సీరియల్ వివరాలు
టెక్నికల్ టీం
| నిర్మాణ సంస్థ | గగన్ టెలీ షో |
| మాటలు | ఆసం శ్రీనివాస్ |
| స్క్రీన్ ప్లే | దిలీప్ బసవ |
| ఎడిటింగ్ | శ్రీకాంత్ ముసిని |
| నిర్మాత | గుత్తా వెంకటేశ్వర రావు |
| దర్శకత్వం | బైరి నరేష్ గౌడ్ |
గుండెనిండా గుడిగంటలు సీరియల్ 23/04/25 ఎంతో ఆసక్తికరంగా ఆకట్టుకునే సీన్స్ తో ముందుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. మనోజ్ స్వీట్ బాక్స్ పట్టుకుని ఇంటికి వస్తాడు. ఇంట్లో అందర్నీ రమ్మని పిలుస్తాడు. ఏమైందిరా అంటూ అందరూ వస్తారు. బాలు కూడా అక్కడే ఉంటాడు. బాలు మాత్రమే సంపాదిస్తున్నాడని గర్వంతో వాడి భార్య మీనా హల్వా తీసుకొచ్చాడు కదా ఈరోజు నాకు కూడా నా చదువు తగ్గ ఉద్యోగం వచ్చింది.. అందుకే స్పీడ్ బాక్స్ తీసుకొచ్చా అని మనోజ్ అందరితోనూ చెప్తాడు. మనోజ్ చెప్పే విషయాలకి బాలు ఎంత ఎటకారమాడినా పట్టించుకోకుండా అందరికీ స్వీట్స్ పంచుతాడు మనోజ్. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఉద్యోగం పురుష లక్షణం
జాబ్ కొట్టిన మనోజ్
మనోజ్ తన చదువు తగ్గ ఉద్యోగం వచ్చిందని చెప్పగానే రోహిణి తో పాటు ఇంట్లో ప్రభావతి ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బాలు మాత్రం షాక్ అయ్యి, మీనా ఒక్కసారి గిల్లు అంటాడు. మీనా బాలుని గట్టిగా గిల్లుతుంది. బాలు.. అమ్మో ఇది కల కాదు అయితే నిజమేనన్నమాట అంటాడు. ప్రభావతి ఎంతగానో సంతోషిస్తుంది. నిన్ను అన్నవాళ్ళ అందరి నోళ్లు ముగించావు అని ప్రభావతి అంటుంది. స్వీట్స్ ముందు అత్తయ్యకి మామయ్యకి ఇవ్వమని రోహిణి చెప్తుంది. ఇంతకీ నీకేం ఉద్యోగం వచ్చింది రా అని మనోజ్ ని అడుగుతాడు బాలు. చదువు తగ్గ ఉద్యోగం వచ్చింది అంటాడు మనోజ్. అయితే జీతం నెలాఖరుని ఇస్తారు కదా ఇప్పుడే ఎందుకు స్వీట్స్ తీసుకువచ్చావ్ అని అడుగుతాడు.. అంటే నువ్వు పని చేసే చోట ఏ రోజు కూలి ఆ రోజే ఇస్తారా? అని అడగ్గానే మనోజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.
మొదటి రోజే ఇన్సెటివ్
వెంటనే మనోజ్ కి తను పనిచేసే హోటల్లో మేనేజర్ టిప్ ఇచ్చిన సంగతి గుర్తుకొస్తుంది. అది చూసి ఆనందంతో తీసుకున్న విషయం గుర్తు చేసుకుని, మా బాస్ అందరిలా కాదని, మంచి మంచి ఇన్సెంటివ్స్ ఇస్తాడని చేరిన మొదటి రోజే ఇన్సెటివ్ సంపాదించానని మనోజ్ అంటాడు, అందరికీ స్వీట్స్ పంచుతాడు, స్వీట్స్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతున్న మనోజ్ దగ్గర బాలు కూడా ఒక స్వీట్ తీసుకుంటాడు. రోహిణి కి స్వీట్ తినిపిస్తాడు. మనోజ్ అమ్మానాన్న అందరూ ఆనందపడతారు.
మనోజ్ కి దిష్టి తియ్యి
రోహిణి ..మనోజ్ కి దిష్టి తీసి పడేమని ప్రభావతి అంటుంది. అలాగే గుడికి వెళ్లి 11 కొబ్బరికాయలు కొడతానని అంటుంది. ఈ ఉద్యోగం అయినా సరిగ్గా చేసుకోమని తండ్రి చెప్తాడు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ ఓనర్ల బిహేవ్ చేయకుండా, నౌకర్లా ఉండమని బాలుకి బాలు మనోజ్ కి ఉచిత సలహా ఇస్తాడు, మనోజ్ తెచ్చిన హల్వా తిని అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు అంటాడు బాలు. నేను కస్టమర్స్ ని ఆ హోటల్ దగ్గర ఎక్కువ దించుతానని, అందరూ కలిసి మనోజ్ పని చేసే కంపెనీకి వెళ్దామని బాలు అనడంతో, బాలు మాటలు విని మనోజ్ రోహిణి కంగారు పడతారు.
రోహిణి ఆనందం
మనోజ్ కి పొగడ్తలు
తమ బెడ్ రూమ్ లో రోహిణి మనోజ్ చాలా ఆనందంగా ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇంట్లో తలెత్తుకునేలా చేసావని మనోజ్ ని పొగడ్తలతో ముంచేస్తుంది. మనోజ్ కూడా రోహిణి మాటలకు చాలా సంతోషిస్తాడు. మనోజ్ కి రోహిణి స్వీట్స్ తినిపిస్తుంది. అందరి ముందు మనోజ్ కి స్వీట్ తినిపించలేకపోయానని, బాలు మనల్ని ప్రశాంతంగా ఉండనీడని అంటుంది రోహిణి. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతాడు మనోజ్. చదువుకు తగ్గ జాబ్ రాలేదని ఎన్ని రోజులు తన వెయిట్ చేశానని ,సంపాదించుకోవాలంటే పెద్ద కష్టమేమీ కాదు అంటాడు మనోజ్. ఇంతకీ ఏం జాబ్? అని అడుగుతుంది రోహిణి.
సమయం వచ్చినపుడు చెప్తాను
రోహిణి అడిగినదానికి ఏం సమాధానం చెప్పాలో తెలీక సతమతమవుతాడు మనోజ్. అంత గొప్ప జాబ్ కాదన్నట్టు మాట్లాడుతాడు. ఏ జాబ్ అని అడిగితే ఏదైతే ఏముంది అన్నట్టుగా మాట్లాడుతాడు. నాకు జాబ్ కి వెళ్లడం పెద్ద ఇష్టం లేదని, కానీ మనం ఇంటిలో మర్యాదగా ఉండాలి కాబట్టి నీకోసం జాయిన్ అయ్యానని చెప్తాడు మనోజ్. నీ మీద నమ్మకం ఉండబట్టే నీతో వచ్చానని, నీతో ఉంటున్నానని, రోహిణి ధైర్యం చెబుతుంది. నేను ఏ జాబ్ చేస్తున్నాను చెప్పగలిగే రోజు వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానని మనోజు రోహిణి తో రిక్వెస్ట్ చేస్తాడు. భర్త మాటలు అర్థం చేసుకున్న రోహిణి మనోజ్ ని వాటేసుకుంటుంది. నువ్వు ఇష్టం వచ్చినప్పుడే చెప్పు అప్పటివరకు నేను ఏమి అడగను అంటుంది.
మీనా మెడలో పసుపుతాడు
పుస్తెలతాడు ఏమైంది
మీనా పూల బుట్టతో ఇంట్లోంచి బయటికి వస్తుంది. ఇంతలో పూల కోసం అక్కడికి వచ్చిన పక్కింటి ఆమె మీనా మెడలో పసుపు తాడు ఉండడం చూసి, ఏంటి మీనా పసుపు తాడు వేసుకున్నావు అని అడుగుతుంది. ఆ మాటకి మీనా షాక్ అవుతుంది. ఇంతలో మీనా మామగారు అటుగా వస్తూ అక్కడ ఆగి ఆ మాట వింటాడు. ఇంతకుముందు నీకు పుస్తెలతాడు ఉండేది కదా ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది పక్కింటి ఆమె. మీ అత్తగారు నీకు పుస్తెల తాడు లేకుండా తీసేసుకుందా అని ప్రశ్నిస్తుంది. పక్క వీధిలో ఒక అత్తగారు ఇలాగే చేస్తుందంట కోడలు దగ్గర ఉన్నవన్నీ లాక్కొని తీసి దాచేస్తుందట మీ అత్తగారు కూడా అలాగే చేస్తుందా? అని అడుగుతుంది.
మీనా మాటలకి సత్యం ఫిదా
పుస్తెలతాడు హుక్కు తెగిపోయింది అని, దాని గురించే షాపులో బిజీగా ఉండడం వల్ల రిపేర్ చేయించుకోలేదని, అంతకుమించి నువ్వు అనుకున్నట్టుగా మా ఇంట్లో ఏమీ జరగలేదని మా అత్తగారు మమ్మల్ని అందరినీ కూడా సొంత తల్లిలా చూసుకుంటుందని అత్తగారి గురించి గొప్పగా చెప్తుంది మీనా. ఏమీ లేదమ్మా ఎప్పుడో ఇలా చూడలేదు కదా అని అడిగాను.. ఏమీ అనుకోకంటూ పక్కింటి ఆవిడ అక్కడి నుంచి పూలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రభావతి బయటికి వచ్చి మీనా మీద వంట ఎవరు చేస్తారు? అంటూ కేకలు వేస్తుంది. ఆ మాట అక్కడ ఉన్న మీనా మామగారు, అలాగే పూలు తీసుకుని వెళ్ళిపోతున్న పక్కింటి ఆమె కూడా వింటారు. మీనా బాధపడుతుంది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 23/04/25
మా అత్త తల్లిలా చూసుకుంటుంది
ఏంటి మీనా మీ అత్తగారు తల్లిలా చూసుకుంటుందని చెప్పావ్? ఎందుకలా అరుస్తుంది అని తిరిగి వచ్చి అడుగుతుంది పక్కింటి ఆమె. మా అత్తగారికి నేను కష్టపడడం పెద్దగా ఇష్టం ఉండదని ఇంట్లోనే ఉండమంటుందని, రోజంతా కష్టపడవద్దు అని చెప్తుందని అందుకనే అలా సీరియస్ అయిందని మీనా సర్ది చెప్తుంది మీనా. ఆ మాటలు వింటున్న మీనా మామగారు మీనా మాటలకి ఎంతగానో ఆనందపడతాడు. సరే నువ్వు బాగుండాలి మీనా అని వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్తున్నమీనా మామ గారితో ..మామయ్య గారు టీ పెట్టమంటారా? అని అడుగుతుంది. అవసరం లేదమ్మా నీకు పని ఉంది కదా పని చూసుకుని రా అని మీనాని వెళ్ళమంటాడు. మీనా బయటకి వెళ్ళిపోతుంది.
ప్రభావతి పై సీరియస్
మీనాని అర్ధం చేసుకో
లోపలికి వచ్చిన ప్రభావతి భర్త ప్రభావతి మీద సీరియస్ అవుతాడు. మీనా నామీద లేనిపోని విషయాలన్నీ చెప్పిందా నామీద అరుస్తున్నారు అంటుంది ప్రభావతి. బయట నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. మీనా లేనిపోనివేమీ చెప్పలేదు అని సీరియస్ అవుతాడు భర్త. ఇంటి పని అంతా వదిలేసి పూల కొట్టులో కూర్చుని ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? అంటుంది ప్రభావతి. మీనా తప్పితే ఇక ఇంట్లో ఎవరూ లేరా? నువ్వు కూడా ఇంట్లో ఆడమనిషివే కదా? నువ్వు ఎందుకని ఈ పనులన్నీ చేయవు అంటూ ప్రభావతి పై అరుస్తాడు. మా అత్త ఎంతో బాగా అమ్మలా, గొప్పగా మమ్మల్ని చూసుకుంటుందని అయన అంటే అవన్నీ మీరు ఉన్నారని నాటకం ఆడిందని ప్రభావతి అంటుంది. మీనాని అవమానించి మాట్లాడుతుంది ప్రభావతి. నువ్వు ఇంకొక జన్మ ఎత్తిన గాని మీనా లాంటి మంచి కోడల్ని అర్థం చేసుకోలేవు అన్నట్టుగా మాట్లాడుతాడు ప్రభావతి భర్త.
ఈ ఎపోసోడ్ హైలెట్స్
- మనోజ్ కి సర్వర్ జాబ్ రావటం
- మనోజ్ గురించి ప్రభావతి గొప్పలు
- ప్రభ మీనాని అవమానించినా, మీనా బయటి వాళ్ళకి గొప్పగా చెప్పటం
- మామగారు మీనా గొప్పతనాన్ని చూడటం
- స్వీట్స్ తింటూ బాలు చేసిన కామెడీ
ముగింపు
తర్వాత భాగంలో…బాలు చెల్లి, బావ బాలు కారు ఎక్కుతారు. బాలు చెల్లి తలకి గాయం అయ్యి కట్టు కట్టుకుని ఉంటుంది. బంగారం పుస్తెలు మీనా కోసం చేయించానని చెల్లికి చూపిస్తే బాలు బావ అవమానకరంగా మాట్లాడతాడు.








