పిల్లవాడు సంపాదిస్తే చాలు. బయట ఏం చేసినా, పట్టించుకోరు. అదే ఆడపిల్ల అయితే ఇలా వదిలేస్తారా? ఎన్నో ప్రశ్నలు వేసి విసిగిస్తారు అంటాడు బాలు. నేను మీ గురించి అడుగుతుంటే మా తమ్ముడు గురించి చెప్తారేంటి? మీరు ఎంతో అవసరం ఉంటే గాని, మీ నాన్నగారు కొనిచ్చిన కారుని అమ్మరు. ఏమైందో చెప్పండి? అంటుంది. సమయం వచ్చినప్పుడు చెప్తానని, అప్పటివరకూ అడగొద్దని మీనా ఆపుతున్నా ఆగకుండా బాలు వెళ్లిపోతాడు.

వ్యక్తిత్వం మీద కొట్టు

సంజయ్ కి తండ్రి సలహా

మరోవైపు మౌనిక అత్తవారింట్లో టీ తీసుకొచ్చి మామగారికి ఇస్తుంది. సంజు ఎక్కడికి వెళ్ళాడు? అని ఆయన అడిగితే, తెలియదు అంటుంది మౌనిక. మొగుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? అంటూ సీరియస్ అయ్యి అవమానించి మాట్లాడతాడు. మౌనిక హర్ట్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో సంజయ్ రావడంతో, మౌనిక ఇంట్లో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నానని చెప్పావు. ఇప్పుడు ఏం చేస్తున్నావ్ నువ్వు? దీన్ని ఇంటి నుండి బయటకు పంపే ప్లాన్స్ ఏమైనా వేస్తున్నావా? అని సంజయ్ ని అడుగుతాడు తండ్రి. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న అని సంజయ్ అనగానే, తండ్రి సీరియస్ అవుతాడు.

ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు. రేపు మన బిజినెస్ వ్యవహారాలు ఎలా చూస్తావు? నా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎలా గెలుస్తావు? ఆడది మెంటల్ టార్చర్ కి, మ్యాన్ హాండ్లింగ్ కి లొంగడం లేదంటే వ్యక్తిత్వం మీద కొట్టాలి. అప్పుడే సరిగ్గా తగులుతుంది. అర్థమైంది కదా? ఏం చేయాలో అంటూ సంజయ్ తో అంటాడు తండ్రి. సంజయ్ అర్థమైనట్టుగా తల ఊపుతూ, ఇక నేను చూసుకుంటాను నాన్న, మీరు ఆందోళన పడకండి అంటూ తండ్రికి మాట ఇస్తాడు.

మీనాకి నిజం చెప్పిన రాజేష్

బాలు నిజంగా దేవుడు

బాలు ఫ్రెండ్ రాజేష్, ఇంకొక డ్రైవర్ టాక్సీ స్టాండ్ లో ఉంటారు. మీనా అక్కడికి వస్తుంది. బాలు తన కారు అమ్మేసి ఆటో నడుపుతున్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని రాజేష్ ని అడుగుతుంది. గుణాకి, బాలు కి జరిగిన గొడవ మొత్తం రాజేష్ మీనాతో చెప్తాడు. మా కుటుంబాలు బాగుండాలని బాలు తన కారు అమ్మేసి ఆ అప్పులు తీర్చాడు అని రాజేష్ అంటాడు. పక్కనే ఉన్న డ్రైవర్ కూడా బాలు గురించి గొప్పగా చెప్తాడు. నువ్వు బాలుని అనవసరంగా ఏమీ అనవద్దు అని మీనాతో అంటాడు రాజేష్. ఆయన మనసు నాకు తెలుసు. ఎదుటివాళ్ళు బాగుండాలనుకునే మనస్తత్వం ఉన్నవాడు. ఇంత గొడవకి కారణమైన గుణాని వదిలిపెట్టను, అంటూ సీరియస్ గా అక్కడినుండి మీనా వెళ్లిపోతుంది.

గుణ ఆఫీస్ కి మీనా

నడిరోడ్డులో చెప్పుతో కొడతా

ఆవేశంతో మీనా, గుణ ఆఫీస్ కి వస్తుంది. మా ఆయనని కాళ్లు పట్టుకోమని అడిగావట. నువ్వెంత? నీ స్థాయి ఎంత? అంటూ వచ్చి రాగానే గుణ పై ఆవేశపడుతుంది. గుణ కంగారుపడతాడు. అది కాదు అక్క అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మా ఆయన జోలికి వస్తే, నేనే చెప్పు తీసుకుని నిన్ను నడిరోడ్డులో కొడతానని వార్నింగ్ ఇస్తుంది. మీనా వెళ్లిపోయిన తర్వాత ఏ మొగుడి కోసం అయితే ఇలా రెచ్చిపోతుందో వాడిని మీనాకి దూరం చేస్తానని, శివ సహాయంతో ఇద్దరి మధ్య అడ్డుగోడ కడతానని వాళ్ల కాపురాన్ని విడదీస్తానని గుణ తన అసిస్టెంట్స్ తో అంటాడు. పగ పెంచుకుంటాడు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 22/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 22/05/2025

గాల్లో మేడలు

కొంచెం తగ్గించమన్న రోహిణి

మనోజ్, రోహిణి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కెనడా వెళ్లిన తర్వాత నయాగరా ఫాల్స్ చూడాలని, కారు కొనాలని, ఇల్లు కట్టాలని ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. అది విన్న రోహిణి గాల్లో మేడలు కట్టొద్దు అంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంతలో మనోజ్ కి 10000 అప్పిచ్చిన వ్యక్తి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. అతన్ని చూసి మనోజ్ కంగారు పడతాడు. బయటికి వెళ్లి మాట్లాడదామని అంటే, వినకుండా అక్కడే కూర్చుంటాడు. ఇంతలో రోహిణి వచ్చి అడుగుతుంది. మనోజ్ తీసుకున్న అప్పు గురించి చెప్తాడు. రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాక మనోజ్ సైలెంట్ అయిపోతాడు.

రేపటి ప్రోమో

మౌనికని ఎలా అయినా సరే, ఇంటిలో నుండి గెంటేయాలని చూస్తున్న సంజయ్ మౌనిక వ్యక్తిత్వం మీద గట్టిగానే దాడి చేసినట్టుగా అనిపిస్తుంది. మౌనిక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మౌనికని వెతుక్కుంటూ సంజయ్ మౌనిక ఫోటో చూపించి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. మౌనిక మిస్ అయిందనే విషయం బాలు తెలుసుకుంటాడు. సంజయ్ ఇంటికెళ్లి సంజయ్ ని కొడతాడు. సంజయ్ తల్లి, తండ్రి అడ్డు వస్తున్న వినకుండా అక్కడే ఉన్న చాకు తీసుకుని సంజయ్ ని భయపడతాడు.

విశ్లేషణ

ఈ సీరియల్ నేను, నా భార్య క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాం. ఈ సీరియల్లో హీరో బాలు క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ని పోలి ఉందని నా భార్య అంటూ ఉంటుంది, నిజాయితీగా ఉంటూ, నిజాలు మాట్లాడుతూ, ఎవరితోనూ మాట పడకుండా తప్పు చేసిన వాళ్ళని ఎంతమాటైనా అనేసే బాలు క్యారెక్టర్ అంటే నా భార్యకి చాలా ఇష్టం. నిజ జీవితంలో నేను కూడా అలాగే ప్రవర్తిస్తాను అనే ఉద్దేశంతో ఆమె “గుండె నిండా గుడి గంటలు” సీరియల్ లో బాలు క్యారెక్టర్ మీలానే ఉంటుంది అని తరచూ అంటూ ఉంటుంది. ఇలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తో నేచురల్ గా తెరకెక్కుతున్నఈ సీరియల్ మాలానే చాలామందిని ఎంతో ఆకట్టుకుంటుంది.

ఇక సీరియల్ విషయానికి వస్తే, ఇప్పటికే తన సంసారానికి సంబంధించిన ఇబ్బందులతో సతమతమవుతున్న బాలు జీవితంలో, చెల్లి మౌనిక సమస్యలు కూడా తోడయ్యాయి. ఒక బాధ్యత గల అన్నగా, ఒక బాధ్యత గల భర్తగా బాలు ఎలా ఎలా గట్టెక్కిస్తాడు అనే విషయాలపై రాబోయే ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన వెబ్ సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి. ఈ సీరియల్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

Leave a Comment