కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఇది సూపర్ హిట్ సీరియల్
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 22/05/2025 మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు నాట ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయం తరతరాల నుంచీ ఉంది. ఈ మధ్యకాలంలో గ్లోబలైజేషన్ వల్ల ఉమ్మడి కుటుంభాల వ్యవస్థ విచ్ఛిన్నమయ్య, చిన్నచిన్న ఫ్యామిలీస్ గా రూపాంతరం చెందాయి. కానీ ఆధునిక సమాజంలో ప్రతి మనిషికి ఉమ్మడి కుటుంబంలో జీవించాలని ఉంటుంది. అది నిజ జీవితంలో ఇప్పటి జనరేషన్ కి కుదరకపోవడంతో అలాంటి కథలతో వస్తోన్న సినిమాలకు, సీరియల్స్ కి విశేష ఆదరణ దక్కుతోంది. అలాంటి సీరియల్స్ లో “గుండె నిండా గుడిగంటలు” ఒకటి. మధ్య తరగతి మహాభారతాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
హైలెట్స్
- శివ ఇచ్చిన డబ్బుల్ని సత్యం కి ఇచ్చిన బాలు
- బాలుపై రోహిణి అనుమానం
- మీనాకి వార్నింగ్ ఇచ్చిన బాలు
- మీనాని ఇంటికి రావోద్దన్న శివ
డబ్బులు సత్యం కి ఇచ్చిన బాలు
బాలుపై రోహిణి అనుమానం
శివ ఇచ్చిన డబ్బులను ఇంటికి తీసుకువచ్చిన బాలు పోలీసుల ద్వారా ఇవి రికవరీ అయినట్టుగా అందరికీ అబద్ధం చెప్తాడు. కానీ అందరూ అనుమానంగానే చూస్తారు. రోహిణి అయితే పోలీస్ కేస్ అవ్వకుండా డబ్బులు రికవరీ అవ్వవు కదా? అని బాలుని అడుగుతుంది. నాకు తెలిసిన పోలీసు వల్ల ఈ డబ్బులు వెనక్కి వచ్చాయి. అయినా పోలీసులు గురించి, కోర్ట్ ల గురించి నీకెలా తెలుసు? అని అడుగుతాడు బాలు. తనకు తెలిసిన లాయర్ వల్ల ఈ విషయాలు తెలుసుకున్నానని రోహిణి కవర్ చేస్తుంది. ఆ దొంగ ఎక్కడ అని ప్రభావతి అడిగితే, జైల్లో ఉన్నాడు వెళ్లి చూస్తావా? అని బాలు అంటాడు.
డబ్బులు నేను దాస్తాను
జైలు అనే మాట విని, ఉదయం మీ ఆవిడా అలాగే అంది, ఇప్పుడు నువ్వు అలాగే అంటున్నావు అంటూ బాలుపై ప్రభావతి విసుక్కుంటుంది. మొత్తానికి బాలు ఎంత కవర్ చేసినా, రోహిణి ప్రభావతి అనుమానంగానే చూస్తారు. నాన్న డబ్బులు జాగ్రత్త. ఈ డబ్బులు మీద చాలా మంది కళ్ళు ఉన్నాయి అని బాలు సత్యంతో అంటాడు. దానికి మనోజ్ సీరియస్ అవుతాడు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే, నువ్వెందుకురా భుజాలు తడుముకుంటున్నావు అని బాలు మనోజ్ తో అంటాడు. ఆ డబ్బులు దాచి పెడతాను ఇవ్వండి అని ప్రభావతి అడుగుతుంది. ఇంతకుముందు చేసింది చాలు. నేనే భద్రంగా దాచిపెడతాను అంటూ సత్యం ఆ డబ్బు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. బాలు చెప్పిన దాంట్లో నిజం లేదని రోహిణి బలంగా నమ్ముతుంది.
రోహిణి అనుమానం
మనోజ్ బాలుకి సపోర్ట్
గదిలోకొచ్చిన రోహిణి ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడికి మనోజ్ వస్తాడు. బాలు ఎంత కవర్ చేసినా గాని అబద్ధాలే చెప్పాడని, దొంగతనం అయిన డబ్బులు మొత్తం తిరిగి రావని, ఆ దొంగకి బాలుకి ఏదో సంబంధం ఉండి ఉంటుందని మనోజ్ తో రోహిణి అంటుంది. ఇంతలో ఆ గది వైపు వస్తున్నమీనా, ఆ మాటలు విని ఆగుతుంది. బాలుకి కోపం ఎక్కువ అంటే నమ్ముతాను. కానీ వాడు డబ్బు కోసం గడ్డి తినే రకం కాదు అంటాడు మనోజ్. దొంగతనం రికవరీ డబ్బును పోలీసులే తిరిగి ఇస్తారని, అందులో ఎంతో కొంత ఖర్చు అయిపోతుందని, కానీ మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడంటే.. ఇందులో ఏదో మతలబు ఉందని, అదేదో త్వరలోనే కనిపెడతానని రోహిణి అంటుంది. పోయిన డబ్బు దొరికింది కదా? ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం అన్నట్టుగా మనోజ్ మాట్లాడుతాడు. మీనా కూడా అనుమానం వచ్చినట్టుగా చూస్తుంది.

పుట్టింటికి వెళ్ళవద్దు
మీనాకి బాలు వార్నింగ్
బాలు తన గదిలో కూర్చుని, ముందు రోజు శివ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన జోలికి రావద్దని, మా అక్కను ఇందులో ఇన్వాల్వ్ చేయవద్దని, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానని, నాకు గుణ అండగా ఉన్నాడని శివ తనతో అన్న మాటలు బాలు గుర్తు చేసుకుంటూ కోపంగా ఉంటాడు. ఇంతలో ఆ గదిలోకి మీనా వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు బాలు. మా ఇంటికి వెళ్లానని, శివ గుణదగ్గర పనిచేయడానికి వెళ్ళవద్దని చెప్పడానికి వెళ్ళానని, అయినా వాడు మాట వినలేదని మీనా బాలు తో అంటుంది. నేను మీ తమ్ముడు శివ గురించి చెప్పి, మీ ఇంటికి నిన్ను పంపించానా? అని అడుగుతాడు. ఆ విషయం మీకు తెలియదు కదా? నేనే కదా వెళ్లాను అంటుంది మీనా. మా అక్కను మధ్యలో పెట్టి, నువ్వు డ్రామాలాడుతున్నావని నన్ను అంటున్నాడు…వాడు.
వాడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడా?
ఆ మాటకి మీనా, వాడిని ఎప్పుడు కలిశారు? అని అడుగుతుంది మీనా. అంతా దరిద్రపు పని నేను చేయను. వాడే స్టాండ్ కి వచ్చి, నేను కలగజేసుకుంటున్నానని, మధ్యలో నీకు చెప్పి పంపిస్తున్నానని అంటున్నాడు అంటాడు. ఇంత గొడవ జరిగిన తర్వాత వాడు మిమ్మల్ని మళ్ళీ ఎందుకు కలిశాడు? ఏదో జరిగింది. మీరు చెప్పడం లేదు చెప్పండి అంటుంది మీనా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానని నువ్వు మాత్రం పుట్టింటికి వెళ్లడానికి వీల్లేదు అంటాడు బాలు. ఆ మాట విన్న మీనా షాక్ అవుతుంది. పెద్ద కారణం లేకపోతే గాని, మీరు ఇలా మాట్లాడరు ఏమైంది? అంటుంది మీనా. అవన్నీ నీకు అనవసరం, మీ తమ్ముడున్నచోటికి నువ్వు వెళ్ళవద్దు. కావాలంటే మీ అమ్మని, చెల్లిని ఇక్కడికి రమ్మను. లేకపోతే నువ్వే గుళ్లో కలుసుకో. ఇక నీ పుట్టింటికి వెళ్లొద్దు అంటూ మీనాకు వార్నింగ్ ఇచ్చి బాలు బయటికి వెళ్లిపోతాడు. మీనా షాక్ లో ఉండిపోతుంది.
శివ కి కాల్ చేసిన మీనా
మా జోలికి రాకండి
బాలు వెళ్లిపోయిన తర్వాత మీనా తన తమ్ముడు శివ కి ఫోన్ చేస్తుంది. నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా? బావని కలిసావా? అని అడుగుతుంది. ఏ బావ అని అడుగుతాడు శివ. ఆ మాటకి సీరియస్ అవుతుంది మీనా. మీ ఆయన్ని బావ అని పిలవాలని నాకు అనిపించడం లేదు. అందుకే అలా అన్నాను సారీ అక్క అంటాడు శివ. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఏమైనా గొడవలు ఉన్నాయా? అంటుంది. మీ ఆయన చెప్పలేదా అంటే, మీరిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారని, నేను నలిగిపోతున్నానని మీనా అంటుంది. నిన్ను ఏమైనా అన్నాడా అని శివ అంటే, పుట్టింటికి వెళ్ళొద్దని చెప్పాడు అంటుంది. నువ్వు గుణ దగ్గర పనిచేయడం బావకి ఇష్టం లేదు. నువ్వు చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోవచ్చు కదా అని అంటుంది. నా విషయాల్లో ఎవరూ కలగజేసుకోవద్దని నేను గుణ దగ్గరే పని చేస్తానని కరాకండిగా చెప్తాడు శివ.
రేపటి ప్రోమో
నువ్వు అక్కడే ఉండిపో
నా విషయంలో నిన్ను అనడం దేనికి? నన్ను వదిలేయమని చెప్పు అంటాడు. నీ విషయంలోనే బావకీ, నాకు మనస్పర్ధలు వస్తున్నాయని మీనా అనడంతో, నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా? అని శివ అడుగుతాడు. నన్ను బాగానే చూసుకుంటున్నాడని, నీవల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని మీనా అనడంతో, నిన్ను బాగానే చూసుకుంటే నువ్వు కూడా అక్కడే ఉండి పో. మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని శివ అనగానే, మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఫేస్ పెడుతుంది. నాకు మీరు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని, ఏం చేయాలో నాకు తెలుసునని, అమ్మని సుమతిని నేను బాగా చూసుకోగలనని, నాకు డబ్బు సంపాదించడమే ముఖ్యమని ,మీనా తో పొగరుగా మాట్లాడుతాడు శివ.
విశ్లేషణ
ఇలా ఆకట్టుకునే సన్నివేశాలతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఈ సీరియల్ ఇంతగా జనాధారణ పొందడానికి కారణం మధ్యతరగతి జీవితాల్లో ఉండే మనస్తత్వాల్ని అద్భుతంగా ఆవిష్కరించడం. ఈ విషయంలో దర్శకులు, రచయితలు అందరూ ఐడెంటిఫై అయ్యే విధంగా పాత్రలను సృష్టిస్తున్నారు. మన ఇళ్లలో జరిగే సన్నివేశాలనే, సీరియల్లో ఆకట్టుకునే విధంగా చూపిస్తూ ఈ సీరియల్ కి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఎక్కడ అతిశయం లేకుండా, సహజమైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇది టిఆర్పి రేటింగ్స్ లోనూ ముందంజలో ఉంది. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.








