గుండెనిండా గుడిగంటలు సీరియల్ 20/05/2025

అందమైన ఉమ్మడి కుటుంభం

ఆకట్టుకునే పాత్రలు

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 20/05/2025 గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో వీక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న పాత్రలు ఏమిటని బాలు, మీనా పాత్రలేనని చెప్తారు ఎవరైనా. భర్త బాలుపై మీనాకి అపారమైన ప్రేమ, అంతులేని నమ్మకం. అదేవిధంగా భార్య అంటే బాలుకి కూడా అమితమైన ప్రేమ. కొన్ని నిజాలు భార్యకు తెలిస్తే, భార్య బాధపడుతుంది అనే ఉద్దేశంతో ఇందులో బాలు పాత్ర నిజాలు చెప్పకుండా నిందలు మోస్తూ ఉంటుంది. ఇంత అన్యోన్యంగా సాగుతున్న వీళ్ళ సంసారంలో చిన్న చిన్న కలతలు రావడం ఈ సీరియల్ ని విజయవంతంగా ముందుకెళ్లడానికి దోహదపడుతున్నాయి. ఈ సీరియల్ స్టార్ మా లో సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రత్యేకత

  • ముగ్గురు అన్నదమ్ములు డాబాపై ఎందుకు పడుకున్నారని ప్రభ టెన్షన్
  • నీ ఏడుపు పిల్లల గురించి కాదన్న సత్యం
  • హోటల్ లో సర్వర్ జాబ్ చేసానని చెప్పిన మనోజ్
  • తోటి కోడళ్ళు ఏకమైపోతున్నారని ప్రభ కంగారు
  • ఫోన్ లో వీడియో చూడబోయిన మీనా

ఉదయాన్నే ప్రభావతి పంచాయితీ

విసుక్కున్న సత్యం

హాల్లో సత్యం కాఫీ తాగుతూ ఉంటాడు. అక్కడికి ప్రభావతి వచ్చి మీనా ఒక కాఫీ అంటుంది. అది విన్న సత్యం ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? ఆర్డర్ వేస్తున్నావ్? మీనా షాపులో పనుందని చెప్పి బయటకు వెళ్ళింది. నువ్వే వెళ్లి కాఫీ పెట్టుకుని తాగు అంటాడు. ఎప్పుడూ కూడా ఇంటిపట్టున ఉండకుండా ఆ షాపులోనే ఉంటుంది అని ప్రభావతి అనగానే, కాపురం చేయాలి షాపు కూడా చూసుకోవాలి కదా అంటాడు సత్యం. ఇంతలో రాత్రి డాబా పైన పడుకున్న మనోజ్ చాప దిండు తీసుకుని ఇంట్లోకి వస్తాడు. అది చూసిన ప్రభావతి అదేంట్రా పైన ఎందుకు పడుకున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదులేమ్మా అంటూ చిరాగ్గా పైకి వెళ్ళిపోతాడు మనోజ్. ప్రభావతికి ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. వెంటనే మనోజ్ రోహిణి లా రూమ్ దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంది.

ఈ ముగ్గురూ ఎందుకు కలిసారు

తలుపు తీసిన రోహిణిని చూసి “ఏంటి నీ మొహం అలా ఉంది” అని అడుగుతుంది. రాత్రి లేటుగా పడుకున్నానని రోహిణి చెప్పగానే, ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదనీ, తాను, మీనా, శృతి ముగ్గురూ కలిసి సరదాగా చాలా సేపు మాట్లాడుకున్నామని అందుకనే ఆలస్యం అయ్యింది అంటుంది రోహిణి. ఆ మాట విన్న ప్రభావతి షాక్ అవుతుంది. ముగ్గురూ కలవకూడదే ఎందుకు కలిసి మాట్లాడుకున్నారు అని మనసులో అనుకుంటూ, నన్ను కూడా పిలవకపోయారా? అని అడుగుతుంది. మీరు పడుకున్నారని చెప్పి పిలవలేదు ఆంటీ అంటుంది రోహిణి. ఇంతలో వాష్ రూమ్ నుండి మనోజ్ బయటకు వచ్చి బెడ్ పైన కూర్చుంటాడు. మనోజ్ మొహం చిరాగ్గా ఉంటుంది. అది చూసిన ప్రభావతి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. ఏమీ లేదండి అంటుంది. సరేనని చెప్పి ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

గుట్టు చెప్పిన మనోజ్

గదిలో చిరాగ్గా ఉన్న మనోజ్ నేను చాలా తప్పు చేశాను అంటాడు. అది విన్నరోహిని ఏంటి నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేసావా? అంటుంది. నీ గురించి కాదు, నేను మానేసిన జాబు గురించి మాట్లాడుతున్నాను. నా క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ దొరికే వరకూ నేను ఏమీ చేయను అంటాడు మనోజ్. ఆ మాట విన్న రోహిణి నువ్వు బాగా బద్దకస్తుడివి అందుకే ఏ పని చేయలేవు అని అవమానించడంతో అది విన్న మనోజ్, తాను హోటల్లో వెయిటర్ గా జాబ్ చేశానని, అక్కడ వాళ్ళు చాలా అవమానకరంగా చూడడంతో మానేశానని సీక్రెట్ బయట పెట్టేస్తాడు, హోటల్ లో వెయిటర్ గా పని చేసావా? అని రోహిణి షాక్ అవుతుంది.

నీ జాబ్..నీ ఇష్టం

ఎందుకు అక్కడ చేశావు అని అడిగితే, నీ వల్లే ఇదంతా. నువ్వు ఎప్పుడూ జాబ్ చేయి అని నన్ను టార్చర్ పెట్టడంతో, వేరే గత్యంతరం లేక ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యానని, అక్కడ ఎన్ని అవమానాలు జరిగినా భరించి ఉండాలనుకున్నానని, కానీ కుదరలేదని మనోజ్ అంటాడు, నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? నీ డిగ్రీకి సంబంధించిన జాబ్ చూసుకోమని చెప్తున్నాను అంటుంది రోహిణి. ఆ విషయం నువ్వు చెప్తే గాని నాకు తెలియదా? అని మనోజ్ అంటాడు. నీ జాబు నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో, ఏ భార్య అయినా తన భర్త నలుగురు ముందు గౌరవంగా బ్రతకాలనుకుంటుంది. ఉద్యోగం చేస్తేనే ఆ గౌరవం ఉంటుందని నేను చెప్తున్నాను అంటూ సీరియస్ గా రోహిణి గదిలోంచి బయటికి వెళ్లిపోతుంది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 28/05/2025
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 20/05/2025

కార్ ఏమయ్యింది?

అబద్ధం చెప్పిన బాలు

హాల్లో కూర్చున్న ప్రభావతి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. వాకింగ్ నుంచి ఇంటికి వచ్చిన సత్యం ఏంటి ఇంకా కాఫీ తాగలేదా? అని అడుగుతాడు. చల్లారిపోయిందని ప్రభావతి అనగానే చల్లారిపోయేవరకు ఏం చేస్తున్నావ్ అని సత్యం అంటాడు. ఈ ఇంట్లో వాతావరణం చాలా వేడిగా ఉందని, మనోజ్ గదిలో నుంచి గొడవ పడ్డట్టుగా మాటలు వినబడ్డాయని సత్యంతో అంటుంది. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి వెళ్లకూడదని, అలా వెళ్తే గొడవలు పెరిగి మరింత సమస్య వస్తుందని సత్యం అంటాడు. ఇంతలో బాలు పైనుండి చాప దిండు తీసుకుని హాల్లోకి వస్తాడు. బాలుని ఆగమని చెప్పి సత్యం కారు గురించి అడుగుతాడు. కారు టాక్సీ స్టాండ్ లో పెట్టానని ఫ్రెండు వాడుతున్నాడని అబద్ధం చెప్తాడు బాలు.

జోక్యం చేసుకోవద్దు అన్నారుగా?

ఎప్పుడూ ఇంటి ముందు ఉండే కారు టాక్సి స్టాండ్ లో ఎందుకు పెట్టావ్? నువ్వు కారుని, భార్యని వదిలిపెట్టి ఉండలేవు కదా? అంటుంది ప్రభావతి. నీకు చెప్తే సమస్యలు తీరుస్తావా? ఇంకా పెద్దవి చేస్తావ్ కనుక నువ్వు మాట్లాడకుండా ఉండడమే మంచిది అన్నట్లుగా బాలు మాట్లాడుతాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పరా, డబ్బులు ఏమైనా కావాలా? కారు రిపేర్ అయిందా? అని సత్యం అడగ్గానే అలాంటిదేమీ లేదని డబ్బులు ఏమి అవసరం లేదని బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాలు వెళ్లిన తర్వాత బాలు కూడా పైనే పడుకుని వస్తున్నాడు కదా? బాలుని ఎందుకు అడగలేదు? అని ప్రభావతిని అంటాడు. మీరే కదా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు అన్నారు అని ప్రభావం అంటుంది. ఆ మాటకి సత్యం తల కొట్టుకుంటాడు.

బాలు ఫోన్ తీసిన మీనా

కంగారుగా లాక్కున్న బాలు

బాలు తన గదిలో బెడ్ పైన కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. అందులో ఉన్న వీడియో గురించి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇది ఇందులో ఉంటే నాకు మనశ్శాంతి ఉండట్లేదు. డిలీట్ చేద్దామని అంటే రాజేష్ గాడు వద్దన్నాడు. ఏం చేయాలో ఏంటో అనుకుంటూ సెల్ ని పరుపుకేసి కొడతాడు. అది చూసిన మీనా ఏమైంది ఇలా ఉన్నాడు అనుకుంటుంది. మీనాని చూసిన బాలు టవల్ తీసుకుని వాష్ రూమ్ లోకి వెళ్తాడు. వెంటనే బాలు ఫోన్ తీసి ఏముందో చూద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలోనే బాలు వాష్ రూమ్ నుంచి తిరిగి వస్తాడు. మీనా ఫోన్ చూడడం చూసి గబగబా వచ్చి మీనా చేతిలో ఫోన్ లాక్కుంటాడు.

చూస్తే తప్పేంటి?

అలా సడన్ గా బాలు ఫోన్ లాక్కునే సరికి మీనా తలకి తగులుతుంది. కంగారు పడుతుంది. ఫోన్ ఎందుకు చూస్తున్నావ్? అని అడుగుతాడు. భర్త ఫోను భార్య చూస్తే తప్పేంటి? అని మీనా అంటుంది. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అని బాలు అంటాడు. ఏముంది అందులో అంత కంగారు పడుతున్నారు అంటే, ఇందులో లక్షల లక్షలు డబ్బులు ఉన్నాయని, నువ్వు చూస్తే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతావేమోనని కంగారు పడుతున్నాను అంటాడు ఎటకారంగా బాలు. ఎదుటి వాళ్ళు ఫోన్ చూడడం సంస్కారం కాదు. నీ ఫోను నేను ఎప్పుడైనా చూసానా? అని మీతో అంటాడు. వెంటనే మీనా చూడండి అంటూ పక్కనే ఉన్న తన డబ్బా సెల్ ఫోను తీసి బాలు చేతిలో పెడుతుంది. ఇంత స్మార్ట్ ఫోన్ ని నేను ఓపెన్ చేయలేను అని బాలు అనడంతో, మీనా చిరాగ్గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

ప్రభావతి ఆత్రుత

ఏం జరుగుతుందో తెలియక సతమతం

మీనా, బాలు గదిలో ఏదో గొడవ జరుగుతుందని అనుకుంటూ మెట్ల వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి. మీనా కోపంగా దిగడం చూసి ఏమీ తెలియనట్టుగా మళ్లీ కుర్చీలో కూర్చుంటుంది. ఇంతలో రవి పైనుంచి దిండు చాపా తీసుకుని హాల్లోకి వస్తాడు. తల్లిని చూసి కంగారు పడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మీనా తో “వదినా శృతి లేచిందా” అని అడిగితే, డాబా పైన ఎందుకు పడుకున్నావు? అని మీనా అడుగుతుంది. ఏదో చిన్న గొడవ జరిగిందని, అందుకే పైన పడుకున్నానని, రాత్రి తను ఏమైనా తిన్నదో లేదో అని రవి కంగారు పడతాడు. శృతి చిన్న పిల్లల మనస్తత్వం కలదని ఏమీ జరగదని అంటుంది మీనా.

Gunde Ninda Gudigantalu Serial 27/05/2025
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025

శ్రుతిని అడిగి చూడు

ఈ మాటలన్నీ వింటున్న ప్రభావతి చెట్టు అంత తల్లిని నేనిక్కడ ఉంటే, వెళ్లి మీనాకి చెప్తావ్ ఏంటి అంటూ కొడుకు పై అరుస్తుంది. నేను చెట్టులతోనూ, పుట్టలతోనూ మాట్లాడను అంటాడు రవి. ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తుంది ప్రభావతి. రవి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి సత్యం రావడంతో, చూడండి ఈ రవి గాడు అసలు ఏమీ చెప్పడం లేదు. నా మాట వినడం లేదు. ఇంట్లో గొడవలు జరుగుతున్నా నాకు తెలియడం లేదు అంటుంది. రవి కాబట్టి ఆమాత్రమైనా సమాధానం చెప్పాడు, అదే శృతిని అడిగి చూడు ఒక్క మాట కూడా నీతో చెప్పదు అని సత్యం నవ్వేస్తాడు. ఆ మాటకి మీనా కూడా నవ్వడంతో ప్రభావతి సీరియస్ గా చూస్తుంది.

రేపటి ప్రోమో

రేపటి ఎపిసోడ్ లో, టాక్సీ స్టాండ్ దగ్గరికి గుణ, శివ వస్తారు. ఈ డబ్బు గురించే కదా నన్ను కొట్టింది అంటూ శివ కొంత డబ్బు తీసి బాలు కి ఇస్తాడు. ఇది మా నాన్న డబ్బు మా నాన్న దగ్గరికి చేరాలి అంటాడు బాలు. ఇంట్లో సత్యం కి డబ్బులు అందిస్తాడు బాలు. ఈ డబ్బులు ఏంటి? అని అడిగితే, అమ్మ దగ్గర దొంగలు కొట్టేసిన డబ్బులు ఇవేనని, ఇవి మీకే చెందాలని బాలు అంటాడు. ఆ మాట విన్న ప్రభావతి ఆ దొంగ దొరికాడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎవడు వాడు? అని ప్రశ్నిస్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

విశ్లేషణ

బాలు దొంగ దొరికాడని ఇంట్లో చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా వాడిని ప్రభావతి చూడాలని అంటుంది. ఆ దొంగ శివ అని తెలిస్తే మీనా బాధపడుతుంది. మీనా కి ఇంట్లో విలువ కూడా తగ్గిపోతుంది. అందుకోసమే ఈ రహస్యాన్ని బాలు ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి శివ దొంగ అని తల్లి ప్రభావతికి తెలియకుండా, అలాగే మీనా కి తెలియకుండా బాలు మరిన్ని నాటకాలు ఆడే పరిస్థితి రాబోయే ఎపిసోడ్స్ లో మనం చూడొచ్చు. ఒక నిజం తెలిస్తే కొంత మంది బాధపడతారు, మరి కొంతమంది ఆనందపడతారు. ఎవరికి ఏ టైంలో నిజం తెలియాలో ఆ టైంలోనే తెలియాలని బాలు తపనపడుతూ ఉంటాడు. సీరియల్ మరింత విజయవంతంగా ముందుకు సాగనుంది. రెగ్యులర్ సీరియల్ అప్డేట్స్ కోసం మన వెబ్ సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Leave a Comment