ఈరోజు కథ
కార్తీకదీపం సీరియల్ 28/04/2025 ఎపిసోడ్ ఈరోజు కార్తీకదీపం సీరియల్ లో ఏం జరిగిందంటే.. కార్తీక్ మంచం పైన నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ పక్కన రౌడీ రౌడీ అని చూసుకుంటూ ఉంటాడు. పక్కన రౌడీ ఉండదు. ఏంటి పక్కనే పెన్ను పేపరు పెట్టేసి వెళ్లారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు కార్తీక్. మంచం పైనుంచి కిందికి వచ్చి రౌడీ రౌడీ అని పిలుస్తూ ఉంటాడు. ఇంటి లోపల అంతా కూడా రౌడీ కోసం వెతుకుతూ ఉంటాడు. లోపల ఎక్కడ కూడా కనిపించకపోతే వాళ్ళ అమ్మ పడుకున్నా బెడ్ రూమ్ దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తాడు. ఏంట్రా ఈ టైంలో పిలుస్తున్నావని, ఏమైందని వాళ్ళ అమ్మ అడుగుతుంది… ఇంకా మరింత కథ తెలుసుకోడానికి నా సీరియల్ రివ్యూ పూర్తిగా చదవండి.
కార్తీక దీపం సీరియల్ వివరాలు :
| నిర్మాణ సంస్థ | శాండిల్ వుడ్ మీడియా |
| స్క్రీన్ ప్లే | కె. ఉషారాణి |
| మాటలు | జాజుల నూకరాజు నాయుడు |
| దర్శకత్వం | కాపుగంటి రాజేంద్ర |
సౌర్య మిస్సింగ్
కార్తీక్ కంగారు
శౌర్య ఏమైనా నీ దగ్గరికి వచ్చిందా? అని అడుగుతాడు. లేదురా నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని అంటుంది…. కార్తీక్ వాళ్ళమ్మ. నిద్ర పట్టక ఏమైనా నీ దగ్గరికి వచ్చిందేమో అని అంటాడు కార్తీక్. బాబు ఇక్కడికి రాలేదు అని సౌర్య వాళ్ళ నాన్నమ్మంటుంది. మరి ఇక్కడకు రాకపోతే సౌర్య ఎక్కడికి వెళ్ళినట్టు అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు.
చెప్పులు లేవు
ఈలోపు రోడ్డుపైన సౌర్య ఒక లెటర్ పట్టుకొని పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది. సరే అయితే నేను వెళ్లి చూస్తాను అని కార్తీక్ అని బయటకు వచ్చేస్తాడు. సౌర్యా వాళ్ళ నాన్నమ్మ మీరేం బాధపడకండి నేను బయటకు వెళ్లి చూస్తాను అని అంటుంది. కార్తీక్ బయటికి వచ్చి రౌడీ రౌడీ అని పిలుస్తూ ఉంటాడు. అన్ని వైపుల నుంచి ఎక్కడా కూడా శౌర్య కనిపించదు. ఇంటి బయట ఒకవైపున వరుసగా ఉన్న చెప్పులను చూస్తాడు. ఆ చెప్పులు వరుసలో శౌర్య చెప్పులు కనిపించవు. కార్తీక్ ఇంటి లోపలికి వెళ్తాడు. శౌర్య వాళ్ళ నాన్నమ్మ శౌర్య ఎక్కడ కనిపించలేదు బాబు అని అంటుంది. బయట గేట్ తీసి ఉంది. సౌర్య చెప్పులు కూడా లేవు అని అంటాడు కార్తీక్. వాళ్ళ అమ్మ దగ్గరికి ఏమైనా వెళ్లిపోయి ఉంటుందా అని అంటాడు కార్తీక్.
అర్దరాత్రి సౌర్య కోసం వెతుకులాట
సౌర్య ని కొట్టబోయిన కార్తీక్
సౌర్య వాళ్ళ నాన్నమ్మ ఈ పిల్ల ఎవరికీ చెప్పకుండా ఎటు పోయినట్టు అని తల పట్టుకుంటుంది. ఈ లోపు కార్తిక్ సైకిల్ తీసుకొని హడావిడిగా బయలుదేరుతాడు. కార్తీక్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే రోడ్డుపైన పరిగెత్తుకుని వెళ్తున్న సౌర్య కనబడుతుంది. అరె శౌర్య ఆగు ఎక్కడికి వెళ్తున్నావని కార్తీక్ అడుగుతాడు. నాన్న వచ్చేసాడా అని సౌర్య కంగారు పడుతుంది. సౌర్యని చూసి బుద్ధుందా నీకు అని చెయ్యెత్తి కొట్టబోతాడు. కొట్టకుండా ఒక నిమిషం ఆగుతాడు .ఇప్పుడు నీకు టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి ఒంటిగంట అయింది. ఈ టైం లో మాతో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని కార్తీక్ శౌర్యను అడుగుతాడు. రా ఇంటికి వెళ్దామని శౌర్య చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు. నాన్నమ్మ ఎక్కడికి వెళ్లావే అని సౌర్య వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది.
దీపకి లెటర్ రాసిన సౌర్య
నేను అమ్మ దగ్గరికి పోలీస్ స్టేషన్ వెళుతున్నాను అని ఏడుస్తూ సమాధానం చెబుతుంది శౌర్య. ఆ మాటకి అందరూ కూడా బాధగా శౌర్య వైపు అలా చూస్తూ ఉంటారు. ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు. ఈ లెటర్ ఇవ్వడానికి అని, ఈ లెటర్ ఏంటి అని సౌర్య వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. అమ్మ ఎక్కడుందని అడుగుతుంటే మీరు ఎవరు కూడా చెప్పట్లేదు కదా అని అంటుంది శౌర్య. అందుకే పోలీసులకి ఈ లెటర్ ఇచ్చి అమ్మకి ఇవ్వమని చెప్పడానికి వెళుతున్నానని సమాధానం చెబుతుంది. శౌర్య లేదమ్మా అమ్మ వస్తుంది అని కార్తీక్ అంటాడు. లేదు నాన్న అమ్మ రాదు అంటుంది శౌర్య. సౌర్య మాటలకి అందరూ కూడా చాలా బాధగా చూస్తూ ఉండిపోతారు.

అమ్మ రానంత దూరంలో
జో నాకు చెప్పింది
అవును అమ్మ రానంత దూరంలో ఉంది అని ఏడుస్తూ చెప్తుంది శౌర్య. అమ్మ ఎప్పటికీ రాదు అని శౌర్య ఏడుస్తుంది. ఆ మాటలకి కార్తీక్ ఇలా అంటాడు… నీకు ఎవరు చెప్పారు అమ్మ రాదని అంటాడు కార్తీక్. జో చెప్పింది అని సౌర్య అంటుంది. జ్యో తో నువ్వు మాట్లాడటం నేను విన్నాను… నాన్న అంటుంది. నీవు వెళ్లిపోయిన తర్వాత నేను జో ని అడిగానని అంటుంది శౌర్య. తాను ఎక్కడుందో చెప్పనని తాను ఎప్పటికీ రాదని చెప్పిందని అంటుంది శౌర్య. జో ఇంటికి వచ్చిందంటే చాలు ఏదో ఒక పెంట పెడుతుంది అంటాడు కార్తీక్. దీప గురించి సౌర్య బాధపడకూడదు అని ఎదో సర్ది చెప్పుకుంటే, మీ అమ్మ ఎప్పటికీ రాదని చెప్పడంలో దాని అర్థం ఏంటి అని అంటాడు కార్తీక్ వాళ్ళమ్మతో.
జో ఎంత పని చేసింది
శౌర్య నువ్వు ఏడవకు నేను మీ అమ్మ దగ్గరకి నేను తీసుకువెళ్తాను అని సౌర్యకి మాటిస్తాడు. సరే నాన్న అంటుంది. నేను రాసిన లెటర్ మా అమ్మకి ఇవ్వమని చెప్తుంది. తప్పకుండా ఈ లెటర్ మీ అమ్మకి ఇవ్వమని చెప్తాను అంటాడు కార్తీక్. ఈ లెటర్ కూడా ఇచ్చానని అబద్ధం చెప్పకు అంటుంది శౌర్య. ఆ మాటకి కార్తీక్ అలా జాలిగా చూస్తాడు. చూసావా అమ్మ జో మాటలు విని శౌర్య ఎలా మాట్లాడుతుందో తను మీదున్న నమ్మకం నా మీద లేదు. అర్ధరాత్రి పూట శౌర్య రోడ్లు పైన పరుగులు పెట్టేటట్టు ఎలా చేస్తుంది? అసలు తనని ఏం చేయాలి అనేసి కార్తీక్ బాధపడతాడు.
లెటర్ చదివిన కార్తీక్
గౌతమ్ ఇంటికి వచ్చాడు
అసలు ఆ లెటర్ లో ఏముందని లెటర్ ని ఓపెన్ చేసి చూస్తాడు కార్తీక్. లెటర్ ని చదివి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూడమ్మా వాళ్ళ అమ్మ కోసం శౌర్య ఎంత బాధగా లెటర్ రాసుకుందని బాధపడతాడు. దీనంతటికీ కారణం ఎవరు జోష్నా జోష్నా జోష్నా అని సీరియస్ గా మాట్లాడుతాడు. ఆ మనిషిని ఏం చేయాలి అమ్మ అని కోపంగా మాట్లాడుతాడు. రేపు మనం దీప ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించాలి అంటాడు కార్తీక్. దీపకే వార్నింగ్ ఇవ్వడానికి మన ఇంటికి గౌతం వచ్చాడని అంటుంది దీప అత్తగారు. ఏంటి వాడు మన ఇంటికి వచ్చాడా ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అంటాడు కార్తీక్. ఏంటి గౌతమ్ ఇంటికి వచ్చి దీపక్ వార్నింగ్ ఇచ్చాడా అంటాడు. మరి నాకెందుకు చెప్పలేదని సీరియస్ గా మాట్లాడుతాడు. కార్తీక్ వాడు నా ఇంటికి వచ్చి నా భార్యకు వార్నింగ్ ఇస్తే నాతో చెప్పకుండా ఎలా ఉంటారు అమ్మ అని అంటాడు.
రెండు చెంపలు వాయించిన కార్తీక్
ఇద్దరి మధ్య గొడవ
బాబు వాడు దీపకే కాదు అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాడు… అంటుంది. కార్తీక్ కొద్దిసేపు ఆలోచించుకుంటూ ఉంటాడు. దీప జైల్లో ఉండేటప్పుడు మాట్లాడే మాటలు ఆలోచనలోకి వస్తాయి. లేదు కార్తీక్ బాబు నేను ఎవరిని కాల్చలేదు. అసలు ఆ గన్ ఎలా పేలిందో కూడా నాకు తెలీదు అంటుంది దీప. ఆ మాటలని కార్తీక్ గుర్తు తెచ్చుకుంటాడు. దీప చేతుల్లోనే గన్ పేలకుండానే మామకి బుల్లెట్ ఎలా తగిలిందో నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు కార్తీక్.
మగాడిగా బ్రతుకు
గౌతమ్ దగ్గరికి వెళ్తాడు కార్తిక్. గౌతమ్ ని చంప దెబ్బలు కొడతాడు. రే కార్తిక్ నన్ను ఎందుకు కొడుతున్నావ్ రా అని అడుగుతాడు. నువ్వు అసలు మగాడివేనే రా అని అడుగుతాడు కార్తీక్. ఏంటి కనిపించట్లేదా మీసాలు గడ్డాలు చూస్తుంటే అంటాడు గౌతం. మగతనం అంటే మీసాలు గడ్డలు రావడం కాదురా మగాడిగానే బ్రతకాలి రా అంటాడు కార్తిక్. ఇప్పుడు నేను చీర, జాకెట్, గాజులు వేసుకుని తిరుగుతున్నాను అంటావా అంటాడు గౌతమ్. నేను లేని టైం చూసి నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి వార్నింగ్ ఇస్తావా? నీవేం మగాడివి రా అంటాడు కార్తీక్.
నువ్వే ఈ పని చేసావ్
కార్తీక్ మాటలకి అది ఎప్పుడో జరిగిపోయింది కదా అంటాడు గౌతమ్. అంటే నేను తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నాను అనుకుంటున్నావా అంటాడు కార్తీక్. రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం అనసూయ గారు నాతో చెప్పారని అంటాడు కార్తీక్. అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది.. దీప చేతిలో గన్ పేలకుండానే మా మామ గుండెల్లో బుల్లెట్ ఎలా దిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఎలా తగిలిందో చెప్పు? ఎలా తగిలిందో చెప్పు అని గౌతమణి నిలదీస్తాడు. దీపే హత్య చేసిందని దీపని రిమాండ్ లో పెట్టారు చెప్పరా? ఈ హత్య ఎలా జరిగిందో అని సీరియస్ గా అడుగుతాడు. గౌతం నువ్వే రా ఈ హత్య చేశావు అని కార్తీక్ అంటే నాకు కాబోయే మావ నేను ఎందుకు చంపుకుంటాను అని అంటాడు గౌతం.
నీ భార్యని కాపాడుకో
నువ్వు దీపని చంపాలని అనుకున్నావు…కానీ ఆ బుల్లెట్టు దీపకి తగలకుండా మావయ్య గారికి తగిలిందని అంటాడు కార్తీక్. కార్తీక్ మాటలకి ఊరికే నన్ను అనుమానించకు అంటాడు గౌతం. నువ్వు నిజం ఒప్పుకోకపోతే నిన్నుకొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లవలసిందే అంటాడు కార్తీక్. పోలీస్ స్టేషన్ కాదు కోర్టు వరకు తీసుకెళ్ళినా.. ఏమి చేయలేవు ఎందుకంటే నేను ఆరోజు అసలు హైదరాబాదులోనే లేనని అంటాడు గౌతమ్.
ముగింపు
ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర 100 సాక్ష్యాలు ఉన్నాయి. నేనే హంతకుడు అని ఒక సాక్ష్యం అయినా చూపించు అని అంటాడు గౌతమ్. నువ్వు సాక్ష్యం చూపిస్తే నువ్వు కొట్టుకుంటూ తీసుకెళ్లడం కాదురా, నేనే నీతో వస్తానని ఛాలెంజ్ చేస్తాడు గౌతమ్. నన్ను కేవలం అనుమానంతోనే కొట్టావని, నీ మీద నేను తిరిగి పోలీస్ కేసు పెడితే ఏమవుతుందో తెలుసా అంటాడు గౌతమ్. పెట్టరా చూసుకుందాం ఏం జరుగుతుందో అంటాడు కార్తీక్. ముందు నా గొడవ పక్కనపెట్టి నీ భార్య కాపాడుకో అంటాడు గౌతం. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
సీరియల్ ప్రత్యేకత
కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ తెలుగు సీరియల్ లో మంచి టీఆర్పి రేటింగ్స్ సాధిస్తోంది. ఈ సీరియల్ మొదటి సీజన్ ఆసియా నెట్ లో వచ్చిన మలయాళ టెలివిజన్ సిరీస్ “కరుతముత్తు”కి రీమేక్ గా వచ్చింది. ఇప్పడు తాజాగా నడుస్తున్న ఈ సీరియల్ రెండవ సీజన్ తెలుగు లో స్టార్ మా ఛానల్ లో సోమవారం నుండి శనివారం వరకూ రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ ముందుగా చూడలనుకున్నా, పాత ఎపిసోడ్స్ చూడాలన్నా హాట్ స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం లో సభ్యత్వం తీసుకుని చూడవచ్చు. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.








